రూ. 7 లక్షలు విలువ చేసే గంజాయి స్వాధీనం
ఖమ్మం : ఖమ్మం జిల్లా పాల్వంచ అటవీ చెక్‌పోస్ట్ వద్ద గంజాయి అక్రమ రవాణాను సిబ్బంది అడ్డుకున్నారు. విశాఖ జిల్లా డొంకరాయి నుంచి టర్బో వాహనంలో హైదరాబాద్‌కు తరలిస్తున్న రెండున్నర క్వింటాళ్ల గంజాయిని సోమవారం ఉదయం తనిఖీల్లో భాగంగా పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఇద్దరిని అరెస్ట్ చేయగా... మరో ముగ్గురు పరారయ్యారు. పట్టుబడిన ఇద్దరిలో ఒకరు విశాఖ మాడుగుల మండలం ఎం.కోటపాడుకు చెందిన పిల్లి త్రినాథ్ కాగా, రెండో వ్యక్తి పాల్వంచకు చెందిన భూక్యా భాస్కర్‌గా గుర్తించారు. పట్టుబడిన గంజాయి విలువ రూ.7 లక్షలు ఉంటుందని అంచనా. నిందితులు గంజాయిని ప్రింట్‌పేపర్ల కవర్లలో ప్యాక్ చేసి వాటిని టర్బో వాహనంలోపల సీట్లలో స్పాంజ్‌ను తొలగించి ఆ స్థానంలో ఉంచి రవాణా చేస్తున్నారు.
(పాల్వంచ)