Rs.50 thousands
-
కారు అద్దాలు పగలగొట్టి రూ.50 వేల చోరీ
బద్వేల్ : వైఎస్సార్ జిల్లా బద్వేల్ పట్టణంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వద్ద చోరీ జరిగింది. కారు అద్దాలు పగలగొట్టి రూ.50 వేల నగదు ఎత్తుకెళ్లాడో ఆగంతకుడు. మైదుకూరు రోడ్డులోని మధువైన్స్ యజమాని కొర్రపాటి సురేంద్ర ఎస్బీఐలో జమ చేసేందుకురూ.3 లక్షలు తెచ్చాడు. కారులో ఉంచి పక్కనే ఉన్న ఓ హోటల్లో కూర్చుని స్నేహితునితో మాట్లాడుతున్నాడు. విషయం గమనించిన ఆగంతకుడు కారు అద్దాలు పగలగొట్టి డబ్బులు చోరీ చేశాడు. కొంద డబ్బు సీటు కిందపడిపోవటంతో అవి అందలేదు. బాధితుని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అన్నదాన పథకానికి రూ.50 వేలు విరాళం
శ్రీశైలం : శ్రీభ్రమరాంబామల్లికార్జునస్వామివార్ల ఆలయప్రాంగణంలో భక్తుల సౌకర్యార్థం దేవస్థానం నిర్వహిస్తున్న అన్నదాన పథకానికి శ్రీశైలానికి చెందిన వి.కాశమ్మ అనే భక్తురాలు రూ. 50 వేలను విరాళంగా అందజేశారు. శుక్రవారం శ్రీస్వామిఅమ్మవార్లను దర్శించుకున్న అనంతరం ఆమె దేవాదాయసహాయ కమీషనర్ మహేశ్వరరెడ్డికి అందజేశారు. అనంతరం ఆమెకు స్వామిఅమ్మవార్ల శేషవస్త్రాలు, లడ్డూప్రసాదాలు, అన్నదాన బాండ్‌ను అందించారు.