Rs. 500
-
ఎన్నాళ్లీ తిప్పలు..?
* నోట్ల కొరతతో బ్యాంకులు, ఏటీఎంల వద్ద ప్రజల ఇక్కట్లు * విత్ డ్రా మొత్తం రూ.24 వేలు ఇవ్వని బ్యాంకులు * రూ.2000 నోట్లు ఇచ్చినా లాభం లేదంటున్న ప్రజలు పెద్దనోట్ల కష్టాలు జిల్లా ప్రజలను పట్టీ పీడిస్తూనే ఉన్నాయి. బ్యాంకులు , ఏటీఎంల వద్దకు వెళితే డబ్బు కొరతతో నో క్యాష్ బోర్డులు పెట్టేస్తున్నారు. దీంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విత్ డ్రా పరిమితి రూ.24వేలు ఉన్నా, కొన్ని బ్యాంకులు ఇవ్వటంలేదు. కొన్ని బ్యాంకులు రూ.5000 పరిమితితో ఇస్తున్నారు. ఏటీఎం వద్ద ఽ క్యూలు, అక్కడికి వెళ్ళినా రూ.2000 నోట్లు రావడంతో చిల్లర దొరకక సామాన్య ప్రజలు అల్లాడిపోతున్నారు. చిరువ్యాపారులు, వలస ప్రజల వేదన వర్ణనాతీతంగా ఉంది. ఎన్నాళ్లీ తిప్పలు ఎదుర్కోవాలని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. సాక్షి, అమరావతి బ్యూరో : డబ్బు కొరత కారణంగా జిల్లాలో 10 శాతం ఏటీఎంలు మాత్రమే పనిచేస్తున్నాయి. ఏటీఎంలో రూ.100 నోట్లు ఉంచిన అరగంటలోపే అయిపోతున్నాయి. ఎస్బీఐ ఏటీఏంలే నగరంలో కొంత మేర పనిచేస్తున్నాయి. నగరంపాలెం మెయిన్ బ్రాంచ్‌లో సైతం ఏజీఎం శ్రీనివాసరావు బ్యాంకు సిబ్బంది, వచ్చిన కస్టమర్లలకు ఇబ్బంది కలుగకుండా ఉన్నంతలో పారదర్శకంగా మంచి సర్వీసు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజల కష్టాలు తెలుసుకుంటూ.... పెద్ద నోట్ల రద్దుతో క్షేత్రస్థాయిలో సామాన్యప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంలో భాగంగా కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి, రాష్ట్ర నోడల్ అధికారి అజయ్ సాహానితో కలిసి జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే బుధవారం గుంటూరు నగరంలోని పలు ప్రాంతాల్లో సందర్శించి క్షేత్ర స్థాయిలో ప్రజలను కష్టాలను అడిగి తెలుసుకున్నారు. తొలుత కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి అజయ్‌సహాని, జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే, సంయుక్త కలెక్టర్ కృత్రిక శుక్లా, నగరంపాలెంలోని ఎస్బీఐ ఏటీఎంను సందర్శించారు. ఏటీఎం క్యూలైనుల్లో ఉన్న ప్రజల నుంచి పెద్ద నోట్ల రద్దుతో కలుగుతున్న అసౌకర్యాన్ని అడిగి తెలుసుకున్నారు. అనంతరం పట్టాభిపురం రైతు బజారును సందర్శించి పెద్ద నోట్ల రద్దు వల్ల వ్యాపారస్తులు పడుతున్న ఇబ్బందులను తెలుసుకున్నారు. పెద్ద నోట్ల రద్దుకు ముందు రూ. 6 నుంచి రూ. 7వేల వరకు వ్యాపారం జరుగుతుండేదని, రద్దు తరువాత రూ. 3వేలు నుంచి 4వేల వ్యాపారం జరుగుతుందన్నారు. పట్టాభిపురంలో ఉన్న హైమా ఆసుపత్రిని సందర్శించి ఆసుపత్రి యాజమాన్యంతో రోగుల నుంచి చిన్న నోట్ల కొరతపై వివరాలు సేకరించారు. అనంతరం పెట్రోలు బంకును మారుతీనగర్, తుఫాన్‌నగర్ 2వలైనులో ఉన్న చౌక ధరల దుకాణాలను పరిశీలించి వినియోగదారులను సమస్యలను అడిగి తెలసుకున్నారు. సమావేశంలో జేసీ–2 వెంకటేశ్వర్లు, ఎల్డీఎం సుదర్శన్, పౌరసరఫరాల అధికారులు పాల్గొన్నారు. బియ్యం కొనేందుకు డబ్బులు లేవయ్యా... మా దగ్గర ఉన్న పాత నోట్లు వేస్తే, బ్యాంకులో డబ్బులు లేవని ఇవ్వలేదు. బిల్డింగ్ పనులకు వెళ్ళితే అక్కడ మేస్త్రీలు పాత నోట్లు ఇస్తున్నారు. భార్య, భర్త క్యూలో నిల్చున డబ్బులు దొరకటంలేదు. బియ్యం కొనేందుకు డబ్బులు లేక అల్లాడుతున్నాం. ఏటీఎంలో 2000 నోటు వచ్చినా కిలో బియ్యం కొంటే చిల్లర ఇస్తారా అని రాష్ట్ర నోడల్ అధికారి, జిల్లా కలెక్టర్ ఎదుట చుట్టుగుంటకు చెందిన సాల్మన్ రాజు వాపోయారు. -
కొనసాగుతున్న కరెన్సీ కష్టాలు
కాంచీపురం: పది రోజులు దాటుతున్నా.. కరెన్సీ కష్టాలతో సామాన్యులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. పాత నోట్లు చెలామణి కాకపోవడంతో పాటు బ్యాంకుల్లో సైతం అతి తక్కువ మాత్రమే పంపిణీ చేస్తున్న క్రమంలో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. దీంతో ముందుగా అనుకున్న పనులను ప్రారంభించలేక నానా అవస్థలు పడుతున్నారు. నల్లధనం, నకిలీ డబ్బు ఏరివేసేందుకు రూ. 500, 1000 నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు. ఇలా ప్రకటించి పది రోజులు దాటుతున్నా కరెన్సీ మాత్రం పూర్తి స్థాయితో జనానికి అందుబాటులోకి రాలేదు. అందుబాటులోకి వచ్చినా కేవలం రూ. రెండు వేలు మాత్రమే పొందాలనే షరతు పెట్టడంతో సాధారణ ప్రజలకు మరిన్ని కష్టాలు పడుతున్నారు. దీంతో బ్యాంకుల ముందు వందలాది మంది ప్రతిరోజూ క్యూకడుతున్నారు. ఈ క్రమంలో సామాన్యులకు ఊరటగా వివాహ శుభకార్యాలు పెట్టుకున్న వారు తమ ఖాతాల నుంచి రూ. 2.50 లక్షలను పొందవచ్చని తీసుకున్న నిర్ణయం కొంత ఊరట కలిగించింది. ఈ క్రమంలో వివాహ ఖర్చుల కోసం బ్యాంకును ఆశ్రయించిన వారికి కాంచీపురంలో రూ. 2.50 లక్షలను బ్యాంకు సిబ్బంది అందజేశారు. ఇక బ్యాంకుల వద్ద ఏర్పడుతున్న రద్దీతో సీనియర్ సిటిజన్స పడుతున్న ఇబ్బందులు వర్ణనాతీతం. సామన్యుల్లాగా క్యూల్లో ఎక్కువసేపు నిలబడలేక వారు నానా ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. ఇక గంటల తరబడి వేచి ఉన్నా కూడా కేవలం రూ. రెండు వేలు మాత్రమే అందిస్తుండడంతో అనేక మంది నిరాశతో బ్యాంకుల నుంచి వెనుదిరుగుతున్నారు. ఇదిలాఉండగా నోట్ల రూపంలో ఉన్న పర్సులు కాంచీపురంలోని దుకాణాల్లో అందుబాటులోకి వచ్చాయి. వీటిని కొనేందుకు యువత ఉత్సాహం చూపుతోంది. -
పేద్ద నోట్లు వచ్చాయ్
ముందు వైపు.. రూ. 500 1. లైటు వెలుతురులో 500 అంకెను గమనించవచ్చు 2. 45 డిగ్రీల కోణంలో చూస్తే 500 అంకెను గమనించొచ్చు 3. దేవనాగరి లిపిలో 500 సంఖ్య. 4. మధ్య భాగంలో మహాత్మా గాంధీ బొమ్మ 5. నోటును కొంచెం వంచితే విండోడ్ సెక్యూరిటీ త్రెడ్ ఆకుపచ్చనుంచి నీలంకు మారుతుంది. మధ్యలో భారత్, ఆర్బీఐ, 500 అంకె ఉంటుంది. 6. గవర్నర్ సంతకం, ఆర్బీఐ చిహ్నం కుడివైపునకు మార్చారు. 7. మహాత్మాగాంధీ బొమ్మ, ఎలక్ట్రోటైప్(500) వాటర్‌మార్క్ 8. పై భాగంలో ఎడమ వైపున, కింది భాగంలో కుడివైపున సంఖ్యలతో కూడిన నంబర్ సైజ్ ఎడమ నుంచి కుడికి పెరుగుతుంది. 9. కుడివైపున కిందిభాగంలో రంగు మారే ఇంక్(ఆకుపచ్చ నుంచి నీలం)లో రూపాయి చిహ్నంతోపాటు సంఖ్యల్లో డినామినేషన్ ఉంటుంది. 10. కుడివైపున అశోక స్తూపం చిహ్నం అంధుల కోసం: మహాత్మా గాంధీ బొమ్మ, అశోక స్థూపం చిహ్నం, నల్ల గీతలు, గుర్తింపు చిహ్నం చెక్కినట్లుగా లేదా ఉబ్బెత్తుగా ఉంటారుు. 11. కుడివైపున ఉబ్బెత్తుగా ముద్రించిన రూ.500 ఉన్న వృత్తం 12. కుడి, ఎడమ వైపున ఉబ్బెత్తుగా ముద్రించిన ఐదు నల్ల గీతలు వెనుకవైపు.. 13. నోటు ముద్రణ సంవత్సరం ఎడమవైపున ఉంటుంది. 14. స్వచ్ఛభారత్ లోగో 15. అధికార భాషలు 16. భారత వారసత్వ ప్రదేశం ఎర్రకోటపై జాతీయ జెండా 17. కుడివైపున దేవనాగరి లిపిలో రూ.500 సంఖ్య ముందువైపు.. రూ. 2000 1. లైటు వెలుతురులో 2000 అంకెను గమనించవచ్చు 2. 45 డిగ్రీల కోణంలో చూస్తే 2000 అంకెను గమనించొచ్చు 3. దేవనాగరి లిపిలో రూ.2000 సంఖ్య 4. మధ్య భాగంలో మహాత్మా గాంధీ బొమ్మ 5. చిన్న అక్షరాల్లో ఆర్బీఐ, 2000 6. నోటును కొంచెం వంచితే విండోడ్ సెక్యూరిటీ త్రెడ్ ఆకుపచ్చనుంచి నీలానికి మారుతుంది.మధ్యలో భారత్, ఆర్బీఐ, 2000 అంకె ఉంటుంది. 7. గవర్నర్ సంతకం, ఆర్బీఐ చిహ్నం కుడివైపునకు మార్పు 8. మహాత్మాగాంధీ బొమ్మ, ఎలక్ట్రోటైప్(2000) వాటర్‌మార్క్ 9. పై భాగంలో ఎడమ వైపున, కింది భాగంలో కుడివైపున సంఖ్యలతో కూడిన నంబర్ సైజ్ ఎడమ నుంచి కుడికి పెరుగుతుంది. 10. కుడివైపున కింది భాగంలో రంగు మారే ఇంక్ (ఆకుపచ్చ నుంచి నీలం)లో రూపారుు సింబల్తోపాటు 2000 సంఖ్య. 11. కుడివైపున అశోక స్తూపం చిహ్నం అంధుల కోసం: మహాత్మా గాంధీ బొమ్మ, అశోక స్థూపం చిహ్నం, నల్ల గీతలు, గుర్తింపు చిహ్నం చెక్కినట్లుగా లేదా ఉబ్బెత్తుగా ఉంటారుు 12. కుడివైపున ఉబ్బెత్తుగా ముద్రించిన 2000 ఉన్న దీర్ఘచతురస్రాకారం 13. కుడి, ఎడమ వైపున ఉబ్బెత్తుగా ముద్రించిన ఏడు నల్ల గీతలు వెనుకవైపు 14. నోటు ముద్రణ సంవత్సరం ఎడమవైపున ఉంటుంది. 15. నినాదంతో సహా స్వచ్ఛభారత్ లోగో 16. అధికార భాషలు 17.‘మంగళయాన్’ చిత్రం -
కొత్త నోట్లు సాధించామోచ్..!
-
'చిల్లర' చిక్కులు
* పెద్ద నోట్ల రద్దుతో సామాన్యుడికి తప్పని తిప్పలు * పాల ప్యాకెట్ల కొనుగోలుతో కష్టాలు మొదలు * ప్రభుత్వ సంస్థల్లోనూ రూ.500, రూ. 1000 నోట్ల తిరస్కరణ * భారీగా తగ్గిన ఆదాయం * బోసిపోయిన దుకాణాలు.. సాక్షి ప్రతినిధి, అమరావతి బ్యూరో/సాక్షి, గుంటూరు : సామాన్యుడికి చిల్లర చిక్కులు బుధవారం ఉదయం నుంచే మొదలయ్యాయి. పాల ప్యాకెట్లు కొనడం, టీస్టాల్స్ వద్ద తేనీరు తాగడానికి రూ. 500 నోటు మార్చడానికి చేసిన తొలి ప్రయత్నం బెడిసికొట్టింది. హోటళ్లు, కూరగాయల దుకాణాలు, పచారీ షాపులు, బార్బర్ షాపులు.. ఎక్కడా రూ. 500, రూ. 1000 నోట్లను అంగీకరించకపోవడం ప్రజలకు ఇబ్బంది కలిగించింది. శుక్రవారం నుంచి బ్యాంకులు పెద్ద నోట్ల మార్పిడికి అవకాశం ఇవ్వడంతో కొంతలో కొంత ఊరట లభించనుంది. హోల్‌సేల్ మార్కెట్లదీ ఇదే దారి కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని హోల్‌సేల్ మార్కెట్లలోనూ పెద్ద నోట్ల రద్దు కష్టాలు స్పష్టంగా కనిపించాయి. అన్ని రకాల హోల్‌సేల్ మార్కెట్లలోని వ్యాపారులు రూ. 500, రూ. 1000 నోట్లను తీసుకోవడానికి నిరాకరించారు. రూ. 100 నోట్లు ఉన్నవారు నిత్యావసరాల కొనుగోలు, అత్యవసర ఖర్చులకు మాత్రమే ఉంచుకోవడంతో వ్యాపారాల జోరు తగ్గిందని వ్యాపారులు చెప్పారు. హోల్‌సేల్ మార్కెట్లకు వచ్చిన వినియోగదారుల సంఖ్య సగానికి పైగా తగ్గిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రయాణం.. ప్రహసనం.. ప్రయాణం అందరికీ అత్యవసరం కిందే లెక్క. పెద్ద నోట్లను నమ్ముకుని ఆర్టీసీ బస్సులు ఎక్కినవారికి నిరాశే ఎదురైంది. ప్రజా రవాణా బస్సుల్లో పెద్ద నోట్లు చెల్లుబాటవుతాయంటూ ప్రభుత్వం చేసిన ప్రకటన కాగితాలకే పరిమితమైంది. రూ. 500, రూ. 1000 నోట్లు తీసుకోవడానికి కండక్టర్లు నిరాకరించారు. గట్టిగా ఒత్తిడి చేసినవారికి పెద్ద నోట్లను తీసుకుని టికెట్లు ఇచ్చారు. వారి వద్ద చిల్లర లేకపోవడంతో ముగ్గురు నలుగురికి కలిపి రూ. 500 నోటు ఇచ్చి.. చిల్లర పంచుకోండన్నారు. ఆర్టీసీలో మంగళవారం రాత్రి వరకు వచ్చిన చిన్న నోట్లను అధికారులు దారిమళ్లించారు. బుధవారం ఉదయం తమకు చిల్లర అప్పగించి ఉంటే.. ప్రయాణంలో కష్టాలు తప్పేవని కొందరు కండక్టర్లు చెప్పారు. రైల్వే కౌంటర్లలో ఘర్షణ రైల్వే కౌంటర్లలో పెద్ద నోట్లు తీసుకోవడానికి సిబ్బంది సిద్ధపడినా.. ప్రయాణికులకు చిల్లర సమకూర్చడం సాధ్యం కాకపోవడంతో ఇబ్బందులు తలెత్తాయి. ప్రభుత్వం చెప్పినా పెద్ద నోట్లు ఎందుకు తీసుకోరంటూ విజయవాడ రైల్వే కౌంటర్లలో గొడవపడ్డారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పలు కౌంటర్లలో ఇలాంటి సమస్యలే తలెత్తాయని రైల్వే వర్గాలు తెలిపాయి. వెలవెలపోయిన మాల్స్.. పెద్ద నోట్లు తీసుకోవడానికి పలు షాపింగ్ మాల్స్ ముందుకు వచ్చినా.. పెద్దగా వ్యాపారం సాగలేదు. డెబిట్, క్రెడిట్ కార్డుల మీద వ్యాపారం కూడా సాధారణ స్థాయి కంటే చాలా తక్కువగా జరిగిందని వ్యాపారులు చెప్పారు. కస్టమర్లు పెద్దగా రాకపోవడంతో జంటనగరాల్లో పలు మాల్స్ వెలవెలపోయాయి. సినిమా హాళ్లు కూడా బోసిపోయాయి. వన్నె తగ్గిన బంగారం.. బంగారం ధర పెరగడం, పెద్ద నోట్ల రద్దు.. వెరసి బంగారు ఆభరణాల కొనుగోళ్లు బుధవారం మందగించాయి. బంగారం వర్తకంలో పన్నులు చెల్లించకుండా చేసే ‘జీరో’ బిజినెస్ ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో బుధవారం మధ్యాహ్నం నుంచే బంగారం దుకాణాలను వ్యాపారులు మూసివేశారు. ఎయిర్‌పోర్ట్‌లోనూ అదే తీరు.. గన్నవరం విమానాశ్రయంలో వాటర్ బాటిళ్లు, స్నాక్స్ విక్రయించే దుకాణదారులు పెద్ద నోట్లను అంగీకరించకపోవడంతో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. విమానం (ఆన్‌బోర్డ్)లోనూ ప్రయాణికులకు స్నాక్స్ విక్రయిస్తారు. కానీ పెద్ద నోట్లు తీసుకోకపోవడంతో ఇబ్బందులు తప్పలేదు. పదుల సంఖ్యలో టికెట్లు కొనడానికి బుధవారం ఉదయం పలువురు విమానాశ్రయం కౌంటర్లకు వచ్చారు. ఇద్దరికి టికెట్లు విక్రయించిన తర్వాత పెద్ద నోట్లు తీసుకోవడానికి నిరాకరించారు. ఆన్లైన్లో కొనుక్కోవాలని సూచించారు. పెట్రోల్ పంపుల్లోనూ చిల్లర ఇవ్వలేదు.. పెట్రోల్ పంపుల్లో పెద్ద నోట్లు అంగీకరించారు. కానీ రూ. 500 నోటు ఇస్తే ఆ మొత్తానికి ఇంధనం పోయించుకోవాలని సిబ్బంది తెగేసి చెప్పడం పలుచోట్ల కనిపించింది. కొన్ని చోట్ల కస్టమర్లు వాగ్వాదానికి దిగారు. ఇక టోల్గేట్ల వద్ద పెద్ద నోట్లు తీసుకోవడానికి నిరాకరించడం, కొన్నిచోట్ల తీసుకున్నా.. చిల్లర సమకూర్చడంలో జాప్యం జరగడంతో కిలోమీటర్ల వేర వాహనాలు నిలిచిపోయాయి. ఈ సమస్యను దృష్టిలో ఉంచుకొనే తాత్కాలికంగా టోల్ రుసుము వసూలును కేంద్రం రద్దు చేసింది. కాజ టోల్గేట్ వద్ద సాయంత్రం నుంచి వసూళ్లు నిలిపివేశారు. ఇదే అదనుగా భావించిన మద్యం దుకాణాల యజమానులు మందుబాబుల వ్యసనాన్ని ఆసరాగా తీసుకుని రూ. 500 నోటు ఇస్తే రూ. 350కు మాత్రమే మద్యం ఇస్తూ అడ్డంగా దోచుకున్నారు. నీరసించిన రిజిస్ట్రేషన్లు.. గుంటూరు, కృష్ణా జిల్లాల్లో రోజూ సరాసరి 1200–1300 రిజిస్ట్రేషన్లు జరుగుతుంటాయి. బుధవారం దశమి కావడంతో మంచిరోజుగా భావించి సరాసరి కంటే ఎక్కువ రిజిస్ట్రేషన్లు జరుగుతాయని అధికార వర్గాలు భావించాయి. కానీ పెద్ద నోట్ల రద్దు కారణంగా 15 శాతానికి పడిపోయాయని అధికార వర్గాలు తెలిపాయి. విద్యుత్, రవాణా, మున్సిపల్ శాఖ కార్యాలయాల్లో బిల్లులు, రిజిస్ట్రేషన్లు, పన్నులు చెల్లించేందుకు వెళ్లినవారి వద్ద పెద్ద నోట్లు తీసుకోలేదు. రవాణా శాఖలో నాలుగో వంతు రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. గుంటూరు జిల్లా వ్యాప్తంగా మున్సిపాలిటీల్లో రోజుకు రూ. 50 లక్షల పన్ను వసూళ్లవుతుంటాయి. బుధవారం రూ. 18.08 లక్షలు మాత్రమే వసూలైంది. గుంటూరు కార్పొరేషన్లో రోజుకు రూ. 12 లక్షలు వసూలయ్యే పన్ను రూ. 27వేలు మాత్రమే వసూలు కావడం గమనార్హం. రోజుకు రూ. 60 లక్షలు వసూలయ్యే విద్యుత్ బిల్లులు రూ. 37 లక్షలకు పడిపోయాయి. పోలీసు శాఖ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు.. బస్‌స్టేçÙన్లు, రైల్వే స్టేషన్లు, బ్యాంకుల వద్ద చిల్లర లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న నేపథ్యంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. గురువారం బ్యాంకులు పనిచేయనుండడంతో బ్యాంకర్లతో మాట్లాడి అదనపు కౌంటర్లు ఏర్పాటు చేయించడం, బారికేడ్లు ఏర్పాటు చేసేందుకు సమాయత్తం అవుతున్నారు. టోకెన్ సిస్టమ్ ద్వారా‡ డిపాజిట్లు, చెల్లింపులు చేయించేలా చూడాలని గుంటూరు రూరల్ ఎస్పీ నారాయణ నాయక్ పోలీసు అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.