Rs.2 lakhs
-
రూ.2 లక్షల నగదు లావాదేవీయా.. జాగ్రత్త!
♦ అంతే మొత్తం పెనాల్టీ కట్టాలి ♦ ఆదాయపన్ను శాఖ హెచ్చరిక న్యూఢిల్లీ: భారీ నగదు లావాదేవీలు జరిపేవారిని ఆదాయపన్ను శాఖ హెచ్చరించింది. రూ.2 లక్షలు అంతకుమించి నగదు స్వీకరించే వారి నుంచి అంతే మొత్తం జరిమానాగా వసూలు చేస్తామని స్పష్టం చేసింది. అంతేకాదు, ఈ విధమైన భారీ నగదు లావాదేవీల సమాచారం తెలిస్తే blackmoneyinfo@ incometax. gov. in తమకు తెలియజేయాలని ప్రజలను కోరింది. 2017–18 కేంద్ర బడ్జెట్లో రూ.3 లక్షలు అంతకుమించి నగదు లావాదేవీల నిర్వహణను నిషేధించే ప్రతిపాదనను ప్రవేశపెట్టగా, ఆ తర్వాత దాన్ని రూ.2 లక్షలు అంతకుమించిన లావాదేవీలకు తగ్గించి ఆర్థిక బిల్లులో సవరణ చేర్చారు. దీనికి లోక్‌సభ ఆమోదం తెలియజేసింది. ఇందుకు అనుగుణంగా ఆదాయపన్ను చట్టంలో సెక్షన్ 269ఎస్‌టిని చేర్చారు. దీని కింద ఒకే రోజులో రూ.2 లక్షలు లేదా అంతకుమించిన నగదు లావాదేవీలు నిషేధం. ఒక అంశానికి సంబంధించి ఒక్క లావాదేవీ లేదా ఒకటికి మించిన లావాదేవీల మొత్తం రూ.2 లక్షలు నగదు రూపంలో చెల్లించడం, తీసుకోవడం చట్ట విరుద్ధం. బ్యాంకులు, పోస్టాఫీసులు, కోపరేటివ్ బ్యాంకులు, ఆదాయపన్ను శాఖలు స్వీకరించే మొత్తాలకు ఈ నిబంధన నుంచి మినహాయింపు ఉంది. -
సముద్రంలో బోటుబోల్తా
నడిసంద్రంలో ప్రమాదం ప్రాణాలతో బయటపడిన ఐదుగురు మత్స్యకారులు ధ్వంసమైన బోటు కొట్టుకుపోయిన వలలు రూ.2 లక్షల మేర నష్టం కావలిరూరల్: సముద్రంలో చేపల వేట సాగించేందుకు వెళ్లిన బోటు బోల్తాపడింది. నడిసంద్రంలో ఈ ప్రమాదం చోటు చేసుకోవడంతో అందులోని ఐదుగురు మత్స్యకారులు ప్రాణాలతో బయటపడ్డారు. ఈ సంఘటన మండలంలోని తుమ్మలపెంట పంచాయతీ చిన్నరాముడుపాళెంలో శుక్రవారం తెల్లవారుజామున జరిగింది. బాధితుల కథనం మేరకు.. మండలంలోని చిన్నరాముడుపాళెంకుS చెందిన కోడూరు శ్రీనివాసులు, కోడూరు బాబు, కోడూరు వెంకటరమణ, మామిళ్ల శ్రీనివాసులు, కోడూరు ప్రసాద్ ఫైబర్ బోటులో చేపల వేటకోసం సముద్రంలోకి వెళ్లారు. శుక్రవారం తెల్లవారు జామున 3 గంటల సమయంలో అలల తాకిడికి సముద్రంలో బోటు బోల్తా పడింది. దీంతో బోటు ధ్వంసం కాగా, వలలు అలలకు కొట్టుకుని పోయాయి. బోటులో ఉన్న ఐదుగురు మత్స్యకారులు ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారు. సుమారు రూ. 2 లక్షల మేర నష్టం వాటిల్లినట్లు బాధితులు తెలిపారు. సహాయం కోసం కలెక్టరుకు విజ్ఞప్తి బోటు ప్రమాదంలో సురక్షితంగా బయటపడిన మత్యకారులు శుక్రవారం కలెక్టరు ముత్యాలరాజును కలిసి ప్రమాద వివరాలను తెలియజేశారు. తాము నిరుపేదలమని, వేటే తమ జీవనాధారమని తలా కొంత అప్పులు చేసి బోటును ఏర్పాటు చేసుకొని వేటకు వెళ్లి జీవిస్తున్నామన్నారు. రూ.2 లక్షల మేర నష్టం వాటిల్లిందని ప్రభుత్వం తరపున సహాయం చేసి తమను ఆదుకోవాలి కలెక్టరుకు విజ్ఞప్తి చేశారు. అనంతరం మత్యశాఖ జేడీ, ఏడీ, ఇన్స్పెక్టర్ దృష్టికి తీసుకెళ్లి ఆర్థిక సాయం కోరారు. ఎమ్మెల్యే రామిరెడ్డి పరామర్శ : బోటు ప్రమాదం జరిగిందని తెలియగానే కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి బాధిత మత్యకారులను ఫోన్లో పరామర్శించారు. ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు. సురక్షితంగా బయటపడినందుకు సంతోషం వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులతో మాట్లాడి ప్రభుత్వం తరపున సహాయం అందేలా కృషి చేస్తానని వారికి హామీ ఇచ్చారు. -
ఒక ఓటు.. రూ.2 లక్షలు
నేతల అవినీతిపై సెటైర్ వాట్సాప్‌లో హల్చల్ చైతన్య పరుస్తున్న మెసేజ్‌లు ప్రలోభాలకు లొంగొద్దు చెన్నై: ఒక ఓటుకు రూ.500, రూ.5వేలు అని వెలకట్టే ఓ నేతలారా ఈ ఓటు అసలైన విలువ ఎంతో తెలుసా...రూ.2లక్షలు. వినేందుకు ఇది ఆశ్చర్యంగా ఉన్నా నూరుశాతం నిజం అంటోంది ఒక వాట్సాప్ సందేశం. ప్రజల ఓటుతో అధికారం చేపట్టే నేతల అక్రమార్జన, అందులో ఓటరు వాటా ఎంత అని లెక్కకడుతూ ఓ తమిళపౌరుడు వాట్సాప్, ఈ మెయిల్ ద్వారా చైతన్య ప్రచారం ప్రారంభించాడు.అందులోని వివరాలు ఇలా ఉన్నాయి. తమిళ నాడు జనాభా సుమారు 7.5 కోట్లు. ఇందులో 1.75 కోట్ల పిల్లలు. మిగతా 5.75 కోట్ల మంది ఓటర్లు. వీరిలో 30 శాతం మంది అంటే కోటి మంది మద్యం తాగేవారున్నారు. ఒక క్వార్టర్ బాటిల్ అమ్మితే రూ.50 లాభం. కోటి బాటిళ్లు అమ్మితే రూ.55 కోట్ల లాభం. అంటే ఏడాదికి రూ.20,075 కోట్లు, ఐదేళ్లకు రూ.లక్ష కోట్లు. ఈ సొమ్ము నీ జేబు నుంచి చోరీ చేయబడుతున్నదే. ఇక ఇసుక ఏడాదికి రూ.25 వేల కోట్లు, ఐదేళ్లకు రూ.1.25లక్షల కోట్లు. అలాగే గ్రానైట్, క్వారీల ద్వారా ఏడాదికి రూ.25 వేల కోట్లు, ఐదేళ్లకు మరో రూ.1.25 లక్షల కోట్లు. ఈ సొమ్ము కూడా నీ జన్మభూమి నుంచి కొల్లగొడుతున్నదే. విద్యుత్ చోరీ: రోజుకు 4వేల మెగావాట్ల విద్యుత్ కొనుగోలులో యూనిట్‌కు 22 పైసలు కమీషన్ పొందుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. మొత్తం మెగావాట్లు లెక్క కడితే నెలకు రూ.66 కోట్లు, ఏడాదికి రూ.24వేల కోట్లు, ఐదేళ్లకు రూ.1.2 లక్షల కోట్లు కమీషన్‌గా స్వాహా చేస్తున్నారు. ఈ డబ్బంతా ప్రజల నుంచే కదా. కొల్లగొడుతున్న ప్రజా పనుల శాఖ: ప్రభుత్వ నిర్మాణ పనుల పేరున ప్రభుత్వ ఖజానాకు పరోక్షంగా రూ.5లక్షల కోట్ల నష్టం వాటిల్లుతోంది. రవాణా, ఉద్యోగ నియామకాలతో లక్ష కోట్లు, ఉచితాల పంపిణీ ముసుగులో రూ. రూ.2లక్షల కోట్లు లెక్కన ఖజానాకు మొత్తం రూ.10లక్షల కోట్ల గండిపడుతోంది. మొత్తం పది విభాగాల్లో రూ.15 లక్షల కోట్లు పరోక్షంగా దోచేసుకుంటున్నారు. ఈ మోసాలు, కుంభకోణాలు లెక్క కడితే రాష్ట్రంలోని 5.75 కోట్ల ఓటర్లకు సరాసరిగా రూ.2లక్షలు చెల్లించవచ్చని వాట్సాప్ సందేశం. ప్రజల నుంచి దోచుకున్న సొమ్ము నుంచే ఓటుకు రూ.500, రూ.1000గా చెల్లిస్తున్నారు. ప్రభుత్వాల్లో జరుగుతున్న దోపిడీపై ఓటర్లలో ఒక చైతన్యం కలిగించేందుకు మాత్రమే ఈ వివరాలు చెబుతున్నామేగానీ ఓటుకు రూ.2లక్షలు డిమాండ్ చేయమని కాదని వివరణ ఇచ్చుకున్నారు. ప్రలోభాలకు లొంగకుండా ఓటేయండి, తప్పుచేసిన ప్రభుత్వాలను నిర్భయంగా నిలదీయండి అంటూ అతను ముక్తాయింపు ఇచ్చాడు. -
మృతుల కుటుంబాలకు రూ.2లక్షల ఎక్స్‌గ్రేషియా
గండేపల్లి: తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి వద్ద జరిగిన ఘోర ప్రమాదంలో మృతి చెందిన కూలీల కుటుంబాలను అన్ని రకాలుగా ఆదుకుంటామని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు ప్రకటించారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే ఆయన సోమవారం ఉదయం హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్నారు. ఘటన జరిగిన తీరుపై ఆరా తీసిన యనమల సహాయక చర్యలను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా యనమల మాట్లాడుతూ.. ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు రూ.2 లక్షల పరిహారం ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో మాట్లాడి ఆ కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటామని తెలిపారు. పరిహారాన్ని పెంచే విషయాన్ని కూడా పరిశీలిస్తామని ఆయన పేర్కొన్నారు. బాధిత కుటుంబాల్లో విద్యావంతులుంటే ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని యనమల తెలిపారు. క్షతగాత్రులకు పూర్తి స్థాయిలో వైద్య చికిత్సలను ఉచితంగానే అందజేస్తామని వెల్లడించారు. కాగా రోడ్డు ప్రమాదంలో 19మంది దుర్మరణం చెందగా, పలువురు గాయపడిన విషయం తెలిసిందే. -
హోటల్‌కు నిప్పంటించిన దుండగులు
కంబదూరు (అనంతపురం): ఓ హోటల్‌కు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు అంటించారు. ఈ ఘటన అనంతపురం జిల్లా కంబదూరు మండలంలో సోమవారం ఉదయం చోటు చేసుకుంది. వివరాలు.. మండలంలోని మూలకనూరు గ్రామంలోని ఓ హోట్‌ల్‌కు సోమవారం తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు అంటించారు. దీంతో హోటల్ మొత్తం కాలిబూడిద అయింది. దాదాపు రూ. 2లక్షల ఆస్తి నష్టం జరిగిందని హోటల్ యాజమాని తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
అంతకంతకూ పెరుగుతున్న మృతుల సంఖ్య
-
అంతకంతకూ పెరుగుతున్న మృతుల సంఖ్య
హైదరాబాద్: నేపాల్‌లో సంభవించిన భూకంపంలో మృతి చెందిన వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. తాజా నివేదికల ప్రకారం రెండు వేలకు పైగా మృతదేహాలు లభ్యమైనట్టు సమాచారం. ఒక్క ఖాట్మండులోనే వెయ్యి మందికి పైగా మృతి చెందినట్టు సమాచారం. వేలమంది ప్రజలు గడ్డకట్టిన చలిలోనే వణికిపోతూ.. రోడ్లపైనే జాగారం చేశారు. భూకంపం ధాటికి ఎవరెస్టు శిఖరంపై దాదాపు 18 మంది మరణించారు. ఈ తీవ్ర ధాటికి భారత్‌లోనే 53 మంది మృతి చెందగా.. 240 మంది గాయపడ్డారు. మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.2 లక్షలు చొప్పున ఆర్థిక సహాయాన్ని కేంద్రప్రభుత్వం ప్రకటించింది. -
'గుణపాఠం నేర్చుకున్నాం'
హైదరాబాద్: గల్లంతైన విద్యార్ధుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రెండు లక్షల రూపాయల బీమా పరిహారం మూడు నెలల్లో తల్లిదండ్రులకు అందిస్తామని విఎన్ఆర్ విజ్ఞాన్‌జ్యోతి కాలేజీ సెక్రటరి డిఎన్ రావు చెప్పారు. విద్యార్ధులు చెల్లించిన ఫీజును తిరిగి ఇస్తామన్నారు. హిమాచల్‌ప్రదేశ్‌లోని బియాస్ నదిలో ఈ కాలేజీకి చెందిన 24 మంది విద్యార్థులు గల్లంతైన విషయం తెలిసిందే. ఈ ఘటన నుంచి తాము గుణపాఠం నేర్చుకున్నట్లు తెలిపారు. టూర్లో ఉన్న మరో 600 మంది విద్యార్థులను వెనక్కి రప్పించినట్లు రావు చెప్పారు. ఇదిలా ఉండగా, బియాస్ నదిలో అత్యాధునిక పరికరాలతో వెతికినా మృతదేహాలు ఇంకా దొరకలేదు. మొత్తం 24మంది గల్లంతు కాగా, కేవలం ఎనిమిది మృతదేహాలు మాత్రమే దొరికాయి. మిగతావారి జాడ తెలియలేదు. గల్లంతైన వారిలో 16 మంది విద్యార్థుల జాడ తెలియక పోవడంతో చివరి చూపుకూడా దక్కలేదని వారి తల్లిదండ్రుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లార్జీ డ్యాంకు దిగున 7 కిలోమీటర్ల వరకూ గాలింపు పూర్తయింది. మరో 9 కిలోమీటర్లమేర గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. కన్న బిడ్డల కడచూపు కోసం తల్లిదండ్రులు ఎదురుచూస్తున్నారు.