IPL 2022: స్ట్రైక్‌ రేటు 375.. డీకేతో అట్లుంటది మరి! పట్టరాని సంతోషంలో కోహ్లి! | IPL 2022: Dinesh Karthik 375 Strike Rate Knock Virat Kohli Bows Down Viral | Sakshi
Sakshi News home page

Dinesh Karthik: స్ట్రైక్‌ రేటు 375.. దినేశ్‌ కార్తిక్‌తో అట్లుంటది! శెభాష్‌ అన్న కోహ్లి!

Published Sun, May 8 2022 6:49 PM | Last Updated on Sun, May 8 2022 7:49 PM

IPL 2022: Dinesh Karthik 375 Strike Rate Knock Virat Kohli Bows Down Viral - Sakshi

దినేశ్‌ కార్తిక్‌.. విష్‌ చేస్తున్న కోహ్లి(PC: IPL/BCCI)

IPL 2022 SRH Vs RCB: ఐపీఎల్‌-2022లో భాగంగా సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ దినేశ్‌ కార్తిక్‌ అదరగొట్టాడు. ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన అతడు 8 బంతుల్లోనే ఒక ఫోర్‌, 4 సిక్సర్ల సాయంతో 30 పరుగులు సాధించాడు. స్ట్రైక్‌ రేటు 375. కాగా కెప్టెన్‌ ఫాఫ్‌ డుప్లెసిస్‌(73- నాటౌట్‌)కు తోడుగా ఆఖర్లో డీకే అద్భుత ఇన్నింగ్స్‌ ఆడటంతో ఆర్సీబీ భారీ స్కోరు చేయగలిగింది.

ప్రత్యర్థికి 193 పరుగుల లక్ష్యాన్ని విధించింది. ఈ నేపథ్యంలో డీకేపై సోషల్‌ మీడియా వేదికగా ప్రశంసల వర్షం కురుస్తోంది. గత మ్యాచ్‌లలో ఫినిషింగ్‌ టచ్‌తో జట్టుకు విజయాలు అందించిన తీరును ప్రస్తావిస్తూ.. ‘‘ప్రస్తుత కాలంలో ప్రపంచంలో ఉన్న అత్యుత్తమ ఫినిషర్‌ దినేశ్‌ కార్తిక్‌’’ అంటూ ఫ్యాన్స్‌ కామెంట్లు చేస్తున్నారు.

ఇక సామాజిక మాధ్యమాల్లో చురుకుగా ఉండే టీమిండియా మాజీ క్రికెటర్‌ వసీం జాఫర్‌.. ‘‘10 బంతులు మిగిలి ఉండగా క్రీజులోకి వచ్చి అత్యద్భుతమైన ఇన్నింగ్స్‌ ఆడి.. నవ్వుతూ మైదానం వీడటం. ఇది కేవలం డీకేకే సాధ్యమవుతుంది’’ అని కొనియాడాడు.

ఇదిలా ఉంటే.. సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో గోల్డెన్‌ డక్‌గా వెనుదిరిగిన ఆర్సీబీ ఓపెనర్‌ విరాట్‌ కోహ్లి.. డీకే డ్రెస్సింగ్‌ రూమ్‌కు వెళ్తుండగా.. ‘‘టేక్‌ ఏ బో’’ అంటూ ఆత్మీయ ఆలింగనం చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌ అవుతోంది. కాగా సన్‌రైజర్స్‌ బౌలర్‌ జగదీశ సుచిత్‌ బౌలింగ్‌లో కోహ్లి గోల్డెన్‌ డకౌట్‌గా వెనుదిరిగాడు.

చదవండి👉🏾IPL 2022: డేవిడ్ వార్న‌ర్‌పై వీరేంద్ర సెహ్వాగ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement