స్విస్ ఖాతాదారుల వివరాలివ్వండి
న్యూఢిల్లీ: నల్లధనం వెలికితీసే దిశగా భారత్ చర్యలు తీసుకుంటోంది. పన్ను చెల్లించకుండా స్విస్ బ్యాంకుల్లో ధనం దాచిన భారతీయుల పేర్లు, వివరాలను తెలియజేయాల్సిందిగా కోరుతూ భారత ప్రభుత్వం స్విట్జర్లాండ్ను కోరింది. ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ మేరకు ఉత్తరం రాసింది.
స్విస్ బ్యాంకుల్లో నల్లధనం దాచినట్టుగా అనుమానిస్తున్న భారతీయుల వివరాలను అందజేస్తామని ఇటీవల స్విట్జర్లాండ్ అధికారులు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో భారత్కు పూర్తిగా సహకరిస్తామని చెప్పారు. ఈ నేపథ్యంలో స్విస్ బ్యాంక్ ఖాతాదారుల వివరాలు అందజేయాల్సిందిగా భారత్ విన్నవించింది. పన్ను చెల్లించని, రహస్యంగా సంపద దాచిన వారిపై చర్యలు తప్పవని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చెప్పారంటూ ఆ శాఖ అధికారులు తెలిపారు.