Rs.50 crore
-
అటకెక్కిన ‘అమృత్’
- ‘అనంత’లో మొదలుకాని రూ.50 కోట్ల పనులు - అభివృద్ధిపై పాలకుల్లో కొరవడిన చిత్తశుద్ధి - గ్రూపు రాజకీయాలతో ప్రజా శ్రేయస్సు గాలికి.. అనంతపురంలోని 32వ డివిజన్లో ఉన్న బుద్ధవిహార్ పార్కు ఇది. దీన్ని అమృత్ పథకం కింద రూ.50 లక్షలతో అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ఈ పనులకు ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి, మేయర్ స్వరూప 2016 జూన్ 25న శంకుస్థాపన చేశారు. ఇంతవరకు ఇవి అంగుళం కూడా ముందుకు కదలేదు. పైగా 32వ డివిజన్‌ను మేయర్ దత్తత తీసుకున్నారు. అయినప్పటికీ పనులపై శ్రద్ధ చూపకపోవడం గమనార్హం. అనంతపురం న్యూసిటీ : ‘అన్నీ ఉన్నా అల్లుని నోట్లో శని’ అన్న చందంగా తయారైంది అనంతపురం నగర పాలక సంస్థ పరిస్థితి. కేంద్ర ప్రభుత్వం 2015-16లో ‘అనంత’ను ‘అమృత్’ పథకం కింద ఎంపిక చేసినా.. ఆ స్థాయిలో అభివృద్ధి మాత్రం జరగడం లేదు. పాలకుల వర్గ విభేదాల నేపథ్యంలో ప్రగతి పడకేసింది. ‘అమృత్ సిటీ’గా అనంతను అభివృద్ధి చేయడానికి నగరపాలక సంస్థకు రూ.50 కోట్ల నిధులను కేంద్రం మంజూరు చేసింది. వీటిని వరద నీటి కాలువలు, మురుగునీటి శుద్ధి ప్లాంట్, నీటి సరఫరా, పార్కుల అభివృద్ధికి వినియోగించుకోవాలి. ఈ పనులకు సంబంధించి కార్పొరేషన్ అధికారులు డీటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్) తయారు చేశారు. పరిపాలనా పరమైన అనుమతి కూడా మంజూరైంది. అయినా పనులు ముందుకు సాగడం లేదు. దీంతో ప్రభుత్వం ఇటీవల వీటి నిర్వహణ బాధ్యతను పబ్లిక్ హెల్త్‌కు అప్పగిస్తూ జీఓ విడుదల చేసింది. పట్టించుకోని పాలకవర్గం అమృత్ పథకం కింద నిధులు మంజూరైనప్పుడు పాలకవర్గం గొప్పలు చెప్పుకుంది. ఆ తర్వాత నిధుల వ్యయం గురించి పెద్దగా పట్టించుకోలేదు. ఈ నిధుల్లో రూ.50 లక్షలతో బుద్ధవిహార్ పార్క్ అభివృద్ధి, రూ.18 కోట్లతో వరద నీటి కాలువల నిర్మాణం, రూ.17 కోట్లతో మురుగునీటి శుద్ధి ప్లాంట్, రూ.10 కోట్లతో సమ్మర్ స్టోరేజీ ట్యాంకు మరమ్మతు, రూ.50 లక్షలతో రాజీవ్ చిల్డ్రన్స్ పార్క్ పునరుద్ధరణ పనులు చేపట్టాలని నిర్ణయించారు. వీటికి పరిపాలనా అనుమతి మంజూరైనా.. సాంకేతిక (టెక్నికల్) అనుమతి మాత్రం రాలేదు. పాలకవర్గంలోని గ్రూపు రాజకీయాలే ఇందుకు కారణం. ఎమ్మెల్యే, మేయర్ వర్గీయులు తరచూ వివాదాలను లేవనెత్తుతున్నారు. వారు ఏనాడూ ‘అమృత్’ పరిస్థితేంటని ఆలోచించిన దాఖలాలు లేవు. ఇంతకుముందు నగర పాలక సంస్థకు రెగ్యులర్ కమిషనర్ లేకపోవడం, ‘అమృత్’ పనులకు సంబంధించి ప్రత్యేకంగా డీఈ, ఏఈ లేకపోవడం కూడా పనులు సాగకపోవడానికి కారణాలు. ప్రస్తుతం ఏపీఎఫ్ఐయూడీసీ నుంచి నియమితులైన సిటీ ప్లానర్ హిమబిందు, ఎక్స్పర్ట్ రోజారెడ్డి, కన్సల్టెంట్ ఆయూబ్ పర్యవేక్షిస్తున్నారు. ప్రయోజనాలెన్నో... ‘అమృత్’ పనులు పూర్తయితే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని అధికారులు చెబుతున్నారు. వరద నీటి కాలువలు ఏర్పాటైతే ఏళ్ల తరబడి వెంటాడుతున్న మరువ వంక సమస్య తీరుతుంది. అశోక్‌నగర్ బ్రిడ్జి నుంచి ఐరన్ బ్రిడ్జి మీదుగా సూర్యనగర్ సర్కిల్, త్రివేణి టాకీస్, ఎర్రనేల కొట్టాలు, తడకలేరు వరకు డ్రెయినేజీ ఏర్పాటు చేస్తారు. దీనివల్ల మరువ వంకకు భవిష్యత్తులో వరద వచ్చినా ఎటువంటి ప్రమాదమూ ఉండదు. అలాగే శిల్పారామంలో మురుగునీటి శుద్ధి ప్లాంట్ ఏర్పాటు చేయనున్నారు. నడిమివంక, మరువ వంక ద్వారా వచ్చే మురుగు నీటిని ఇందులో శుద్ధి చేసి మొక్కల పెంపకానికి వినియోగించడంతో పాటు తడకలేరు వద్ద ఉన్న డ్యాంలోకి పంపుతారు. దీంతో పాటుగా నీటి సరఫరాకు సంబంధించి సమ్మర్ స్టోరేజీ ట్యాంకు పునరుద్ధరణ పనులు చేపట్టాల్సి ఉంది. స్టోరేజీ ట్యాంకులో బండ్‌కు పగుళ్లు ఏర్పడుతున్నాయి. ట్రీట్మెంట్ ప్లాంట్ కూడా సరిగా లేదు. దాని స్థానంలో మరొకటి ఏర్పాటు చేస్తే ప్రజలకు శుద్ధి జలాన్ని అందించవచ్చు. -
కొనుగోళ్లు సరే.. చెల్లింపులేవి..!
► జిల్లాలోని కంది రైతులకు రూ.50 కోట్ల వరకు బకాయిలు ► 20 రోజులుగా రైతు ఖాతాలకు జమకాని వైనం ► ఎదురు చూస్తున్న రైతులు ఒంగోలు టూటౌన్: జిల్లాలో కంది రైతులకు చెల్లించాల్సిన బకాయిలు సుమారు రూ.50 కోట్ల వరకు నిలిచిపోయాయి. వేలం కేంద్రాలు ముగిసి కూడా దాదాపు 20 రోజులపైనే అవుతోంది. అయినా ఇంత వరకు రైతుల ఖాతాలకు బకాయిలు జమకాలేదు. దీంతో పంటసాగు సమయంలో చేసిన అప్పులు తీర్చుకునేందుకు నానా కష్టాలు పడుతున్నారు. 2016–17 ఆర్థిక సంవత్సరంలో ఖరీఫ్‌లో 92,838 హెక్టార్లలో కంది పంట సాగైంది. వర్షాభావ పరిస్థితుల వల్ల పంట దిగుబడి తగ్గింది. ప్రస్తుతం రెండు నుంచి మూడు క్వింటాళ్లే చాలా చోట్ల దిగుబడి వచ్చింది. వాస్తవంగా అయితే ఎకరాకు 5 నుంచి 6 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చేది. అయినా సాగు చేసిన పంటకు 43, 181 మెట్రిక్ టన్నులు దిగుబడి వస్తుందని అప్పట్లో అధికారులు అంచనా వేశారు. రైతులు ఎకరాకు రూ.10 వేల నుంచి రూ.12 వేల వరకు ఖర్చుపెట్టి మరీ పంట పండించారు. దీనికి వర్షాభావ పరిస్థితుల్లో పంటను కాపాడుకునేందుకు నానా కష్టాలు పడాల్సి వచ్చింది. చివరి నీటి తడుల కోసం అదనంగా మరో రూ.10 వేల వరకు ఖర్చు పెట్టి పంటను దక్కించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. గత ఏడాది క్వింటా రూ.9 వేల వరకు పలికింది. దీంతో రైతులు కొంత ఊరట చెందారు. ఈ సారి పంట చేతికొచ్చిన తరువాత మార్కెట్ ధర క్వింటా రూ.4 వేలకు పడిపోవడం.. రైతులు ఆందోళన చెందడం మొదలు పెట్టారు. రైతుల ఆందోళనకు దిగొచ్చిన ప్రభుత్వం మద్దతు ధరకు కందులు కొనుగోలు చేయాలని మార్క్‌ఫెడ్‌ను ఆదేశించింది. జిల్లాలో ఫిబ్రవరి 4న వేలం కేంద్రాలను ప్రారంభించారు. ప్రభుత్వం మార్క్‌ఫెడ్ ద్వారా జిల్లాలో తొలిదశలో రాజంపల్లి, దర్శి, మారెళ్ళ, మార్టూరు, సజ్జపురం, వెల్లలచెరువు గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను మార్క్‌ఫెడ్ ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు, ఐకేపీ మహిళా సంఘాలు, డీసీఎంఎస్‌ల సహకారంతో ఏర్పాటు చేశారు. ఆ తరువాత మరో 19 కేంద్రాలలో ఏర్పాటు చేశారు. క్వింటాకు రూ.5,050 మద్దతు ధరతో రైతుల నుంచి కొత్త కందులను కొనుగోలు చేశారు. మొత్తం 10,172 మంది రైతుల నుంచి కందులు కొనుగోలు చేశారు. మొత్తం 3,32,207 క్వింటాళ్ల వరకు కొనుగోలు చేశారు. వీరికి ప్రభుత్వం మద్దతు ధర ప్రకారం రైతులందరికీ రూ.167 కోట్లు రావాల్సి ఉంది. గత నెల 12వ తేదీతో కందుల కొనుగోలును మార్క్‌ఫెడ్ నిలిపివేసింది. అప్పటి వరకు దశల వారీగా రైతులకు రూ.104 కోట్ల వరకు రైతుల ఖాతాలకు ఆన్లైన్ ద్వారా జమ చేశారు. ఇంకా సుమారుగా రూ.50 కోట్ల వరకు రైతులకు జమచేయాల్సి ఉంది. వేలం కేంద్రాలను నిలిపేసి 20 రోజులకు పైగా అవుతోంది. ఇప్పటి వరకు రైతులకు చెల్లించాల్సిన బకాయిలు వారి ఖాతాలకు ప్రభుత్వం జమచేయాల్సిన పరిస్థితి నెలకొంది. పంట సాగు సమయంలో.. పంట కోత, నూర్పిళ్ల కూలీలకు డబ్బులు చెల్లించలేని స్థితిలో రైతులున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి కంది రైతులకు చెల్లించాల్సిన బకాయిలను ఇవ్వాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.రైతులకు చెల్లించాల్సిన బకాయిల గురించి మార్క్‌ఫెడ్ డీఎం దృష్టికి ‘సాక్షి’ తీసుకురాగా మొత్తం రూ.167 కోట్లకు గాను రూ.104 కోట్లు చెల్లించినట్లు చెప్పారు. మిగిలిన బకాయిలను రైతుల ఖాతాలకు జమచేసేందుకు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకుంటామని జిల్లా మేనేజర్ లక్ష్మీ తాయరమ్మ తెలిపారు. -
50 కోట్లు దాటిన 'శ్రీమంతుడు'
చెన్నై: సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన తెలుగు బ్లాక్ బస్టర్ మూవీ శ్రీమంతుడు రూ.50 కోట్లు దాటింది. ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం వారం ప్రారంభంలోనే రూ.50 కోట్లు వసూళ్లను రాబట్టడంతో తెలుగు చిత్ర సీమకు మరింత ఉత్సాహాన్నిచ్చినట్లయింది. కాగా, ఈ చిత్రం విడుదలైన రోజే రూ.31కోట్లు సాధించిందని చిత్ర వర్గాలు తెలిపాయి. మరోపక్క, అమెరికాలో కూడా విడుదలైన ఈ చిత్రం సోమవారం రెండు మిలియన్ డాలర్లను దాటనుందట. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శృతిహాసన్, జగపతిబాబు, రాజేంద్రప్రసాద్ వంటి ప్రముఖ నటులు ఉన్నారు. కోటీశ్వరుడైన ఓ యువకుడు ఊరిని దత్తత తీసుకునే కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కిన విషయం తెలిసిందే.