RR District
-
డిప్యూటీ ఈఈ ఆస్తుల పై ఏసీబి కొరఢా
-
హాకీ పోటీల్లో జిల్లా జట్టుకు ప్రథమ స్థానం
నల్లగొండ టౌన్ : నల్లగొండ పట్టణంలోని మేకల అభినవ్ అవుట్డోర్ స్టేడియంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి హాకీ పోటీల్లో రంగారెడ్డి జిల్లా జట్టు ప్రథమస్థానంలో నిలిచింది. ఆదివారం విజేతలకు బహుమతుల ప్రదానం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పూల రవీందర్ మాట్లాడారు. క్రీడారంగం అభివృద్ధికి త్వరలో రాష్ట్ర ప్రభుత్వం క్రీడాబిల్లును ప్రవేశపెట్టనుందన్నారు. ఉత్తమ ప్రతిభ కనబర్చిన రంగారెడ్డి జిల్లాకు చెందిన హాకీ క్రీడాకారిణి ఎస్.అపర్ణకు రూ.2 వేల బహుమతి అందజేశారు. జిల్లా ఎస్పీ ఎన్.ప్రకాశ్‌రెడ్డి మాట్లాడుతూ జాతీయ క్రీడ అయిన హాకీకి పూర్వ వైభవాన్ని తీసుకురావాల్సిన అవసరముందన్నారు. ముఖేష్‌కుమార్ లాంటి క్రీడాకారులు తయారు కావాలని ఆకాంక్షించారు. క్రీడలను ప్రోత్సహించడానికి రూ.50 వేలను హాకీ అసోసియేషన్‌కు అందజేస్తున్నట్లు ప్రకాశ్‌రెడ్డి ప్రకటించారు. ఈ సందర్బంగా ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు పొందిన రంగారెడ్డి, హైదరాబాద్, వరంగల్ జట్లకు ఎస్పీ, ఎమ్మెల్సీలు ట్రోఫీలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎన్.ముఖేష్ కుమార్, అసోసియేట్ చైర్మన్ డాక్టర్ ఎం.ఏ. హఫీజ్‌ఖాన్, అసోసియేషన్ అధ్యక్షుడు కొండకింది చినవెంకట్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఇమామ్ కరీం, డీఎస్డీఓ మక్బూల్ అహ్మ తదితరులు పాల్గొన్నారు. -
నకిలీ శొంఠి తయారీ ముఠా గుట్టురట్టు
వికారాబాద్ : రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం తొండుపల్లిలో నకిలీ శొంఠి తయారు చేస్తున్న ముఠా గుట్టును ఎస్వోటీ పోలీసులు మంగళవారం రట్టు చేశారు. 1000 కిలోల అల్లం, ఫెవికాల్తోపాటు నీలి రంగు కిరోసిన్‌ను పోలీసులు సీజ్ చేశారు. అయితే యజమాని పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నకిలీ శొంఠి తయారు చేస్తున్నట్లు పోలీసులు ఆగంతకులు ఫోనులో సమాచారం అందించారు. దీంతో పోలీసులు దాడులు చేశారు. -
రైలు నుంచి పడి వృద్ధురాలి మృతి
తాండూరు : ఓ వృద్ధురాలు ప్రమాదవశాత్తు రైలు నుంచి కిందపడి దుర్మరణం చెందింది. ఈ సంఘటన బుధవారం ఉదయం ధారూరు-రుక్మాపూర్ రైల్వేస్టేషన్ల మధ్యలో చోటు చేసుకుంది. రైల్వే హెడ్‌కానిస్టేబుల్ రాజు కథనం ప్రకారం..ధారూరుకు చెందిన హరిజన్ పోచమ్మ(64) పని నిమిత్తం బుధవారం ఉదయం ధారూరు నుంచి తాండూరుకు ప్యాసెంజర్ రైలులో బయలుదేరింది. మార్గం మధ్యలోని ధారూరు-రుక్మాపూర్ స్టేషన్ల మధ్యలో ఆమె ప్రమాదవశాత్తు రైలు నుంచి కిందపడడంతో అక్కడికక్కడే మృతి చెందింది. రైల్వేస్టేషన్ మేనేజర్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు. -
కొత్త ఎస్పీగా శ్రీనివాసులు
సాక్షి, రంగారెడ్డి: జిల్లాకు కొత్త ఎస్పీగా ఎం.శ్రీనివాసులు నియమితులయ్యారు. ఈ మేరకు మంగళవారం రాత్రి తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ క్యాడర్‌కు చెందిన శ్రీనివాసులుది 2008 ఐపీఎస్ బ్యాచ్. గతంలో ఏసీబీ విజిలెన్స్ విభాగంలో పనిచేశారు. అలాగే వైజాగ్ డీసీపీగానూ ఆయన విధులు నిర్వహించారు. ఈయనకు సమర్థత ఉన్న అధికారిగా పేరుంది. -
చంద్రబాబు ఆదేశాలకు ధిక్కారం!
హైదరాబాద్: టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆదేశాలను రంగారెడ్డి జిల్లాలో ఆరుగురు జడ్పిటిసి సభ్యులు ధిక్కరించారు. టీడీపీ జడ్పిటిసి సభ్యులను కాపాడుకోవడంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి విఫలమయ్యారు. టిఆర్ఎస్ జరిపిన బేరసారాలు ఫలించాయి. ఆ పార్టీ జడ్పిటిసి సభ్యురాలు, మంత్రి పట్నం మహేంద్ర రెడ్డి భార్య సునీత జడ్పీ చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. తెలంగాణలో జరిగిన శాసనసభ ఎన్నికలలో చావుదెబ్బతిన్న కాంగ్రెస్, టిడిపిలు రంగారెడ్డి జిల్లా జడ్పీ చైర్మన్ స్థానాన్నైనా గెలుచుకోవాలని తీవ్రంగా ప్రయత్నించాయి. జిల్లాస్థాయి నేతలు ప్రత్యర్థులతో కుమ్మక్కైనట్లు ప్రచారం జరగడంతో నేరుగా రాష్ట్ర స్థాయి నాయకులే రంగంలోకి దిగారు. గులాబీ వ్యూహానికి చెక్ పెట్టేందుకు ఆ రెండు పార్టీలు చేసిన ప్రయత్నాలు ఏమీ ఫలించలేదు. టిడిపి నేతలు ఆ పార్టీ రాష్ట్ర స్థాయి నేతల మాటలు కూడా వినలేదు. వారి ఆదేశాలను ధిక్కరించి ఆరుగురు టిడిపి జడ్పిటిసి సభ్యులు టిఆర్ఎస్లో చేరిపోయారు. దాంతో మంత్రి మహేంద్ర రెడ్డి భార్య సునీత గెలిచారు. వైస్ ఛైర్మన్‌గా కుత్బుల్లాపూర్ టిడిపి జడ్పిటిసి సభ్యుడు ప్రభాకర్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. లోపాయికారిగా టీఆర్ఎస్కు మద్దతిచ్చినట్లు ప్రభాకర్ రెడ్డి తెలిపారు.