తాత్కాలిక సిబ్బందిపై ఆర్టీసీ కార్మికుల దాడి
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా హయత్నగర్లో తాత్కాలిక సిబ్బందిపై సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులు దాడి చేశారు. ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. ఆర్టీసీ కార్మికులు సమ్మె చేయడంతో అధికారులు తాత్కాలిక సిబ్బందిని తీసుకున్నారు. తాము సమ్మెలో పాల్గొంటే, పనిచేయడానికి వస్తారా? అని ఆర్టీసి కార్మికులు వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిపై దాడి చేశారు.
తమ డిమాండ్లు పరిష్కరించకుండా తాత్కాలిక కార్మికులను తీసుకుంటారా? అని అధికారులపై మండిపడ్డారు. దాడి విషయాన్ని బాధితులు అధికారులకు తెలిపారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు.