Rs 8
-
కేటీఎం బైక్స్ లవర్స్‌కి బంపర్ ఆఫర్
స్పోర్ట్స్ బైక్స్ అంటే ప్రాణం పెట్టే యూత్‌కు ఇది నిజంగా గుడ్ న్యూస్. జీఎస్టీ కొత్త పన్నుల విధానం అమల్లోకిరావడంతో భారత్‌లో టాప్ గేర్‌లో దూసుకెళుతున్న కేటీఎం బ్రాండ్ బైక్‌ల ధరలు కూడా తగ్గాయి. ఆస్ట్రియా కంపెనీ కెటిఎం కంపెనీ భారత్‌లో బైక్‌ల ధరలను భారీగా తగ్గించిందని బజాజ్ ఆటో గురువారం ప్రకటించింది. సుమారు రూ.8,600 వరకు తగ్గింపును ఆఫర్ చేస్తున్నట్టు తెలిపింది. 350 సీసీ ఎటిఎఫ్ కెటిఎమ్ పరిధిలో 200 డ్యూక్, ఆర్సీ 200, 250 డ్యూక్ ఎక్స్ షోరూమ్ ధరలపై రూ.8,600ల మేరకు తగ్గాయని బజాజ్ ఆటో ఒక ప్రకటనలో తెలిపింది. అలాగే అదనపు సెస్ కారణంగా 350 సీసీ పరిధిలోని 390 డ్యూక్ , ఆర్సి 390 ల ఎక్స్-షోరూమ్ ధరల్లో రూ. 5,900 మేర తగ్గించింది.ఆయా ప్రాంతాలల్ లోవర్తించే వ్యాట్ రేట్ల ఆధారంగా తగ్గింపు రేటు వేర్వేరుగా ఉంటుందని కంపెనీ తెలిపింది. అయితే ముంబైలో 200 డ్యూక్ ఎక్స్-షోరూమ్ లో దీని అసలు ధర రూ.1,44,751గా ఉంది. మరోవైపు ఇటీవలే దేశంలో అప్‌గ్రేడెడ్ వెర్షన్లను ప్రవేశపెట్టిన కేటీఎం తన ఔట్లెట్లను పెద్ద ఎత్తున విస్తరించేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఇండియలో నెం.1 స్థానంపై కన్నేసిన కంపెనీ ఈఏడాది దాదాపు 50వేల బైక్‌లను విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అటు కేటీఎం బ్రాండ్‌లో బజాజ్ ఆటో కంపెనీకి 49 శాతం వాటా ఉంది. కాగా ఇప్పటికే ద్విచక్ర వాహన తయారీదారులైన టీవీఎస్ మోటార్ , హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా, హీరో మోటో కార్ప్, బజాజ్ ఆటో, రాయల్ ఎన్ఫీల్డ్, యమహా, సుజుకి కంపెనీలు తమ బైక్‌ల ధరలను తగ్గించాయి. -
యురేకా బ్లాక్ లాంచ్: ధర ఎంత?
న్యూఢిల్లీ: మైక్రోమ్యాక్స్ అనుబంధ సంస్థ యూ టెలీవెంచర్స్ తాజా స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసిది. యురేకా బ్లాక్ పేరుతో బదీన్ని గురువారం భారతదేశంలో విడుదల చేసింది. 2015 లో యురేకా తొలి డివైస్‌లను లాంచ్ చేసిన యు యురేకాకు సక్సెసర్దీన్ని లాంచ్ చేసింది. దీని ధరను. రూ .8,999 గా నిర్ణయించింది. యూ యురేకా బ్లాక్ జూన్ 6వ తేదీ అర్ధరాత్రి నుంచి ప్రత్యేకంగా ఫ్లిప్‌కార్ట్‌లో లభించనుంది. యు యురేకా బ్లాక్ ఫీచర్లు 5 అంగుళాల స్క్రీన్ 1080x1920 పిక్సెల్స్ రిజల్యూషన్ ఆండ్రాయిడ్ మార్షమల్లౌ 4జీబీ డీడీఆర్3 ర్యామ్, 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ 128 దాకా విస్తరించుకునే సదుపాయం 13ఎంపీ రియర్ కెమెరా 8 ఎంపి సెల్ఫీ కెమెరా ఫింగర్ ప్రింట్ స్కానర్ 3000ఎంఏహెచ్ బ్యాటరీ 18-25 ఏళ్ల మధ్య వయసున్న యూత్ అందుబాటులోఉండేలా రూ.10వేల లోపు ఈ స్మార్ట్‌ఫోన్ లాంచ్ చేసినట్టు కంపెనీ చెబుతోంది. ఈ కేటగిరీ ఫోన్ల ఫీచర్లన్నీ దాదాపు ఒకే లా ఉంటాయని వారు భావిస్తారనీ, వారి నమ్మకానికి అనుగుణంగా యురేకా బ్లాక్‌ను లాంచ్ చేసినట్టు మైక్రోమ్యాక్స్ ఇన్ఫర్మేటిక్స్ చీఫ్ మార్కెటింగ్, చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ షుబోడిప్ పాల్ తెలిపారు. -
‘రెడ్ మి 4’ కమింగ్ సూన్..ధర ఎంత?
ముంబై: స్మార్ట్ఫోన్లతో ప్రపంచవ్యాప్తంగా ఫోన్ లవర్స్‌ను ఆకట్టుకుంటున్న చైనా మొబైల్ దిగ్గజం షియోమి మరింత వేగంగా దూసుకుపోతోంది. రెడ్ మి సిరీస్ లో భాగంగా తాజాగా ' రెడ్ మి 4' స్మార్ట్ ఫోన్ ను ఇండియాలో లాంచ్ చేసేందుకు రడీ అవుతోంది. అతిచవక ధరలో ఆ స్మార్ట్‌ఫోన్ ను మే 16న ఒక ప్రత్యేక కార్యక్రమంలో లాంచ్ చేయనుంది. ఎక్స్ సిరీస్‌లో అతి ఖరీదైన డివైస్‌లను లాంచ్ చేసిన సంస్థ, రెడ్ మి 3 కి అప్‌గ్రేడెడ్ వెర్షన్ గా రెడ్ మి 4 ను స్నాప్‌డ్రాగన్ 625 ప్రాసెసర్ తో వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురానుంది. దీని ధరను చౌక ధరలో సుమారు రూ.8వేలుగా నిర్ణయించనుందని తెలుస్తోంది. లుక్స్‌లో రెడ్ మి3, 3 ఎస్ ను పోలి ఉండి, మెటల్ యూనిబాడీ డిజైన్త వెనుక ప్యానెల్లో వేలిముద్ర స్కానర్ కూడా పొందుపరిచింది. అలాగే అతి తక్కువ ధరలో స్నాప్‌డ్రాగన్ 430 ప్రాసెసర్, 2 జీబీర్యాం, 16 జీబీ స్టోరేజ్ వేరియంట్‌ను కూడా లాంచ్ చేయనుంది. దీని ధర ఇండియాలో సుమారు రూ. 6,905గా ఉండనుంది. షియామి వైస్ ప్రెసిడెంట్, ఎండీ, మను కుమార్ రెడ్మి మరో స్మార్ట్‌ఫోన్ లాంచ్ అవుతోందని ఇటీవల ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఈనెలలో ఇదిరెండవ అతిపెద్ద ప్రకటన కానుందంటూ ట్వీట్ చేయడంతో మరిన్ని ఆసక్తి నెలకొంది. రెడ్ మి 4 ఫీచర్లపై అంచనాలు ఈ విధంగా ఉన్నాయి. రెడ్ మి 4 ఫీచర్లు 5 అంగుళాల ఫుల్ హెచ్డీ డిస్ప్లే ఆండ్రాయిడ్ 6.0మార్షమల్లౌ 1.4 ఆక్టా కోర్ ప్రాపెసర్ 3జీబీ ర్యామ్ 32జీబీ ఇంటర్నెట్ మొమరీ, మైక్రో ఎస్డీ కార్డ్ ద్వారా 128జీబీ దాకా విస్తరించుకునే సౌకర్యం 13 మెగాపిక్సెల్ రియర్ కెమెరా 5మెగాపిక్సెల్ సెల్పీ కెమెరా 4,100 ఎంఏహెచ్ బ్యాటరీ Announcing the launch of a new Redmi phone! This will be the 2nd BIG announcement of the month ☺️ Coming soon. Stay tuned #PowerInYourHand pic.twitter.com/jvzGCY2oyR — Manu Kumar Jain (@manukumarjain) May 5, 2017 -
10 బలహీన బ్యాంకులకు కేంద్రం 8,586 కోట్లు
చెన్నై: ప్రభుత్వ రంగంలోని బలహీన బ్యాంకులకు కేంద్రం త్వరలో తాజా మూలధనాన్ని సమకూర్చనుంది. మొత్తం 10 బ్యాంకులకు ఈ ఆర్థిక సంవత్సరం(2017–18)లో రూ.8,586 కోట్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు అఖిల భారత బ్యాంక్ ఉద్యోగుల సంఘం(ఏఐబీఈఏ) జనరల్ సెక్రటరీ సీహెచ్ వెంకటాచలం వెల్లడించారు. ఈ మేరకు ఆయా బ్యాంకు చీఫ్‌లకు కేంద్రం లేఖ కూడా రాసిందని తెలిపారు. అయితే, ఈ నిధులను దక్కించుకోవాలంటే బ్యాంకుల డైరెక్టర్ల బోర్డులు, యాజమాన్యం ఉద్యోగులు, యూనియన్లు పనితీరుకు సంబంధించి త్రైమాసిక మైలురాళ్ల విషయంలో హామీనివ్వాల్సి ఉంటుందని చెప్పారు. బ్యాంకుల వారీగా కార్యాచరణ ప్రణాళికను ఎస్బీఐ క్యాప్స్ రూపొందించనుందని.. దీని ఆధారంగా బ్యాంకు యాజమాన్యం, ఉద్యోగ సంఘాలు, ప్రభుత్వం మధ్య త్రైపాక్షిక అవగాహన ఒప్పందం(ఎంఓయూ)పై సంతకాలు జరుగుతాయని ఆయన వివరించారు. ఎంఓయూపై సంతకం చేసేందుకు ఏఐబీఈఏ సిద్ధంగా ఉందని కూడా వెంకటాచలం పేర్కొన్నారు. కాగా, నిధులు లభించనున్న బ్యాంకుల్లో ఆంధ్రా బ్యాంక్(రూ.1,100 కోట్లు), బ్యాంక్ ఆఫ్ ఇండియా(రూ.1,500 కోట్లు), బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర(రూ.300 కోట్లు), ఐడీబీఐ బ్యాంక్(రూ.1,900 కోట్లు), ఐఓబీ(రూ.1,100 కోట్లు) వంటివి ఉన్నాయి. -
దూసుకుపోయిన రిలయన్స్ ఇండస్ట్రీస్
వరుసగా ఏడో త్రైమాసికంలోనూ ఆయిల్, టెలికాం దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ స్ట్రీట్ అంచనాలను అధిగమించింది. సోమవారం ప్రకటించిన డిసెంబర్ క్వార్టర్ ఫలితాల్లో దూసుకుపోయి రూ.8,022 కోట్ల లాభాలను నమోదుచేసింది. రిఫైనింగ్ మార్జిన్లలో మంచి లాభాలను ఆర్జించడంతో గతేడాది ఇదే క్వార్టర్ కంటే ఈ క్వార్టర్లో స్వతంత్ర నికర లాభాలను రూ.8,022 కోట్లకు పెంచుకోగలిగామని రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రకటించింది. అయితే విశ్లేషకుల అంచనాల ప్రకారం కంపెనీ రూ.7,856 కోట్ల లాభాలను మాత్రమే ఆర్జిస్తుందని తెలిసింది. ఫలితాల్లో ఈ అంచనాలను కంపెనీ అధిగమించింది. మార్కెట్ అవర్స్ అనంతరం రిలయన్స్ ఫలితాలు వెల్లువడ్డాయి. ఫలితాల ప్రకటన నేపథ్యంలో ఆ కంపెనీ స్టాక్ 1.3 శాతం పడిపోయి రూ.1,077 వద్ద ముగిసింది. టెలికాం సేవలందిస్తున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ సబ్సిడరీ జియో ఇన్ఫోకామ్ సబ్‌స్క్రైబర్ బేస్ కూడా డిసెంబర్ 31 వరకు 7 కోట్ల మార్కును చేధించినట్టు కంపెనీ తెలిపింది. 90 శాతం కంటే ఎక్కువ జనాభాను జియో ఆపరేషన్లను త్వరలోనే కవర్ చేస్తాయని కంపెనీ తెలిపింది. ప్రపచంలోనే అత్యంత వేగవంతంగా అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ కంపెనీగా రిలయన్స్ జియో పేరొందుతోంది. వరుసగా ఎనిమిది త్రైమాసికాల నుంచి కంపెనీ గ్రాస్ రిఫైనింగ్ మార్జిన్లను రెండంకెల సంఖ్యలో నమోదుచేస్తున్నట్టు రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్, చైర్మన్ ముఖేష్ అంబానీ తెలిపారు. గ్లోబల్‌గా వస్తున్న డిమాండ్‌తో జీఆర్ఎమ్లు గణనీయమైన వృద్ధి చేస్తున్నట్టు పేర్కొన్నారు. యేటికేటికి కంపెనీ మొత్తం ఆదాయాలు సుమారు 10 శాతం పెరిగి రూ.69,631 కోట్లగా నమోదయ్యాయి. గత ఆర్థికసంవత్సరం ఇదే కాలంలో రూ.63,406 కోట్ల ఆదాయాలను కంపెనీ ఆర్జించింది. -
స్విస్ లో భారతీయుల నగదు ఢమాల్
న్యూఢిల్లీ : స్విస్ బ్యాంకులో భారతీయుల నగదు తగ్గిపోయిందట. దాదాపు మూడోవంతుకు పడిపోయి, కనిష్ట స్థాయిలో రూ.8,392 కోట్లగా నమోదయిందట. తాజాగా స్విట్జర్లాండ్ సెంట్రల్ బ్యాంకింగ్ అథారిటీ ఎన్ఎన్ బీ(స్విస్ నేషనల్ బ్యాంకు) విడుదల చేసిన రికార్డులో ఈ విషయం వెల్లడైంది. 1997 నుంచి ఆల్ పైన్ నేషన్ స్విస్ బ్యాంకులో దాచిన నగదును పబ్లిక్ గా తీసుకురావడం జరుగుతోంది. వరుసగా ఈ రెండేళ్ల నుంచి స్విస్ బ్యాంకుల్లో భారతీయుల ఫండ్లు క్షీణిస్తూ వస్తున్నాయి. 2006 చివరిలో స్విస్ బ్యాంకుల్లో భారతీయులు ఫండ్ లు రికార్డు స్థాయిలో రూ.23,000 కోట్లగా నమోదయ్యాయి. ఆ తర్వాత 2011,2013 ఏళ్లను మినహాయిస్తే మిగిలిన ఏళ్లలో ఈ ఫండ్ లు కొంతమేర తగ్గాయి. నల్లధనంతో భారత్ చేస్తున్న పోరాటానికి స్విస్ సహకరిస్తూ వస్తోంది. ఈ సహకారాన్ని మరింత బలోపేతం చేయనుంది. 2018 నుంచి ఆటోమేటిక్ ఇన్ ఫర్మేషన్ ఎక్సేంజ్ పై స్విస్ సంతకం చేసే అవకాశాలున్నట్టు కూడా తెలుస్తోంది. అంతేకాక భారత అధికారులు స్విట్జర్లాండ్ లో త్వరలోనే సందర్శించబోతున్నారట. ఈ పర్యటనలో భాగంగా స్విస్ బ్యాంకులోని అనుమానిత ఇండియన్ అకౌంట్ల ఫెండింగ్ సమాచారాన్ని స్విస్ అథారిటీలను కోరనున్నారు.