అబిడ్స్ లో తనిఖీలు: రూ. 35 లక్షలు స్వాధీనం
హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు నగర వ్యాప్తంగా విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. గురువారం ఆబిడ్స్ జీపీవో ఎదురుగా తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు హోండా యాక్టీవాలో తరలిస్తున్న రూ. 35 లక్షలను గుర్తించారు. దీంతో వాహనంపై ఉన్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ప్రస్తుతానికి డబ్బుకు సంబంధించిన సరైన పత్రాలు చూపకపోవడంతో సాయంత్రం వరకు గడువు ఇచ్చారు. తనిఖీలు కొనసాగుతున్నాయి.