సీఎం క్యాంపు కార్యాలయానికి రూ.95లక్షలు మంజూరు
హైదరాబాద్ : విజయవాడలోని లింగమనేని ఎస్టేట్స్ భవనంలో ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయానికి రూ.95.28 లక్షలు మంజూరు చేస్తూ హోం శాఖ ముఖ్య కార్యదర్శి డాక్టర్ బి. ప్రసాదరావు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆ భవనానికి మరమ్మతులు చేయడం, ఆధునికరించడానికి రూ.63.58 లక్షలు, యాక్సెస్ కంట్రోల్ ఉపకరణాలు ఏర్పాటుకు రూ.31.7 లక్షలు మంజూరు చేశారు.
వీటికి అవసరమైన తదుపరి చర్యలు తీసుకోవాల్సిందిగా నిఘా విభాగం అదనపు డీజీని హోం శాఖ ముఖ్య కార్యదర్శి ఆదేశించారు.