బాధితులకు రూ.10 లక్షలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలి
ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు రమణయ్య
అమలాపురం టౌన్:
సూదాపాలెం బాధిత కుటుంబాలకు ప్రభుత్వం రూ.పది లక్షలు వంతున ఎక్స్గ్రేషియా ఇవ్వాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు జెన్నీ రమణయ్య , రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం.ఎస్.రాము డిమాండు చేశారు. దాడిలో గాయ పడి అమలాపురం ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను వారు సోమవారం పరామర్శించారు. ఈ సందర్భంగా వార మాట్లాడుతూ బాధిత కుటుంబాల్లో ఒక్కక్కరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని.. సూదాపాలెం ఘటన విచారణకు అమలాపురంలో ప్రత్యేక న్యాయస్థానం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లాకు వచ్చి కూడా బాధితులను పరామర్శించేందుకు రాకపోవటం ఆయన అహంకారానికి నిదర్శమని గుర్తు చేశారు. దండోరా నాయకుడు, వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి బొమ్మి ఇజ్రాయిల్ వారికి సూదాపాలెం ఘటన గురించి వివరించారు. జిల్లా ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు బుంగ సంజయ్, ఎమ్మార్పీఎస్ నాయకులు మల్లవరపు వెంకట్రావు, మడికి శ్రీరాములు, పిప్పర సంపదరావు తదితరులు పాల్గొన్నారు.