దూసుకెళుతున్న రూపాయి
ముంబై: దేశీయ కరెన్సీ రూపాయికి మరింత మద్దతు లభిస్తోంది. రికార్డ్ స్థాయిని లాభాలతో దూసుకెడుతోంది. ఇటీవల 17 నెలల గరిష్టాన్ని నమోదు చేసిన రుపీ తన జోరును కొనసాగిస్తోంది. తాజాగా ఇంటర్‌బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో సాంకేతికంగా కీలకమైన రూ.65 వద్ద బలంగా ఉంది. 2015 అక్టోబర్ 28 తరువాత రుపీ మళ్లీ స్థాయిని తాకింది. మంగళవారం గుడిపడ్వా సందర్భంగా మనీ మార్కెట్లకు సెలవు తర్వాత బుధవారం ట్రేడింగ్ ప్రారంభంలోనే 9 పైసలు(0.14 శాతం) బలపడి రూ.64.94ని నమోదు చేసింది. అయితే, కొన్ని విదేశీ కరెన్సీలకు వ్యతిరేకంగా డాలర్ రికవరీ విదేశీ రూపాయి జోరును పరిమితం చేయనుందని విశ్లేషకులు భావిస్తున్నారు. అటు దేశీయ స్టాక్‌మార్కెట్లు కూడా లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి.
వరుసగా అయిదవరోజు కూడా బ్యాంకింగ్ సెక్టార్ లాభాలను గడిస్తోంది. గత కొంతకాలంగా దేశీ స్టాక్స్‌లో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) భారీ స్థాయిలో ఇన్వెస్ట్ చేస్తుండటం, బ్యాంకులు, ఎగుమతి సంస్థలు డాలర్లను విక్రయిస్తుండటం వంటి అంశాలు రూపాయికి బలాన్నిస్తున్నట్లు ఫారెక్స్ వర్గాలు పేర్కొన్నాయి.