RS Bharathy
-
రాజ్యసభ సభ్యుడు అరెస్ట్
చెన్నై: డీఎంకే పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ, రాజ్యసభ సభ్యుడు ఆర్ఎస్ భారతి(73)ని శనివారం చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు. షెడ్యూల్ కులాన్ని అవమానించేలా వ్యాఖ్యలు చేసినందుకు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. దళిత సంస్థ ఆది తమిజార్ పెరవై నాయకుడు అరుణ్ కుమార్ ఫిర్యాదు మేరకు అలందూర్‌లోని ఆయన నివాసంలో ఆర్ఎస్ భారతిని అరెస్ట్ చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరి 15న కలైంజర్ రీడింగ్ సర్కిల్ నిర్వహించిన కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఎస్సీలను కించేపరిచే విధంగా ఆర్ఎస్ భారతి వ్యాఖ్యలు చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అరెస్ట్ చేసిన తర్వాత వైద్య పరీక్షల కోసం ఆయనను రాజీవ్‌గాంధీ జనరల్ ఆస్పత్రికి తరలించారు. ఈ సందర్భంగా ఆర్ఎస్ భారతి మీడియాతో మాట్లాడుతూ.. అన్నాడీఎంకే ప్రభుత్వం తనను కక్షపూరితంగా అరెస్ట్ చేసిందని ఆరోపించారు. ఇలాంటి వాటికి తాను భయపడబోనని, ప్రభుత్వ అవినీతికి వ్యతిరేకంగా పోరాటం కొనసాగిస్తానని ప్రకటించారు. (ఇది నిజమా.. ఇంతకంటే దారుణం ఉండదు) ‘అవినీతి కేసులో డిప్యూటీ సీఎం ఓ పన్నీర్ సెల్వంపై నిన్న ఫిర్యాదు చేసినందుకు ప్రభుత్వం నన్ను అరెస్టు చేసింది. కోయంబత్తూరులో బ్లీచింగ్ పౌడర్‌ను సుమారు 200 కోట్ల రూపాయలకు కొనుగోలు చేయడంలో అక్రమాల గురించి ఫిర్యాదు చేయడానికి మేము ఇప్పుడు సిద్ధమవుతున్నాము. మీరు దువ్వెనను దాచినంత మాత్రాన పెళ్లి ఆగిపోదు. నేను జైలులో ఉన్నప్పటికీ, మా న్యాయవాదుల బృందం ప్రభుత్వంపై ఫిర్యాదు చేస్తుంద’ని అన్నారు. కాగా, భారతికి ఎగ్మోర్ మేజిస్ట్రేట్ కోర్టు జూన్ 1 వరకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. కాగా, ఫిబ్రవరిలో తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించి, సోషల్ మీడియాలో ప్రచారం చేశారని ఆర్ఎస్ భారతి వాపోయారు. ‘తర్వాతి రోజే మీకు(మీడియా) క్షమాపణ చెప్పాన’ని ఆయన గుర్తు చేశారు. (కరోనా కన్నా లాక్డౌన్ మరణాలే ఎక్కువ!) -
ఆలందూరులో డీఎంకే అభ్యర్థి భారతి
సాక్షి, చెన్నై: ఆలందూరు ఉప ఎన్నిక బరిలో డీఎంకే అభ్యర్థిగా ఆర్ఎస్ భారతి పోటీ చేయనున్నారు. డీఎండీకే అభ్యర్థిగా కామరాజన్ పోటీకి సిద్ధమవుతున్నారు. 2011 అసెంబ్లీ ఎన్నికల్లో చెన్నై మహానగరం పరిధిలోని కాంచీపురం జిల్లా ఆలందూరు నియోజకవర్గం నుంచి డీఎండీకే అభ్యర్థి బన్రూటి రామచంద్రన్ గెలిచారు. ఆయన డీఎండీకే నుంచి బయటకు వస్తూ, తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా సైతం చేశారు. దీంతో ఆ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యం అయింది. ప్రస్తుతం అన్నాడీఎంకేలో చేరిన బన్రూటి ఆ పార్టీ అభ్యర్థి గెలుపునకు కృషి చేసే పనిలో ఉన్నారు. ఆ పార్టీ అభ్యర్థిగా స్థానిక నాయకుడు వీఎన్‌పీ వెంకట్రామన్ ఎన్నికల్లో పోటీ చేస్తారని గత వారం జయలలిత ప్రకటించారు. కరుణి నిర్ణయం: అన్నాడీఎంకే అభ్యర్థి బరిలో దిగడంతో డీఎంకే, డీఎండీకే, కాంగ్రెస్‌లు తమ అభ్యర్థులను దించేనా అన్న ఉత్కంఠ నెలకొం ది. ఇది వరకు కూటమి ధర్మానికి కట్టుబడి ఈ స్థానానికి కాంగ్రెస్‌కు అప్పగిస్తూ వచ్చిన డీఎంకే, ఈ సారి అభ్యర్ధిని దించింది. ఆ పార్టీ న్యాయవాద విభాగం నేత ఆర్ఎస్ భారతీని అభ్యర్థిగా ఎంపిక చేస్తూ డీఎంకే అధినేత ఎం కరుణానిధి నిర్ణయించారు. గత లోక్ సభ ఎన్నికల్లో దక్షిణ చెన్నై అభ్యర్థిగా ఆర్ఎస్ భారతీ పోటీ చేసి ఓటమి చవి చూశారు. ఆలందూరు నియోజకవర్గ పరిధిలో ఆయనకు ఇతర పార్టీల అభ్యర్థుల కన్నా అత్యధిక ఓట్లు వచ్చాయి. దీంతో ఆయన్ను విజయం వరించే అవకాశాలు ఉన్నాయన్న సంకేతాలు వెలువడుతున్నాయి. డీఎండీకే అభ్యర్థి కామరాజన్: అన్నాడీఎంకే, డీఎంకే అభ్యర్థుల ప్రకటనతో సిట్టింగ్ బరిలో ఎవరిని డీఎండీకే దించుతుందోనన్న ప్రశ్న బయలు దేరింది. ముందుగా ఊహించినట్టే ఆలందూరుపార్టీ నేత కామరాజన్ను రంగంలో కి దించేందుకు విజయకాంత్ నిర్ణయించారు. బీజేపీతో పొత్తు ప్రకటన రోజే అభ్యర్థిని పరిచ యం చేయడానికి విజయకాంత్ నిర్ణయించి నట్టు ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇక కాంగ్రెస్ అభ్యర్థిగా గత ఎన్నికల్లోను స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి చవిచూసిన గాయత్రీ దేవి మళ్లీ రేసులో దిగే అవకాశాలు కన్పిస్తున్నాయి.