విద్యార్థికి బంపర్‌ ఆఫర్‌.. కోటిన్నర జీతం | IIT Kanpur student gets Rs 1.5 crore offer from Microsoft | Sakshi
Sakshi News home page

విద్యార్థికి బంపర్‌ ఆఫర్‌.. కోటిన్నర జీతం

Published Sun, Dec 4 2016 1:36 PM | Last Updated on Fri, Nov 9 2018 5:02 PM

విద్యార్థికి బంపర్‌ ఆఫర్‌.. కోటిన్నర జీతం - Sakshi

విద్యార్థికి బంపర్‌ ఆఫర్‌.. కోటిన్నర జీతం

లక్నో: ఐఐటీ-కాన్పూర్‌ విద్యార్థి బంపర్‌ ఆఫర్‌ కొట్టేశాడు. ఢిల్లీకి చెందిన అతడు ఏకంగా ఏడాదికి కొటిన్నర జీతం వచ్చే ఉద్యోగం పట్టేశాడు. ఆ ఆఫర్‌ ఇచ్చింది కూడా మాములు కంపెనీ కాదు. టెకీ దిగ్గజం మైక్రో​సాఫ్ట్‌. ఇప్పటి వరకు ఐఐటీ కాన్పూర్‌ నుంచి అత్యధికంగా ఒక విద్యార్థికి అందనున్న జీతభత్యం కూడా ఇదేనని ఇనిస్టిట్యూట్‌ వర్గాలు చెబుతున్నాయి. రెడ్‌మాండ్‌లోని హెడ్‌ క్వార్టర్స్‌లో పనిచేసేందుకు మైక్రోసాఫ్ట్‌ ఈ అవకాశం ఇచ్చింది. అతడు అక్కడ బగ్స్‌ నిరోధించే కొత్త సాఫ్ట్‌ వేర్‌ రూపొందించనున్నాడు.

బేసిక్‌ జీతంగా రూ.94లక్షలు అందనుండగా మిగితా మొత్తం ఇతర అలవెన్సులుగా అందనుంది. గత ఏడాది ఇదే ఐఐటీ నుంచి అత్యధిక మొత్తంగా ఏడాదికి రూ.93లక్షల ఆఫర్‌ ఓ విద్యార్థికి వచ్చింది. ఈ విషయంపై ఓ మీడియా సంస్థ ప్లేస్‌ మెంట్‌ అధికారి ప్రొఫెసర్‌ శ్యాం నాయర్‌ను సంప్రదించగా ‘ఆ విద్యార్థికి వచ్చిన ఆఫర్‌, జీతభత్యాల విషయంలో నేను ఎలాంటి వ్యాఖ్యలు చేయదలుచుకోలేదు’ అని అన్నారు. ఈ ఏడాది ఐఐటీ కాన్పూర్‌కు మొత్తం 200 కంపెనీలు క్యాంపస్‌ ఇంటర్వ్యూల కోసం వచ్చాయంట. గత ఏడాదితో పోలిస్తే ఈసారి 80 తగ్గాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement