Rs 1.5 crore
-
విద్యార్థికి బంపర్ ఆఫర్.. కోటిన్నర జీతం
లక్నో: ఐఐటీ-కాన్పూర్ విద్యార్థి బంపర్ ఆఫర్ కొట్టేశాడు. ఢిల్లీకి చెందిన అతడు ఏకంగా ఏడాదికి కొటిన్నర జీతం వచ్చే ఉద్యోగం పట్టేశాడు. ఆ ఆఫర్ ఇచ్చింది కూడా మాములు కంపెనీ కాదు. టెకీ దిగ్గజం మైక్రోసాఫ్ట్. ఇప్పటి వరకు ఐఐటీ కాన్పూర్ నుంచి అత్యధికంగా ఒక విద్యార్థికి అందనున్న జీతభత్యం కూడా ఇదేనని ఇనిస్టిట్యూట్ వర్గాలు చెబుతున్నాయి. రెడ్మాండ్లోని హెడ్ క్వార్టర్స్‌లో పనిచేసేందుకు మైక్రోసాఫ్ట్ ఈ అవకాశం ఇచ్చింది. అతడు అక్కడ బగ్స్ నిరోధించే కొత్త సాఫ్ట్ వేర్ రూపొందించనున్నాడు. బేసిక్ జీతంగా రూ.94లక్షలు అందనుండగా మిగితా మొత్తం ఇతర అలవెన్సులుగా అందనుంది. గత ఏడాది ఇదే ఐఐటీ నుంచి అత్యధిక మొత్తంగా ఏడాదికి రూ.93లక్షల ఆఫర్ ఓ విద్యార్థికి వచ్చింది. ఈ విషయంపై ఓ మీడియా సంస్థ ప్లేస్ మెంట్ అధికారి ప్రొఫెసర్ శ్యాం నాయర్‌ను సంప్రదించగా ‘ఆ విద్యార్థికి వచ్చిన ఆఫర్, జీతభత్యాల విషయంలో నేను ఎలాంటి వ్యాఖ్యలు చేయదలుచుకోలేదు’ అని అన్నారు. ఈ ఏడాది ఐఐటీ కాన్పూర్‌కు మొత్తం 200 కంపెనీలు క్యాంపస్ ఇంటర్వ్యూల కోసం వచ్చాయంట. గత ఏడాదితో పోలిస్తే ఈసారి 80 తగ్గాయి. -
రూ.1.5 కోట్ల విలువైన ఎర్రచందనం పట్టివేత
రేణిగుంట (చిత్తూరు జిల్లా): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి సొంత జిల్లా చిత్తూరులో ఎర్రచందనం దొంగలు చెలరేగిపోయారు. అడ్డమొచ్చిన అటవీ సిబ్బంది, పోలీసులపై రాళ్ల వర్షం కురిపించి పరారయ్యారు. ఈ సంఘటన ఆదివారం అర్ధరాత్రి తరువాత (సోమవారం ఉదయం)2 గంటల సమయంలో చిత్తూరు జిల్లా రేణిగుంట మండలం కృష్ణాపురం అటవీ ప్రాంతంలో జరిగింది. వివరాలు.. తమిళనాడుకు చెందిన 220 మంది కూలీలు ఎర్రచందనం దుంగలను తరలించేందుకు ప్రయత్నిస్తున్నారన్న సమాచారం తెలుసుకున్న అటవీ సిబ్బంది వారిపై దాడి చేశారు. పోలీసుల సహాయంతో అటవీ సిబ్బంది దాడి చేయడంతో కూలీలు వీరిపై రాళ్ల వర్షం కురిపించారు. పోలీసులు గాల్లోకి కాల్పులు జరపడంతో కూలీలు అక్కడి నుంచి పరారయ్యారు. పోలీసులు నిందితుల్లో ఒకరిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా అటవీ సిబ్బంది 180 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.1.5 కోట్లు ఉంటుందని అంచనా. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.