RPN Singh
-
ప్రతిపక్ష సీఎం అభ్యర్థి ఆయనే
రాంచీ: రానున్న జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్ష కూటమి తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థిగా జేఎంఎం వర్కింగ్ ప్రెసిడెంట్ హేమంత్ సోరెన్ ఎంపికయ్యారు. దీనిపై జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం), కాంగ్రెస్, రాష్ట్రీయ జనతా దళ్(ఆర్జేడీ)లు ఓ అంగీకారానికి వచ్చాయి. రాష్ట్రంలోని మొత్తం 81 సీట్లకు గాను జేఎంఎం 43, కాంగ్రెస్ 31, ఆర్జేడీ 7 నియోజకవర్గాల్లో పోటీ చేయాలని నిర్ణయించినట్లు ఏఐసీసీ ఇన్చార్జి ఆర్పీఎన్ సింగ్, జేఎంఎం వర్కింగ్ ప్రెసిడెంట్ సోరెన్ వెల్లడించారు. సీట్ల సర్దుబాటుపై ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్‌తో చర్చించిన తర్వాతే ఖరారు చేస్తామని సోరెన్ తెలిపారు. 81 సీట్లున్న జార్ఖండ్ అసెంబ్లీకి ఈనెల 30వ తేదీ నుంచి ఐదు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఆర్జేడీ మద్దతు తీసుకోవడాన్ని హేమంత్ సోరెన్ సమర్థించుకున్నారు. ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌ను బీజేపీ మోసపూరితంగా అవినీతి కేసుల్లో ఇరికించిందని ఆయన ఆరోపించారు. లాలూ ప్రసాద్‌ను తీవ్రవాదిగా చూస్తోందని వ్యాఖ్యానించారు. తమ కూటమిలోని పార్టీలు ఎక్కడా స్నేహపూర్వక పోటీ చేయడానికి వీలు లేదని, అలా చేస్తే సంకీర్ణం నుంచి బయటికియ వెళ్లిపోవాల్సి ఉంటుందని ఆర్పీఎన్ సింగ్ స్పష్టం చేశారు. -
తగ్గుతున్న అల్లర్లు
ముంబై: రాష్ట్రంలో మతకల్లోలాలు, ఉగ్రవాదదాడులు గతంలో చాలాసార్లు సంభవించినా, వాటి సంఖ్య మెల్లగా తగ్గుముఖం పడుతున్నట్టు ప్రభుత్వ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. గత నాలుగేళ్లుగా ఇలాంటి అల్లర్లు 50 శాతం తగ్గాయని తెలిపాయి. హింసాత్మక ఘటనల నిరోధానికి పటిష్ట చర్యలు తీసుకోవడం వల్లే సత్ఫలితాలు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. అల్లర్ల బాధితుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలు అమలు చేయడం సానుకూల మార్పులకు కారణమవుతోంది. దేశవ్యాప్తంగా జరిగిన మతఘర్షణలపై బీజేపీ ఎంపీ గోపీనాథ్ ముండే, శివసేన సభ్యుడు ఆనంద్ పరాంజపే పార్లమెంటులో ఇటీవల అడిగిన ప్రశ్నలకు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి ఆర్పీఎన్ సింగ్ సవివర సమాధానాలు చెప్పారు. కేంద్ర హోంశాఖ గణాంకాల ప్రకారం వివరాలిలా ఉన్నాయి. మహారాష్ట్రలో 2010లో 117 హింసాత్మక ఘటనలు సంభవించగా, 16 మంది మరణించారు. అయితే ఈ ఏడాదిలో ఇప్పటి వరకు కేవలం 64 ఘటనలు నమోదుకాగా 11 మంది మృతి చెందారు. మనదేశంలో ఉత్తరప్రదేశ్‌లో అత్యధికంగా మతఘర్షణలు జరిగాయి. ఈ ఏడాది అక్కడ 500 ఘటనలు జరగగా, 95 మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఎలా నియంత్రించారంటే.. మహారాష్ట్రలో గత 15-20 ఏళ్లకాలంలో సంభవించిన మతఘర్షణలు, హింసాత్మక ఘటనలను లోతుగా విశ్లేషించిన అధికారులు, అలాంటివి పునరావృతం కాకుండా నిరోధించడానికి పటిష్ట చర్యలు మొదలుపెట్టారు. మతపరంగా సున్నితపరమైన ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఉంచాల్సిందిగా కమిషనర్లు, జిల్లా ఎస్పీలను ఆదేశించారు. మతసారస్య సాధనకు మొహల్లా కమిటీలను నియమించారు. ధుళే జిల్లాలో 2008లో జరిగిన మతఘర్షణలపై మహారాష్ట్ర సీనియర్ అధికారి ఒకరు స్పందిస్తూ... అక్కడ హింసకు దారితీసిన పరిస్థితుల గురించి సమాచారం సేకరించడానికి ప్రత్యేక విచారణ బృందాన్ని నియమించామని తెలిపారు. ‘చిన్న వివాదం తదనంతరం ఆ జిల్లాలో హింస మొదలయిందని మాకు తెలిసింది. విధుల్లో నిర్లక్ష్యం వహించి తక్షణ చర్యలు తీసుకోవడంలో విఫలమైన కొందరు పోలీసు అధికారులను కూడా సస్పెండ్ చేశాం. ధుళే అల్లర్ల నుంచి మేం ఎంతో నేర్చుకున్నాం. మతపరంగా సున్నితమైన ప్రాంతాల్లోని అన్ని వర్గాల నాయకులతో ప్రతినెలా సమావేశాలు నిర్వహించి సుహృద్భావ వాతావరణం నెలకొల్పేందుకు ప్రయత్నిస్తున్నాం’ అని ఆయన వివరించారు. తరచూ మొహల్లా కమిటీ సమావేశాలు ఏర్పాటు చేయడం ద్వారా అక్కడ అశాంతితగ్గుతుందని పోలీసులు చెబుతున్నారు. ఆ ప్రాంతంలోని సంఘవ్యతిరేక శక్తులపై గట్టి నిఘా పెట్టడం ద్వారా శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా జాగ్రత్తపడుతున్నారు. అంతేకాదు మతఘర్షణలు జరిగిన ప్రాంతాల్లో శాంతిసాధనకు ముఖ్యమంత్రి, హోంమంత్రి నేతృత్వంలో సమావేశాలు నిర్వహించడం సత్ఫలితాలను ఇచ్చిందని రాష్ట్ర హోంశాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ‘పోలీసుల నిర్లక్ష్యాన్ని మేం ఎంతమాత్రమూ సహించడం లేదు. ఘర్షణల నిరోధంలో విఫలమైన వారిని వెంటనే వెనక్కి పిలిపించి చర్యలు తీసుకుంటున్నాం’ అని ఆయన వివరించారు. నిఘా సమాచారాన్ని ఇచ్చి పుచ్చుకోవడం, అత్యవసర సమయాల్లో బలగాలను రాష్ట్రానికి పంపించడం ద్వారా కేంద్ర ప్రభుత్వం కూడా ఎంతగానో సాయపడిందని ఆయన వెల్లడించారు. ఉగ్రదాడులు, మతఘర్షణలు, నక్సల్స్ దాడుల వల్ల నష్టపోయిన వారికి కూడా కేంద్రం ఆర్థికసాయం అందజేస్తోంది. అల్లర్ల కారణంగా అనాథలుగా మారిన చిన్నారులకు చదువు చెప్పిండానికి కేంద్రం జాతీయ మతసామరస్య సంస్థ కూడా సహకరిస్తోంది. -
విస్తృత ఏకాభిప్రాయంతోనే విభజన: కేంద్రం
న్యూఢిల్లీ నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: తెలంగాణ బిల్లును పార్లమెంట్లో వీలైనంత త్వరగా ప్రవేశపెట్టడానికి చర్యలు తీసుకుంటున్నామని హోంశాఖ సహాయమంత్రి ఆర్.పి.ఎన్.సింగ్ మంగళవారం లోక్‌సభకు తెలిపారు. ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, ఇతర సభ్యులు అడిగిన ప్రశ్నకు ఆయన లిఖితపూర్వకంగా జవాబిచ్చారు. నూతన రాష్ట్రాల ఏర్పాటు విషయంలో మాతృరాష్ట్రంలో ఏకాభిప్రాయం ఉంటేనే కేంద్రం నిర్ణయం తీసుకుంటుం దని పేర్కొన్నారు. హోంమంత్రి షిండే నేతృత్వంలోని మంత్రుల బృందం(జీవోఎం) విభజనపై ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వివిధ రాజకీయ పక్షాలతో చర్చించిందన్నారు. టీ బిల్లుకు 5న జరగిన కేబినెట్ భేటీలో ఆమోదముద్ర పడిందన్నారు. దేశంలో విభజన డిమాండ్లు చాలా ఉన్నాయని, అయితే విస్తృత ఏకాభిప్రాయం ఉంటేనే కేంద్రం నిర్ణయం తీసుకుంటుందన్నారు. మహారాష్ట్రలో విదర్భ, గుజరాత్లో సౌరాష్ట్ర, కర్ణాటకలో కూర్గ్, ఒడిశాలో కోసలాంచల్, బెంగాల్లో గూర్ఖాలాండ్, బీహార్‌లో మిథిలాంచల్... తదితర ‘ప్రత్యేక’ డిమాండ్లు ఉన్నాయని వెల్లడించారు. యూపీని 4 రాష్ట్రాలుగా విభజించాలని ఆ రాష్ట్ర శాసనసభ తీర్మానం చేసి 2011 నవంబర్ 23న కేంద్రానికి పంపించిందని చెప్పారు. రాష్ట్రాల విభజన నిర్ణయాల ప్రభావం.. సమాఖ్య రాజకీయాల మీద నేరుగా ఉంటుందన్నారు. ప్రజల మనోభావాలకు వ్యతిరేకం: శివసేన న్యూఢిల్లీ నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: ఆర్టికల్-3ని వాడుకొని ప్రజల మనోభావాలను అణచివేయడం కేంద్రానికి తగదని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ అన్నారు. ఆయన మంగళవారం పార్లమెంటు ఆవరణలో విలేకరులతో మాట్లాడుతూ.. ‘‘తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ తీరుపై వ్యతిరేకత పెరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ విభజనపై పార్లమెంటులో చర్చ రాలేదు. అసెంబ్లీతో మూడింట రెండొంతుల మెజార్టీతో తీర్మానం రాలేదు. ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తూ.. ఈరోజు ఆంధ్రప్రదేశ్‌ను విభజిస్తున్నారు. రేపు మరో రాష్ట్రాన్ని విభజిస్తారు. శాసనసభ తీర్మానం లేకుండా విభజన ప్రక్రియలో ముందుకెళ్లడం అంటే.. ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా వెళ్లినట్లే. ముందుకెళ్ల వద్దనిచెప్పినా కేంద్రం పట్టించుకోవడం లేదు’’ అని వ్యాఖ్యానించారు. అసెంబ్లీ తీర్మానం తప్పనిసరి: జేడీయూ ‘‘ఏ రాష్ట్రాన్ని విభజించాలన్నా.. ఆ రాష్ట్ర శాసనసభ తీర్మానం తప్పనిసరిగా ఉండాలి. ఆ తీర్మానానికి పార్లమెంటు ఆమోదముద్ర వేయాలి. అప్పు డే రాష్ట్ర విభజన చేపట్టాలి. కేవలం కేంద్ర మంత్రివర్గ నిర్ణయం ప్రకారం రాష్ట్రాల విభజన చేయకూడదు. ఆర్టికల్-3ను సవరించాల్సిన అవసరముం ది.’’ జేడీ(యూ) ఎంపీ త్యాగి అన్నారు. ‘యూపీఏ గద్దె దిగాలి’ సాక్షి, న్యూఢిల్లీ: యూపీఏ ప్రభుత్వంపై విశ్వాసం లేదని కాంగ్రెస్ సభ్యులే తీర్మానం పెట్టారని, ఇంతకన్నా నీచమైన పరిస్థితి మరోటి లేదని సీమాంధ్ర టీడీపీ ఎంపీలు అన్నారు. వేరేవారు దింపే వరకు ఆగకుండా, కేంద్రమే స్వతహాగా గద్దె దిగిపోవాలన్నారు. మంగళవారం సీమాంధ్ర టీడీపీ ఎంపీ మోదుగుల వేణుగోపాలరెడ్డి నివాసంలో ఆ ప్రాంత ఎంపీలు భేటీ అయ్యారు. -
వీఐపీలు వేధి స్తే అది నేరం కాదా?
-
సమైక్యాంధ్ర కోసం వీధుల్లోకి రావక్కర్లేదు: కేంద్ర మంత్రి ఆర్పీఎన్ సింగ్
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రతిపాదనపై పునరాలోచనకు అవకాశమే లేదని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి ఆర్పీఎన్ సింగ్ అన్నారు. విభజన వల్ల తలెత్తే సమస్యలేమైనా ఉంటే మంత్రుల బృందానికి చెప్పాలని, వీధుల్లోకి రావాల్సిన అవసరం లేదని ఆయన వ్యాఖ్యానించారు. గతంలో రాష్ట్ర విభజనకు ఆమోదం తెలిపిన కొన్ని పార్టీలు ఇప్పుడు సీమాంధ్రలో జరుగుతున్న హింసాత్మక ఆందోళనలను ప్రోత్సహిస్తున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. అయినా సరే, ప్రభుత్వం మాత్రం ఆంధ్రప్రదేశ్‌ను విభజించి, తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటుచేసే ప్రతిపాదనపై పునరాలోచన చేయబోదని స్పష్టం చేశారు. సమైక్యాంధ్ర ఆందోళనలకు ఒక పార్టీ సారథ్యం వహిస్తోందని, ఆ పార్టీ గతంలో రాష్ట్ర విభజనకు ఆమోదించిందని సింగ్ వ్యాఖ్యానించారు. ఇది చాలా దురదృష్టకరమని ఆయన అన్నారు. ఆ ప్రాంతంలో శాంతి భద్రతలను పరిరక్షించే ఏర్పాట్లు మాత్రం తగినంతగానే ఉన్నాయని చెప్పారు. శాంతిభద్రతలకు భంగం వాటిల్లేలా చేసే ప్రయత్నాలను కఠినంగా ఎదుర్కొంటామని సింగ్ అన్నారు.