Swiss banks
-
ఏమైంది? స్విస్ బ్యాంకుల్లో భారీగా తగ్గిన భారతీయుల డబ్బు
న్యూఢిల్లీ/జ్యూరిక్: స్విస్ బ్యాంకుల్లో భారతీయులు, భారతీయ సంస్థల నిధులు గతేడాది గణనీయంగా తగ్గాయి. 2022తో పోలిస్తే 2023లో 70 శాతం క్షీణించి నాలుగేళ్ల కనిష్ట స్థాయి 1.04 బిలియన్ స్విస్ ఫ్రాంకులకు (సుమారు రూ. 9,771 కోట్లు) పడిపోయాయి.2021లో 3.83 బిలియన్ ఫ్రాంక్‌ల గరిష్ట స్థాయిని చేరిన తర్వాత స్విస్ బ్యాంకుల్లో భారతీయ ఖాతాదారుల మొత్తం నిధులు వరుసగా రెండవ సంవత్సరం క్షీణించాయి. ఇది 14 సంవత్సరాలలో అత్యధికం. బాండ్లు, సెక్యూరిటీలు, వివిధ ఆర్థిక సాధనాల ద్వారా ఇన్వెస్ట్ చేసే నిధుల్లో భారీగా తగ్గుదల ఉండటమే 2023లో ఈ తగ్గుదలకు ప్రధాన కారణం.భారత్‌లోని ఇతర బ్యాంకు శాఖల ద్వారా ఖాతాదారుల డిపాజిట్ ఖాతాలు, నిధులలో గణనీయమైన తగ్గింపులు ఉన్నాయని డేటా వెల్లడించింది. స్విస్ బ్యాంకులు క్రోడీకరించి స్విస్ నేషనల్ బ్యాంక్ (ఎస్ఎన్బీ)కి నివేదించిన ఈ గణాంకాలు స్విట్జర్లాండ్‌లో భారతీయులు ఎంత నల్లధనాన్ని కలిగి ఉన్నాయో పేర్కొనలేదు. స్విస్ బ్యాంకుల్లో భారతీయులు, ఎన్ఆర్ఐలు లేదా ఇతరులు థర్డ్ కంట్రీ సంస్థల పేరిట ఉన్న డబ్బును కూడా ఈ గణాంకాల్లో చేర్చలేదు. -
స్విస్ బ్యాంకుల్లో.. మనోళ్ల సంపద ఎంతో తెలిస్తే..
సాక్షి, న్యూఢిల్లీ: స్విస్ బ్యాంకు భారతీయులు దాచిపెట్టిన సంపద గణనీయంగా పెరిగింది. వరుసగా రెండో ఏడాది కూడా భారీగా పుంజు కున్నాయి. భారతీయలు, కంపెనీలు, పెట్టుబడులు,హోల్డింగ్స్ విలువ 14 ఏళ్ల గరిష్టానికి చేరుకున్నాయి. 2020 ముగింపు నాటికి స్విస్ బ్యాంకుల్లోని నిధులు దాదాపు మూడు రెట్లు పెరిగి 2.55 బిలియన్ స్విస్ ఫ్రాంక్‌లు (రూ. 20,700 కోట్లు)గా ఉండటం గమనార్హం. స్విస్ బ్యాంకుల్లో భారతీయులు, కంపెనీల ద్వారా 2021లో 83 బిలియన్ స్విస్ ఫ్రాంక్‌లకు (రూ.30,626 కోట్లకు) పెరిగాయని స్విట్జర్లాండ్ సెంట్రల్ బ్యాంక్ తన వార్షిక నివేదికలో గురువారం వెల్లడించింది. సెక్యూరిటీలు, సంస్థాగత హోల్డింగ్స్ గణనీయంగా పెరిగాయని స్విస్ బ్యాంకు ధృవీకరించింది. దీని ప్రకారం మొత్తం స్విస్ బ్యాంకింగ్ సిస్టమ్‌లో (239 బ్యాంకులు) కస్టమర్ డిపాజిట్లు 2021లో దాదాపు 2.25 ట్రిలియన్ స్విస్ ఫ్రాంక్స్‌కు పెరిగాయి. ఫారిన్ క్లయింట్స్ ఫండ్స్ కు సంబంధించిన జాబితాలో భారత్ 44వ స్థానంలో ఉండగా యూకే, అమెరికా మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి. యూకే 379 బిలియన్ స్విస్ ఫ్రాంక్స్. 168 బిలియన్ స్విస్ ఫ్రాంక్స్‌గా ఉన్నాయి. ఆ తరువాత వెస్టిండీస్, జర్మనీ, ఫ్రాన్స్, సింగపూర్, హాంగ్‌కాంగ్, లక్సెంబర్గ్, బహమాస్, నెదర్లాండ్స్, కైమన్ ఐలాండ్స్, సైప్రస్ దేశాలు టాప్‌లో ఉన్నాయి. కాగా స్విస్ బ్యాంకుల్లో మనవాళ్ల సంపద 2006లో గరిష్టంగా 6.5 బిలియన్ స్విస్ ఫ్రాంక్స్‌గా నమోదయ్యాయి. కానీ 2018లో 11శాతం, 2017లో 44 క్షీణించాయి. అలాగే 2019 చివరి నుంచి కస్టమర్ డిపాజిట్లు పడిపోయాయని బ్యాంకు తెలిపింది. అయితే 2011, 2013, 2017, 2020, 2021లో ఈ ట్రెండ్ రివర్స్ అయింది. స్విస్ బ్యాంకులకు తరలిపోతున్న భారతీయుల సంపద క్రమేపీ పెరుగుతూ వస్తోంది. -
నల్లధనంపై పోరులో కీలక ముందడుగు
న్యూఢిల్లీ /బెర్న్ : స్విట్జర్లాండ్ బ్యాంకుల్లో భారతీయుల ఖాతాల వివరాలకు సంబంధించి రెండో జాబితా భారత్‌కు చేరింది. స్విట్జర్లాండ్‌తో సమాచార మార్పిడి ఒప్పందానికి (ఏఈఓఐ) అనుగుణంగా భారత్‌కు స్విట్జర్లాండ్ ఈ కీలక సమాచారం అందచేసింది. విదేశాల్లో మూలుగుతున్న నల్లధనంపై ప్రభుత్వం చేపట్టిన పోరాటంలో ఇది మైలురాయిగా భావిస్తున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఈ ఒప్పందం కింద స్విట్జర్లాండ్ ఫెడరల్ ట్యాక్స్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ) బ్యాంకు ఖాతాలపై సమాచారాన్ని అందిస్తున్న 86 దేశాల్లో భారత్ ఒకటి. ఏఈఓఐ కింద స్విస్ బ్యాంకుల్లో భారత పౌరుల బ్యాంకు ఖాతాల వివరాలకు సంబంధించి 2019 సెప్టెంబర్‌లో భారత్ స్విట్జర్లాండ్ నుంచి తొలి జాబితా అందుకుంది. చదవండి : బంజారాహిల్స్‌లో గుట్టలుగా కరెన్సీ కట్టలు ఈ ఏడాది 31 లక్షల ఫైనాన్షియల్ అకౌంట్లకు సంబంధించిన సమాచారాన్ని ఆయా దేశాలతో పంచుకున్నామని ఎఫ్‌డీఏ శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొంది. స్విస్ బ్యాంకుల్లో 86 దేశాలకు చెందిన 31 లక్షల ఖాతాల సమాచారాన్ని స్విట్జర్లాండ్ పంచుకోగా అందులో భారత జాతీయులు, సంస్ధల సంఖ్య భారీగానే ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. పన్ను ఎగవేత, ఇతర ఆర్థిక నేరాలకు సంబంధించిన దర్యాప్తులో భాగంగా గత ఏడాదిగా భారత అధికారుల విజ్ఞప్తి మేరకు స్విస్ అధికారులు 100కు పైగా వ్యక్తులు, సంస్ధలకు సంబంధించిన సమాచారాన్ని పంచుకున్నారని అధికారులు తెలిపారు. ఇక చురుగ్గా ఉన్న ఖాతాలు, 2018లో మూసివేసిన ఖాతాలకు సంబంధించిన సమాచారాన్ని ఏఈఓఐలో భాగంగా స్విస్ అధికారులు భారత్‌తో పంచుకుంటారు. స్విస్ అధికారులు పంచుకున్న ఖాతాల్లో పనామా, బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్, కేమాన్ దీవులు వంటి విదేశాల్లో భారతీయులు నెలకొల్పిన కంపెనీలు, వ్యాపారవేత్తలు, రాజకీయ నేతలు, రాజ కుటుంబాలకు చెందిన వ్యక్తుల వివరాలు ఉండవచ్చని భావిస్తున్నారు. అయితే రెండో జాబితాలో వెల్లడించిన భారతీయుల ఖాతాల్లో ఎంత మొత్తం సంపద ఉందనే వివరాలను అధికారులు వెల్లడించలేదున. ఒప్పంద నిబంధనల్లో పొందుపరిచిన గోప్యతా క్లాజుల కారణంగా సమాచారాన్ని వెల్లడించలేమని అధికారులు చెబుతున్నారు. స్విస్ అధికారులు పంచుకునే సమాచారంలో స్విస్ బ్యాంకు ఖాతాలకు సంబంధించి ఖాతాదారు పేరు, చిరునామా, నివసించే దేశం, పన్ను గుర్తింపు నెంబర్, ఆయా బ్యాంకుల పేర్లు, అకౌంట్లో బ్యాలెన్స్, క్యాపిటల్ ఇన్‌కం వంటి కీలక సమాచారం ఉంటుంది. పన్ను చెల్లింపుదారులు తమ ట్యాక్స్ రిటన్స్‌లో సరైన సమాచారం అందించారా లేదా అనే కోణంలో పన్ను అధికారులు ఈ సమాచారాన్ని పరిశీలించేందుకు అనుమతిస్తారు. ఇక వచ్చే ఏడాది సెప్టెంబర్‌లో స్విస్ అధికారులు తమ బ్యాంకుల్లో భారత జాతీయులు, వారి సారథ్యంలోని సంస్ధల ఖాతాలకు సంబంధించిన సమచారంతో కూడిన మూడో జాబితాను భారత్‌కు అందచేస్తారు. -
భారత్ చేతిలో స్విస్ ఖాతాల సమాచారం..
సాక్షి, న్యూఢిల్లీ : నూతన సమాచార మార్పిడి ఒప్పందానికి అనుగుణంగా స్విస్ బ్యాంకులు, ఆర్థిక సంస్థల్లో భారతీయుల ఖాతాల వివరాలకు సంబంధించిన తొలి సమాచారాన్ని భారత్ అందుకుంది. విదేశాల్లో దాగిన నల్లకుబేరుల బ్లాక్‌మనీ వెలికితీసే ప్రక్రియలో ఇది భారీ ముందడుగుగా భావిస్తున్నారు. భారత్‌తో పాటు 75 దేశాలు స్విట్జర్లాండ్ ఫెడరల్ ట్యాక్స్ అడ్మినిస్ర్టేషన్ (ఎఫ్‌టీఏ) నుంచి ఈ తరహా సమాచారాన్ని పొందుతాయని ఎఫ్‌టీఏ ప్రతినిధి వెల్లడించారు. ఆటోమేటిక్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ (ఏఇఓఐ) ఫ్రేమ్‌వర్క్ కింద స్విట్జర్లాండ్ నుంచి భారత్ తమ ఖాతాదారుల వివరాలపై సమాచారాన్ని అందుకోవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. స్విస్ బ్యాంకుల్లో 2018లో చురుకుగా ఉన్న భారతీయుల ఖాతాలు, క్లోజయిన ఖాతాల వివరాలను కూడా తాజా సమాచారంలో పొందుపరిచారు. 2020 సెప్టెంబర్‌లో తదుపరి సమాచార మార్పిడి జరుగుతుందని ఎఫ్‌టీఏ ప్రతినిధి తెలిపారు. ఎఫ్‌టీఏ మొత్తంమీద 75 దేశాలకు చెందిన 31 లక్షల ఖాతాలకు సంబంధించిన సమాచారాన్ని ఆయా దేశాలతో పంచుకోగా, వారి నుంచి 24 లక్షల ఖాతాల సమాచారాన్ని సేకరించింది. ఈ డేటాలో బ్యాంకు ఖాతాదారు పేరు, ఖాతా సంఖ్యతో పాటు ఖాతాదారుని అడ్రస్, చిరునామా, పన్ను గుర్తింపు సంఖ్య సహా బ్యాంకు, ఆర్థిక సంస్థ పేరు ఖాతాదారు ఖాతాలో ఉన్న నిధుల వివరాలు, క్యాపిటల్ ఇన్కమ్ వంటి పలు వివరాలు ఉంటాయి. ఆ గుట్టు తెలిస్తే.. భారత్‌కు స్విస్ బ్యాంకుల నుంచి లభించిన వివరాలతో అనధికార సంపద పోగేసిన వారిపై గట్టి చర్యలు చేపట్టేందుకు వీలుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ ఖాతాలకు సంబంధించి డిపాజిట్లు, నగదు బదిలీ, పెట్టుబడుల ద్వారా రాబడులు వంటి కీలక సమాచారం వెల్లడవడంతో నల్ల కుబేరుల గుట్టుమట్లు దర్యాప్తు అధికారులకూ కీలక ఆధారాలుగా మారనున్నాయి. కాగా స్విస్ యంత్రాంగం అందించిన సమాచారం ఎక్కువగా భారత వాణిజ్యవేత్తలు, అమెరికా=బ్రిటన్ సహా ఆఫ్రికా దేశాల్లో స్ధిరపడిన ఎన్ఆర్లకు చెందినవని అధికారులు చెబుతున్నారు. మరోవైపు నల్లధనంపై ఉక్కుపాదం మోపాలని పలు దేశాలు నిర్ణయించిన క్రమంలో పలువురు భారతీయులు ఇప్పటికే స్విస్ సహా విదేశీ బ్యాంకుల్లో తమ ఖాతాలను మూసివేశారనే ప్రచారం సాగుతోంది. -
స్విస్ ఖాతాల్లో సొమ్ము తగ్గింది!!
జ్యూరిక్/న్యూఢిల్లీ: స్విస్ ఖాతాల్లో భారతీయులు దాచుకునే నగదు పరిమాణం గణనీయంగా తగ్గుతోంది. 2018లో ఇది 955 మిలియన్ స్విస్ ఫ్రాంకులకు (దాదాపు రూ. 6,757 కోట్లు) పడిపోయింది. అంతక్రితం ఏడాదితో పోలిస్తే ఇది 6 శాతం తగ్గుదల కాగా, దాదాపు రెండు దశాబ్దాల కనిష్ట స్థాయి కూడా కావడం గమనార్హం. స్విస్ నేషనల్ బ్యాంక్ (ఎస్ఎన్బీ) విడుదల చేసిన గణాంకాల్లో ఈ అంశాలు వెల్లడయ్యాయి. అయితే, ఇలా దాచుకున్న డిపాజిట్లలో వివాదాస్పద నల్లధనం ఎంత? సక్రమమైన డిపాజిట్ల మొత్తమెంత? అనే వివరాలు ఇందులో లేవు. అలాగే, వివిధ దేశాల నుంచి వేర్వేరు సంస్థలు, వ్యక్తుల పేరిట భారతీయులు, ప్రవాస భారతీయులు చేసిన డిపాజిట్లకు సంబంధించిన వివరాలు కూడా ఈ డేటాలో లేవు. భారత్‌లోని స్విస్ బ్యాంకుల శాఖల్లో ఉన్న డిపాజిట్ల పరిమాణాన్ని కూడా పరిగణనలోకి తీసుకుని ఎస్ఎన్బీ ఈ డేటా రూపొందించింది. స్విస్ ఖాతాల్లో బ్లాక్‌మనీ దాచుకునే నల్ల కుబేరులపై కేంద్రం కొరడా ఝుళిపిస్తున్న నేపథ్యంలో తాజా గణాంకాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఎస్ఎన్బీ గణాంకాల ప్రకారం స్విస్ బ్యాంకు ఖాతాల్లో విదేశీ ఖాతాదారుల సొమ్ము దాదాపు 4 శాతం క్షీణించి 1.4 లక్షల కోట్ల స్విస్ ఫ్రాంకుల (దాదాపు రూ. 99 లక్షల కోట్లు) స్థాయికి తగ్గింది. -
స్విస్ బ్యాంకులో భారతీయ నిల్వలు తగ్గాయి
-
తప్పుడు ప్రచారం: అదంతా నల్లధనం కాదు
సాక్షి, న్యూఢిల్లీ: స్విస్ బ్యాంకులో భారతీయుల డిపాజిట్లు 50శాతం పుంజుకున్నాయన్నవార్తలపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. స్విస్ బ్యాంకుల్లో జమ చేసిన మొత్తం డబ్బు "చట్టవిరుద్ధం" కాదని పేర్కొన్నారు. స్విస్‌బ్యాంకుల్లో అక్రమ డిపాజిట్లపై తప్పుడు 'తప్పుడు ప్రచారం' జరుగుతోందని జైట్లీ శుక్రవారం తన ఫేస్బుక్ పోస్ట్‌లో రాశారు. స్విస్ బ్యాంకుల్లో డిపాజిట్ అయిన మొత్తం నల్లదనం కాదని జైట్లీ వ్యాఖ్యానించారు. ప్రభుత్వం నల్లధనానికి అడ్డుకట్ట వేయడానికి చేస్తున్న ప్రయత్నాలు అంత క్రియాశీలకంగా లేవన్న అంచనాలను కూడా ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ విషయంపై బహిరంగ వ్యాఖ్యలు చేసేవారు బేసిక్ వాస్తవాలను అర్థం చేసుకోవాలన్నారు. తాజాగా స్విస్ బ్యాంకులో దాదాపు రూ.7000 కోట్ల వరకు పలువురు భారతీయులు పెట్టుబడులు పెట్టారన్నవార్తలపై ఆయన స్పందించారు. గతంతో పోల్చుకుంటే 50 శాతం వరకు నల్లధనం నిల్వలు స్విస్ బ్యాంకులో పెరిగాయని పలు పత్రికలు రాసిన వార్తల పట్ల జైట్లీ అసహనం వ్యక్తం చేశారు. స్విస్ బ్యాంకులో డబ్బులు దాచుకున్న వారందరూ నల్లధనాన్ని దాచినట్లు కాదని ఆయన అన్నారు. అలాంటి అక్రమ లావాలదేవీలపై కఠినంగా వ్యవరిస్తామన్నారు. నల్లధనాన్ని దాచే ప్రతి ఒకరిపై కూడా తీవ్రస్థాయిలో పెనాల్టీ ఉంటుందని జైట్లీ తెలియజేశారు. స్విట్జర్లాండ్, భారత్ దేశాల మధ్య ఉన్న ఒప్పందం ప్రకారం జనవరి 1, 2018 తేది నుండి ఇప్పటి వరకు అక్కడి బ్యాంకులలో భారతీయుల లావాదేవీలకు సంబంధించిన సమాచారం మొత్తం మన దేశానికి అందుతుంది. అలాంటప్పుడు అక్కడ భారతీయులు పలు ఆర్థిక లావాదేవీలు జరిపినంత మాత్రాన.. వారు నల్లధనాన్ని దాచుకుంటున్నారని భావించనవసరం లేదని జైట్లీ స్పష్టం చేశారు. ప్రభుత్వం తన తొలి అయిదు సంవత్సరాల కాలం పూర్తి అయ్యే నాటికి టాక్స్ రిటర్న్స్ దాఖలు చేసేవారి శాతం గణనీయంగా పెరగనుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అభిప్రాయపడ్డారు. ఈ నాలుగేళ్లలో ఆదాయ పన్ను దాఖలు చేసేవారి సంఖ్య 57శాతం పుంజుకుందన్నారు. గత ఏడాది ఆదాయ పన్నుల వసూళ్లు 18శాతం పెరిగాయనీ జైట్లీ పేర్కొన్నారు. కాగా 2017 డేటా ప్రకారం స్విస్ బ్యాంకులో భారతీయుల డిపాజిట్లు 50శాతం పెరిగి1.01 బిలియన్ డాలర్ల (సుమారు రూ .7,000 కోట్లు)గా నమోదయ్యాయి. అలాగే విదేశీయుల లావాదేవీలు 3 శాతం వరకు పెరిగి 1.46 ట్రిలియన్ స్విస్ ఫ్రాంకులు( సుమారు 100 లక్షల కోట్ల రూపాయలుగా) ఉన్నాయి. -
మళ్లీ స్విస్ బ్యాంకులు గలగల..
జ్యురిచ్/న్యూఢిల్లీ : స్విస్ బ్యాంకుల్లో భారతీయులు దాచిన సొమ్ము 2017లో 50 శాతం పెరిగి రూ 7000 కోట్లకు చేరింది. గత మూడేళ్లలో స్విస్ బ్యాంకుల్లో నల్లకుబేరులు దాచిన సొమ్ము తగ్గుతూ వస్తున్న క్రమంలో గత ఏడాది ఏకంగా 50 శాతం పెరగడం గమనార్హం. బ్లాక్ మనీ నిరోధంపై కేంద్రం ప్రకటించిన పలు చర్యల నేపథ్యంలో స్విస్ బ్యాంకుల్లో భారతీయులు దాచే మొత్తం పెరిగిందని భావిస్తున్నారు. 2017లో విదేశీ ఖాతాదారులు దాచిన నిధుల మొత్తం గణనీయంగా పెరిగి మొత్తం నిల్వలు రూ 100 లక్ష కోట్లకు పెరిగాయని స్విస్ జాతీయ బ్యాంక్ (ఎస్ఎన్బీ) విడుదల చేసిన అధికారిక వార్షిక గణాంకాలు వెల్లడించాయి. కాగా స్విస్ బ్యాంక్ సహా విదేశీ బ్యాంకుల్లోనూ నల్లకుబేరులు దాచిన మొత్తాలపై భారత్ ఉక్కుపాదం మోపిన క్రమంలో భారత్ నుంచి స్విస్ బ్యాంకుల్లో డిపాజిట్లు పెరగడంపై విస్మయం వ్యక్తమవుతోంది. 2016లో స్విస్ బ్యాంకుల్లో భారత కుబేరులు దాచిన మొత్తం 45 శాతం పతనమైన విషయం తెలిసిందే. కాగా నల్లధనంపై భారత్ చేస్తున్న పోరాటానికి సహకరించేలా అవసరమైన సమాచారం అందచేసేందుకు స్విట్జర్లాండ్ నూతన ఒప్పందంపై అంగీకారం తెలిపింది. -
భూమి గుండ్రంగా ఉంది?
అక్షర తూణీరం సముద్ర తీరాన నిలబడి వచ్చే ఓడని గమనిస్తే– మొదట జెండా క్రమంగా పై భాగం మధ్య భాగం కనిపిస్తాయి. దీన్ని బట్టి భూమి గుండ్రంగా ఉందని నమ్మాలి. అసలు దేశానికి పెద్ద అనర్థమేమంటే– ప్రభుత్వం పార్టీ పేరు మీద కాకుండా ముఖ్యనేత పేరుమీద నడవడం. ఉదాహరణకి ‘మోదీ గవర్నమెంట్’ అని వ్యవహరిం చడం. ప్రజాస్వామ్య పునాదులు ఇక్కడే కదిలిపోతాయ్. ఒక్కసారి మోదీ గద్దెక్కాక సామాన్యుడికి ఒరిగిందేమిటో చూద్దాం. చిన్నతరహా పరిశ్రమలుగానీ, వ్యవసాయ రంగంగానీ హాయిగా ఊపిరి పీల్చుకున్నది లేదు. మన దేశంలో చిన్న పరిశ్రమ రెక్కలు ముక్కలు చేసుకుని ఉత్పత్తి చేస్తుందిగానీ ఫలితాన్ని దళారీ రాబందులు తన్నుకుపోతాయి. కనీసం వాడకందారుకి చేరేలోపు మూడు రకాల దళారీ వ్యవస్థలు లాభాల్నీ కొరికేస్తాయి. ఇక ఉత్పత్తిదారుడికి మిగిలేది చాకిరీ మాత్రమే. చేనేత పరిశ్రమ ఇందుకు మిన హాయింపు కాదు. ఇక వ్యవసాయం మరీ దారుణం. రైతు ఆశాజీవి. ప్రభుత్వాలు రుణాలు ఎరవేసి రైతుల్ని ప్రలోభ పెడుతున్నారు. రుణాలివ్వడం, వాటిని మాఫీ చేస్తామని ఓట్ల కోసం ఆశ పెట్టడం పరిపాటి అయింది. ఇప్పటికీ కూడా మన రైతులకు వ్యవసాయ శాఖ నించి సరైన సలహాలు, సూచనలు అందవు. ఇప్పటికీ నకిలీ విత్తనాలపై ఆంక్షలు లేవు. నూతన పరిశోధనలు రైతులకు అందనే అందవు. కేవలం వార్తల్లో మాత్రం అధిక దిగుబడుల వంగడాల మాటలు విని పిస్తాయి. అధునాతన పరిజ్ఞానం గ్రామాలకు చేరనే చేరదు. అన్నీ సక్రమంగా ఉన్నా పంట అయ్యేనాటికి అడివి అవుతోంది. ఇక విద్య, వైద్యం కార్పొరేట్ కోరల్లోంచి బయ టకు రాకపోగా మరింత సుఖంగా చిక్కుకు పోయింది. ప్రజలు ఎన్ని రకాల పన్నులు కడుతు న్నారో తెలియకుండా మభ్య పెడుతున్నారు. అన్నీ భాగ స్వామ్య వసతులే. అన్ని రహదారులకూ టోల్ పేరిట ప్రతి ట్రిప్పుకీ పన్ను చెల్లిం చాలి. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ఎయిర్ పోర్టులూ పార్కింగ్ నుంచి పాయ ఖానా దాకా డబ్బు గుంజు తున్నాయి. డబ్బున్నవాడు నాలుగు వంతెనలు, రెండు ఫ్లై ఓవర్లూ కట్టుకుంటే చాలు. వాటిమీద సుఖంగా బతికేయచ్చు. జన్‌ధన్ ఖాతాలన్నారు. ఆధార్‌తో భార తీయుల పంచప్రాణాలు, నవరంధ్రాలు అనుసంధానం చేస్తేగానీ దేశం ముందు కెళ్లదన్నారు. పెద్ద నోట్లు రద్దు అన్నారు. మీ జాతకాలు తిరగబడతాయన్నారు. అసలు పవర్లోకి రాకముందే స్విస్ బ్యాంకు ఖాతాల్లోంచి నల్లధనం దింపుతాం, అందరూ ఐకమత్యంగా పంచుకోండన్నారు. ఆ ఓడలు ఎక్కడున్నాయో తెలియదు. మోదీ ప్రభుత్వంలో అవినీతి లేదు, స్కాములు లేవు, అంతా కడిగిన అద్దం అన్నారు. క్యాబినెట్ వరకు కావచ్చు. అలవాటుపడిన అధికార యంత్రాంగం మాత్రం ధరలు నాలుగు రెట్లు పెంచిన మాట నిజం. అవినీతి తగ్గడమంటే వేళ్ల దాకా తగ్గాలి. చిన్నప్పుడు భూమి గుండ్రంగా ఉందని చెప్పడానికి, సముద్ర తీరాన నిలబడి వచ్చే ఓడని గమనిస్తే– మొదటి జెండా క్రమంగా పై భాగం మధ్య భాగం కనిపిస్తాయి. దీన్ని బట్టి భూమి గుండ్రంగా ఉందని నమ్మాలి. మోదీ సర్కార్‌ని కూడా అలాగే నమ్మాలి. వేరే దారి లేదు. శ్రీరమణ (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) -
‘స్విస్ నల్లధనం’ వివరాల సేకరణ
న్యూఢిల్లీ: స్విట్జర్లాండ్ బ్యాంకుల్లోని నల్లధనాన్ని గుర్తించేందుకు భారత్ ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ‘నల్ల ఖాతాదారుల’ వివరాలు ఇవ్వాలంటూ ఈ ఏడాది జూన్ నుంచి ఇప్పటిదాకా స్విట్జర్లాండ్‌కు 20వినతులను సమర్పించింది. స్విస్ బ్యాంకుల్లో నల్లధనం దాచారనే అనుమానం ఉన్న వారి పేర్లతో జాబితా తయారుచేసి, వారి ఖాతాల వివరాలను ఇవ్వాల్సిందిగా స్విట్జర్లాండ్‌ను కోరింది. 2018 సెప్టెం బరు నుంచి భారతీయుల స్విస్ ఖాతాల వివరాలను ఆటోమేటిక్‌గా తీసుకునేందుకు వీలుగా స్విట్జర్లాండ్‌తో భారత్ ఒప్పందం కుదుర్చుకుంది. ఇటీవలి గణాంకాల ప్రకారం స్విస్ బ్యాంకుల్లో భారతీయుల డబ్బు రికార్డు స్థాయిలో తగ్గిపోయింది. -
ఈ సర్జికల్ స్ట్రైక్స్ స్విస్ బ్యాంకుపై చేయండి!
-
ఈ సర్జికల్ స్ట్రైక్స్ స్విస్ బ్యాంకుపై చేయండి!
పెద్ద నోట్లను రద్దు చేస్తూ మూడు రోజుల క్రితం ప్రధాని నరేంద్రమోదీ తీసుకున్న నిర్ణయంపై శివసేన మండిపడింది. ఈ సర్జికల్ స్ట్రైక్స్ సామాన్యులపై కాదని.. స్విస్ బ్యాంకుపై చేయాలని శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే వ్యాఖ్యానించారు. నల్లధనం పెద్ద మొత్తంలో స్విస్ బ్యాంకులో దాగిఉన్న సంగతి విదితమే. నల్లధనం వెలికితీతకు ప్రధాని తీసుకున్న నిర్ణయాన్ని తాను వ్యతిరేకించడం లేదని, కానీ అమలుచేసే పద్ధతే సరియైనది కాదన్నారు. పెద్ద నోట్ల రద్దుచేస్తూ ప్రధాని వెల్లడించిన నిర్ణయంతో సామాన్య ప్రజలు అవస్తలు పాలవుతున్నారని విమర్శించారు. ప్రజలు మనకి ఓటేసిన సంగతి మరచిపోకూడదు. ఇది ఇలానే కొనసాగిస్తే.. ప్రజలు మనపై సర్జికల్ స్ట్రైక్స్ చేస్తారని హెచ్చరించారు. దబార్లో శివసేన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఆయన ఈ విషయాలు తెలిపారు. '' తరుచూ ప్రజలతో మన్ కీ బాత్ నిర్వహించే మోదీజీ.. ప్రజల మాటను మరచిపోయినట్టు కనిపిస్తున్నారు. ధన్ కీ బాత్ ఎంపికచేసుకున్నారు'' అని వ్యాఖ్యానించారు.. వేల కొద్దీ స్విస్ బ్యాంకులో దాగిఉన్న బ్లాక్ మనీపై సర్జికల్ స్ట్రైక్ చేయాలని మోదీని డిమాండ్ చేశారు. స్విస్ బ్యాంకులో ఉన్న డిపాజిట్లపై బ్లాక్ మనీపై సర్జికల్ స్ట్రైక్ చేసినప్పుడే మోదీ చర్యలకు బలం చేకూరుతుందని పేర్కొన్నారు. నల్లధనంపై ఉక్కుపాదం మోపండి, కానీ సామాన్య ప్రజలపై కాదని సలహా ఇచ్చారు. ప్రజలకోసం మంచి చేస్తున్నట్టు చూపిస్తూనే, మరోవైపు ప్రజల సొంత డబ్బుతోనే వారిని చిత్రహింసలు పెడుతున్నట్టు ఆరోపించారు. ఆసుపత్రి బిల్లులు చెల్లించడానికి కూడా వారి దగ్గర డబ్బు లేదని, పెళ్లిళ్లూ ఆగిపోయాయని చెప్పారు. బ్యాంకు క్యూలో నిల్చుని ఓ సీనియర్ సిటిజన్ మరణించడంతో, ఆయన మృతికి ఎవరు బాధ్యులని ఠాక్రే ప్రశ్నించారు. -
స్విస్ లో భారతీయుల నగదు ఢమాల్
న్యూఢిల్లీ : స్విస్ బ్యాంకులో భారతీయుల నగదు తగ్గిపోయిందట. దాదాపు మూడోవంతుకు పడిపోయి, కనిష్ట స్థాయిలో రూ.8,392 కోట్లగా నమోదయిందట. తాజాగా స్విట్జర్లాండ్ సెంట్రల్ బ్యాంకింగ్ అథారిటీ ఎన్ఎన్ బీ(స్విస్ నేషనల్ బ్యాంకు) విడుదల చేసిన రికార్డులో ఈ విషయం వెల్లడైంది. 1997 నుంచి ఆల్ పైన్ నేషన్ స్విస్ బ్యాంకులో దాచిన నగదును పబ్లిక్ గా తీసుకురావడం జరుగుతోంది. వరుసగా ఈ రెండేళ్ల నుంచి స్విస్ బ్యాంకుల్లో భారతీయుల ఫండ్లు క్షీణిస్తూ వస్తున్నాయి. 2006 చివరిలో స్విస్ బ్యాంకుల్లో భారతీయులు ఫండ్ లు రికార్డు స్థాయిలో రూ.23,000 కోట్లగా నమోదయ్యాయి. ఆ తర్వాత 2011,2013 ఏళ్లను మినహాయిస్తే మిగిలిన ఏళ్లలో ఈ ఫండ్ లు కొంతమేర తగ్గాయి. నల్లధనంతో భారత్ చేస్తున్న పోరాటానికి స్విస్ సహకరిస్తూ వస్తోంది. ఈ సహకారాన్ని మరింత బలోపేతం చేయనుంది. 2018 నుంచి ఆటోమేటిక్ ఇన్ ఫర్మేషన్ ఎక్సేంజ్ పై స్విస్ సంతకం చేసే అవకాశాలున్నట్టు కూడా తెలుస్తోంది. అంతేకాక భారత అధికారులు స్విట్జర్లాండ్ లో త్వరలోనే సందర్శించబోతున్నారట. ఈ పర్యటనలో భాగంగా స్విస్ బ్యాంకులోని అనుమానిత ఇండియన్ అకౌంట్ల ఫెండింగ్ సమాచారాన్ని స్విస్ అథారిటీలను కోరనున్నారు. -
స్విస్ బ్యాంకుల్లో తగ్గిపోయిన మన డబ్బు!
నల్లధనానికి స్వర్గధామాలుగా ఉండే స్విస్ బ్యాంకుల్లో భారతీయులు దాచుకున్న సొమ్ము గత సంవత్సరం కంటే దాదాపు 10 శాతం తగ్గిపోయింది. ఈ మొత్తం దాదాపు రూ. 12,615 కోట్లట! భారతదేశంతో పాటు ఇతర దేశాల ప్రభుత్వాలు కూడా స్విస్ బ్యాంకు ఖాతాల వివరాలను రహస్యంగా ఉంచడానికి వీల్లేదని, వాటిని ప్రభుత్వాలకు ఇవ్వాల్సిందేనని పట్టుబట్టడం వల్లే ఇలా జరిగిందని భావిస్తున్నారు. ఈ వివరాలను అక్కడి స్విస్ నేషనల్ బ్యాంకు వర్గాలు తెలిపాయి. స్విస్ బ్యాంకుల్లో భారతీయుల డబ్బు ఇంత తక్కువ మొత్తంలో ఉండటం ఇది రెండోసారి అని చెబుతున్నారు. 2013లో ఒకేసారి అంతకుముందున్న దానికంటే 40 శాతానికి పైగా డబ్బు పెరిగింది. కానీ ఈసారి మాత్రం ఏకంగా 12వేల కోట్ల రూపాయలు పడిపోయింది. 2012లో కూడా ఇలాగే ఒకసారి భారతీయుల డబ్బు బాగా తగ్గింది. అప్పట్లో అయితే దాదాపు 33 శాతం వరకు తగ్గిపోయిందని చెబుతున్నారు. -
ఆశాజనకంగాలేని స్విస్ బ్యాంకుల స్పందన
న్యూఢిల్లీ: బ్లాక్‌మనీ వ్యవహారంపై భారత్ ఒత్తిళ్లకు స్విస్ బ్యాంకులు స్పందించాయి. అయితే తమకున్న కఠిన నిబంధనలను తాము పాటిస్తామని స్విస్ బ్యాంకుల అధికారులు తెలిపారు. భారత్ కోరే సమాచారం న్యాయబద్ధంగా ఉండాలని అవి స్పష్టం చేశాయి. స్విట్జర్లాండ్ ఖ్యాతిని భారత్ తెలుసుకోవాలని, చట్టబద్ధంగా, న్యాయపరమైన వ్యవస్థ గల తమ దేశ ప్రతిష్టకు అపనమ్మకాల కారణంగా భంగం కలుగుతుందని స్విస్ బ్యాంకులు పేర్కొన్నాయి. నరేంద్ర మోడీ ప్రభుత్వం మొదటి మంత్రి మండలి సమావేశంలోనే బ్లాక్ మనీపై కఠిన నిర్ణయం తీసుకుంది. జస్టిస్ షా నేతృత్వంలో ఒక కమిటీని కూడా మోడీ ప్రభుత్వం వేసింది. ఇటువంటి పరిస్థితుల్లో స్విస్ బ్యాంకుల ప్రకటన ఇలా వచ్చింది. కేంద్రం నిర్ణయానికి ఇదేమంత ఆశాజనకంగా ఉన్నట్లు కనిపించడంలేదు. మనదేశంలో బడాబాబులు దాచుకున్న నల్లధనాన్ని వెలుగులోకి తీసుకురావడం అంత తేలిక కాదని స్సష్టమవుతోంది. - శిసూర్య -
స్విస్ ఖాతాదారుల వివరాలివ్వండి
న్యూఢిల్లీ: నల్లధనం వెలికితీసే దిశగా భారత్ చర్యలు తీసుకుంటోంది. పన్ను చెల్లించకుండా స్విస్ బ్యాంకుల్లో ధనం దాచిన భారతీయుల పేర్లు, వివరాలను తెలియజేయాల్సిందిగా కోరుతూ భారత ప్రభుత్వం స్విట్జర్లాండ్‌ను కోరింది. ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ మేరకు ఉత్తరం రాసింది. స్విస్ బ్యాంకుల్లో నల్లధనం దాచినట్టుగా అనుమానిస్తున్న భారతీయుల వివరాలను అందజేస్తామని ఇటీవల స్విట్జర్లాండ్ అధికారులు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో భారత్‌కు పూర్తిగా సహకరిస్తామని చెప్పారు. ఈ నేపథ్యంలో స్విస్ బ్యాంక్ ఖాతాదారుల వివరాలు అందజేయాల్సిందిగా భారత్ విన్నవించింది. పన్ను చెల్లించని, రహస్యంగా సంపద దాచిన వారిపై చర్యలు తప్పవని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చెప్పారంటూ ఆ శాఖ అధికారులు తెలిపారు.