RS MP
-
‘పెట్రోల్‌తో పాలు పోటీపడుతున్నాయి.. ఇక్కడితో ఆగదు’
గాంధీనగర్: పాల ధరను లీటరుకు రూ.2 పెంచుతున్నట్లు అమూల్ సంస్థ ప్రకటించింది. ఈ క్రమంలో పాల ధరలపై ఆమ్ ఆద్మీ పార్టీ విమర్శలు గుప్పించింది. ధరల పెరుగుదల విషయంలో పెట్రోల్‌తో పాలు పోటీ పడుతున్నట్లు కనిపిస్తోందని ఎద్దేవా చేశారు ఆప్ రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్ధా. ధరలపై ఉదాసీనత ప్రదర్శించే ప్రభుత్వ తప్పులతో దేశంలోని మధ్యతరగతి కుటుంబాలు మూల్యం చెల్లించుకుంటూనే ఉన్నాయని విమర్శించారు. ఫుల్ క్రీమ్ మిల్క్, గేదె పాలపై లీటర్‌కు రూ.2 చొప్పున పెంచుతున్నట్లు అమూల్ బ్రాండ్ పేరిట మార్కెటింగ్ చేసే గుజరాత్ కో-ఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ (జీసీఎంఎంఎఫ్) వెల్లడించింది. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న గుజరాత్ మినహా అన్ని రాష్ట్రాల్లోనూ కొత్త ధరలు అమలవుతాయని వెల్లడించింది. దీనిపై ఆప్ ఎంపీ రాఘవచద్దా ట్వీట్ చేశారు. ‘మీకు చెప్పాను కదా..! ధరల విషయంలో పాలు, పెట్రోల్ పోటీ పడుతున్నట్లు కనిపిస్తున్నాయి. పెరుగుదలతో సామాన్యుల నడ్డి విరుగుతోంది. ఈ రోజు అమూల్ పాల ధరలు లీటర్‌కు రూ.2 చొప్పున పెరిగాయి. ఉదాసీనంగా వ్యహరిస్తోన్న ప్రభుత్వం కారణంగా సామాన్య ప్రజలు మూల్యం చెల్లించుకుంటూనే ఉన్నారు. పాల ధరలు మళ్లీ పెరుగనున్నాయి? కారణాలు.. పశుగ్రాసం ధరల విపరీతంగా పెరగటం, లంపీ వైరస్ వ్యాప్తి’ అని భాజపాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పశుగ్రాసం ధరలు భారీగా పెరిగిపోతున్నాయని, దాంతో రైతులు ఇతర పంటలను పశువులకు అందిస్తున్నట్లు గుర్తు చేశారు రాఘవ్ చద్ధా. పశుగ్రాసం ధరలు 9 ఏళ్ల గరిష్ఠానికి చేరుకున్నాయని పేర్కొన్నారు. ఒక్క గుజరాత్‌లోనే గత రెండేళ్లలో 1.36 లక్షల హెక్టార్ల పశుగ్రాసం సాగు తగ్గిపోయిందన్నారు. పశుగ్రాసానికి కొరత ఏర్పడిన క్రమంలో 2020లో 100 ఎఫ్పీఓలు ఏర్పాటు చేస్తామని చెప్పిన కేంద్రం.. ఇప్పటి వరకు ఒక్కటి సైతం ఏర్పాటు చేయలేకపోయిందని ఆరోపించారు. ఇదీ చదవండి: రాహుల్ ఓ ఫెయిల్డ్ మిసైల్.. కాంగ్రెస్ మళ్లీ ప్రయోగిస్తోంది: బొమ్మై -
నేడు టీఆర్‌ఎస్‌పీపీ భేటీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి పార్లమెంటరీ పార్టీ (టీఆర్‌ఎస్‌పీపీ) సమావేశం గురువారం మధ్యాహ్నం 2 గంటలకు జరగనుంది. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్లో జరగనున్న ఈ సమావేశంలో అధికార పార్టీకి చెందిన లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు హాజరుకానున్నారు. ఈ నెల 17 నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో టీఆర్ఎస్ ఎంపీలు అనుసరించాల్సిన వ్యూహంపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. టీఆర్ఎస్ లోక్‌సభా పక్ష నేతను ఈ సమావేశంలోనే ఎన్నుకోనున్నారు. టీఆర్ఎస్ కీలక నేతలు లోక్‌సభ ఎన్నికల్లో ఓడిపోయిన నేపథ్యంలో ఆ పార్టీ లోక్‌సభపక్ష నేతగా ఎవరు ఉంటారనేది ఆసక్తికరంగా మారింది. గత లోక్‌సభలో టీఆర్ఎస్ లోక్‌సభా పక్షనేతగా ఉన్న ఏపీ జితేందర్‌రెడ్డికి ఈసారి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఇవ్వలేదు. గత సభలో సభ్యులుగా ఉన్న బోయినపల్లి వినోద్‌కుమార్, కల్వకుంట్ల కవిత, గోడం నగేశ్, బూర నర్సయ్యగౌడ్ ఈ ఎన్నికల్లో ఓడిపోయారు. ప్రస్తుతం టీఆర్ఎస్ తరఫున గెలిచిన తొమ్మిది మంది లోక్‌సభ సభ్యుల్లో బి.బి.పాటిల్ (జహీరాబాద్), కొత్త ప్రభాకర్‌రెడ్డి (మెదక్), పసునూరి దయాకర్ (వరంగల్), నామా నాగేశ్వర్రావు (ఖమ్మం) రెండోసారి ఎన్నికయ్యారు. నామా నాగేశ్వర్రావు 2009 నుంచి 2014 వరకు టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా వ్యవహరించారు. పోతుగంటి రాములు (నాగర్‌కర్నూలు) గతంలో రాష్ట్ర మంత్రిగా, మాలోతు కవిత (మహబూబాబాద్) గతంలో ఎమ్మెల్యేగా పని చేశారు. మిగిలిన ముగ్గురు వెంకటేశ్‌నేత (పెద్దపల్లి), మన్నె శ్రీనివాస్‌రెడ్డి (మహబూబ్‌నగర్), గడ్డం రంజిత్‌రెడ్డి (చేవెళ్ల) చట్టసభకు తొలిసారి ఎన్నికయ్యారు. ఈ ముగ్గురిలో ఒకరికి అవకాశం.. సీనియర్ ఎంపీలుగా ఉన్న కొత్త ప్రభాకర్‌రెడ్డి, నామా నాగేశ్వర్రావు, పసునూరి దయాకర్‌లో ఒకరికి టీఆర్ఎస్ లోక్‌సభా పక్షనేతగా అవకాశం దక్కనుంది. గతంలో టీడీపీ లోక్‌సభా పక్షనేతగా వ్యవహరించిన నామా నాగేశ్వర్రావు ఇప్పుడు టీఆర్ఎస్ తరఫున ఖమ్మం ఎంపీగా గెలిచారు. కమ్మ సామాజికవర్గానికి రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రి పదవి ఇచ్చే పరిస్థితి లేకుంటే నామా నాగేశ్వర్‌రావుకే ఈ పదవి ఇస్తారని తెలుస్తోంది. కొత్త ప్రభాకర్‌రెడ్డి పేరును కూడా పరిశీలిస్తున్నారు. టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేతగా రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు వ్యవహరిస్తున్నారు. లోక్‌సభ సభ్యులలో కొత్తగా ఎన్నికైన వారే ఎక్కువగా ఉండటంతో ఈ పదవిలో ఎలాంటి మార్పులు ఉండే అవకాశం లేదు. -
ఇక తెరపై సచిన్
నటనకు ఎవరూ అనర్హులు కాజాలరు. క్రీడారంగంలోని వారికి నటనపై ఆసక్తి కలగడం విశేషమేమీకాదు. క్రికెట్ క్రీడకే గౌరవాన్ని ఆపాదించిన సచిన్ టెండూల్కర్ జీవిత చరిత్ర వెండి తెరకెక్కడానికి సిద్ధమవుతుందని సమాచారం. కవితకు కాదేదీ అనర్హం అన్నట్లు నటనకు ఎవరూ అనర్హులు కాజాలరు. కాకపోతే అవకాశాలకు కాస్త అదృష్టం కావాలి. ఇక సెలబ్రిటీలకైతే అదృష్టం వద్దన్నా వరిస్తుంది. ఇతర రంగాల్లో పేరుగాంచిన వారు ఆ తరువాత దృష్టి సారిస్తోంది సినిమా రంగమే అని చెప్పడానికి సాహసం అక్కర్లేదనుకుంటా. ఇక క్రీడారంగంలోని వారికి నటనపై ఆసక్తి కలగటం విశేషమేమీ కాదు.ఇప్పటికే క్రికెట్ క్రీడా రంగంలో సంచలనం సృష్టించిన శ్రీశాంత్ తన దృష్టిని సినిమాలపైకి మళ్లించారు. త్వరలో తమిళం,తెలుగు భాషల్లో తెరకెక్కనున్న చిత్రంలో కథానాయకుడిగా నటించడానికి సిద్ధమవుతున్నారు. అందుకోసం ఆయన తగు శిక్షణ తీసుకుంటున్నారు కూడా. భారత క్రికెట్ జట్టు కెప్టెన్‌గా విశేష సేవలందించిన ధోని జీవిత ఇతి వృత్తం తెరకెక్కనుంది. తాజాగా క్రికెట్ గ్రౌండ్లో చిచ్చర పిడుగులా చెలరేగి బంతిని తన ఇష్టం వచ్చినట్లు ఆటాడుకుని ఈ క్రీడకే గౌరవాన్ని ఆపాదించిన సచిన్ టెండూల్కర్ జీవిత చరిత్ర వెండి తెరకెక్కడానికి సిద్ధమవుతుందని సమాచారం.ఇందులో సచిన్ పాత్రలో ఆయనే నటించనుండడం మరో విశేషం. సచిన్ బాల్యం నుంచి క్రికెట్ క్రీడా రంగంలో ఆయన సాధన ఇతి వృత్తంగా ఈ చిత్రం ఉంటుందట. దీన్ని జేమ్స్ ఏర్స్కిన్ అనే దర్శకుడు హ్యాండిల్ చేయనున్నారు. హిందీలో ఒక ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ తెరకెక్కించనున్న ఈ చిత్రం ఆనక అన్ని భాషల్లోనూ అనువాదం అయ్యో అవకాశం ఉంటుందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ఈ క్రేజీ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడనున్నట్లు తెలిసింది. పిచ్‌లో సిక్సర్లు కొట్టిన సచిన్ ఇక చిత్రాల్లో ఎలాంటి హిట్లు కొడతారో వేచి చూడాల్సిందే.