R..Rajkumar
-
షాహీద్ తో అఫైర్ లేదు: సోనాక్షి
బాలీవుడ్ నటుడు షాహీద్ కపూర్ తో అఫైర్ లేదని సోనాక్షి సిన్హా తెలిపింది. ఆర్.. రాజ్ కుమార్ చిత్రంలో నటించినంత మాత్రాన షాహీద్ తో లింక్ పెట్డడం తనను బాధిస్తోందని ఆమె అన్నారు. ఇలాంటి వార్తల కారణంగా పార్టీలకు వెళ్లాలన్నా, బయట అడుగుపెట్టాలన్నా భయమేస్తోందని సోనాక్షి తెలిపారు. షాహీద్ తో ఎప్పుడు మాట్లాడానో, కలిశానో గుర్తులేదని.. కాని మాఇద్దరిపై మీడియాలో ఏవేవో కట్టుకథలు రావడం ఇబ్బందిగా ఉందన్నారు. అదృష్టవశాత్తూ తన గురించి తల్లితండ్రులకు తెలుసు కాబట్టి ఎలాంటి ఇబ్బందులు లేవని.. వారు మంచిగా అర్ధం చేసుకున్నారని సోనాక్షి అన్నారు. ఆర్...రాజ్ కుమార్ చిత్రంలో షాహీద్ తో కలిసి నటించిన తర్వాత ఇద్దరి మధ్య అఫైర్ కొనసాగుతోందని రూమర్లు ఎక్కువయ్యాయి. తమపై వస్తున్న రూమర్లను సోనాక్షి ఖండించారు. -
అభిమానుల మధ్య ప్రభుదేవా ,షాహిద్ కపూర్
-
అభిమానుల మధ్య ప్రభుదేవా ,షాహిద్ కపూర్
నృత్య దర్శకుడు ప్రభుదేవా దర్శకత్వంలో షాహిద్ కపూర్ నటించిన తాజా చిత్రం ‘రాంబో రాజ్ కుమార్’. ప్రభుదేవా-షాహిద్ కపూర్ లు ముంబై థియేటర్లలో అభిమానుల మధ్య సందడి చేసారు. ఈ సందర్భంగా మాట్లాడిన ప్రభుదేవా.. బాలీవుడ్ లోని కొత్త తరహా నృత్యానికి దక్షిణాది వారు స్పూర్తిగా నిలిచారన్నారు. భవిష్యత్తులో ఇటువంటి తరహా డ్యాన్స్ లకు కొదవ ఉండదన్నారు. రాంబో రాజ్ కుమార్ తొలి రెండు రోజుల్లో భారీ స్థాయిలో కలెక్షన్లు వసూలు చేసింది. ఈ చిత్రం మొదటి రోజు 10 కోట్లు , రెండవ రోజు 8 కోట్లు సేకరించింది. -
నేను ప్రేమిస్తున్నాను: సోనాక్షి సిన్హా
బాలీవుడ్ ముద్దు గుమ్మ సోనాక్షి సిన్హా మీడియాను బుల్లి బుల్లి మాటలతో బాగానే బోల్తా కొట్టించడం నేర్చుకుంటోంది. సినీ పరిశ్రమతో తనకు ఉన్న సుదీర్ఘ అనుభవాన్ని సోనాక్షి చక్కగా వినియోగించుకుంటోంది. ఇటీవల 'ఆర్ రాజ్ కుమార్' చిత్ర ప్రమోషన్ కోసం ఓ టెలివిజన్ చానెల్ నిర్వహిస్తున్న కామెడీ నైట్.. అనే కార్యక్రమంలో దర్శకుడు ప్రభుదేవా, బాలీవుడ్ నటులు షాహీద్ కపూర్, సోన్ సూద్ లతో కలిసి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో 'ఎవరితో ప్రేమలో పడ్డారా' అని హోస్ట్ కపిల్ శర్మ అడిగిన ప్రశ్నకు తల ఊపడమేకాకుండా.. నేను ప్రేమిస్తున్నాను అని సోనాక్షి చెప్పడంతో అందరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. అయితే నీవు ప్రేమిస్తున్నది ఎవరూ అని హోస్ట్ పదే పదే అడుగగా.. అందుకు ఊరిస్తూ ప్రస్తుతం పనిని ప్రేమిస్తున్నాను అని చెప్పడంతో ప్రేక్షకులతోపాటు అక్కడున్న అందర్ని నవ్వుల్లో ముంచింది. తండ్రి 'షాట్ గన్' శతృఘ్న సిన్హా ట్రైనింగ్ సోనాక్షికి బాగానే ఉపయోగపడుతున్నట్టు కనిపిస్తోంది.