హయత్ నగర్ లో రూ.19 లక్షలు పట్టివేత
హైదరాబాద్: గ్రేటర్ ఎన్నికల నేపధ్యంలో రంగారెడ్డి జిల్లా హయత్నగర్ మండలంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. మండలంలోని భాగ్యలత సెంటర్ వద్ద బుధవారం మధ్యాహ్నం చేపట్టిన తనిఖీల్లో భారీగా నగదు పట్టుబడింది. ఎలాంటి పత్రాలు లేకుండా కారులో తరలిస్తున్న రూ.19 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించి ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.