స్విస్ లో భారతీయుల నగదు ఢమాల్ | Indian money in Swiss banks drops by one-third to Rs 8,392 crore | Sakshi
Sakshi News home page

స్విస్ లో భారతీయుల నగదు ఢమాల్

Published Thu, Jun 30 2016 6:30 PM | Last Updated on Mon, Sep 4 2017 3:49 AM

స్విస్ లో భారతీయుల నగదు ఢమాల్

స్విస్ లో భారతీయుల నగదు ఢమాల్

న్యూఢిల్లీ : స్విస్ బ్యాంకులో భారతీయుల నగదు తగ్గిపోయిందట. దాదాపు మూడోవంతుకు పడిపోయి, కనిష్ట స్థాయిలో రూ.8,392 కోట్లగా నమోదయిందట. తాజాగా స్విట్జర్లాండ్ సెంట్రల్ బ్యాంకింగ్ అథారిటీ ఎన్ఎన్ బీ(స్విస్ నేషనల్ బ్యాంకు) విడుదల చేసిన రికార్డులో ఈ విషయం వెల్లడైంది. 1997 నుంచి ఆల్ పైన్ నేషన్ స్విస్ బ్యాంకులో దాచిన నగదును పబ్లిక్ గా తీసుకురావడం జరుగుతోంది. వరుసగా ఈ రెండేళ్ల నుంచి స్విస్ బ్యాంకుల్లో భారతీయుల ఫండ్లు క్షీణిస్తూ వస్తున్నాయి.

2006 చివరిలో స్విస్ బ్యాంకుల్లో భారతీయులు ఫండ్ లు రికార్డు స్థాయిలో రూ.23,000 కోట్లగా నమోదయ్యాయి. ఆ తర్వాత 2011,2013 ఏళ్లను మినహాయిస్తే మిగిలిన ఏళ్లలో ఈ ఫండ్ లు కొంతమేర తగ్గాయి. నల్లధనంతో భారత్ చేస్తున్న పోరాటానికి స్విస్ సహకరిస్తూ వస్తోంది. ఈ సహకారాన్ని మరింత బలోపేతం చేయనుంది.

2018 నుంచి ఆటోమేటిక్ ఇన్ ఫర్మేషన్ ఎక్సేంజ్ పై స్విస్ సంతకం చేసే అవకాశాలున్నట్టు కూడా తెలుస్తోంది. అంతేకాక భారత అధికారులు స్విట్జర్లాండ్ లో త్వరలోనే సందర్శించబోతున్నారట. ఈ పర్యటనలో భాగంగా స్విస్ బ్యాంకులోని అనుమానిత ఇండియన్ అకౌంట్ల ఫెండింగ్ సమాచారాన్ని స్విస్ అథారిటీలను కోరనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement