శ్రీశైలం : శ్రీభ్రమరాంబామల్లికార్జునస్వామివార్ల ఆలయప్రాంగణంలో భక్తుల సౌకర్యార్థం దేవస్థానం నిర్వహిస్తున్న అన్నదాన పథకానికి శ్రీశైలానికి చెందిన వి.కాశమ్మ అనే భక్తురాలు రూ. 50 వేలను విరాళంగా అందజేశారు. శుక్రవారం శ్రీస్వామిఅమ్మవార్లను దర్శించుకున్న అనంతరం ఆమె దేవాదాయసహాయ కమీషనర్ మహేశ్వరరెడ్డికి అందజేశారు. అనంతరం ఆమెకు స్వామిఅమ్మవార్ల శేషవస్త్రాలు, లడ్డూప్రసాదాలు, అన్నదాన బాండ్‌ను అందించారు.