మహిళా పారిశ్రామికవేత్తకు అభినందన
ఏయూ క్యాంపస్ : ఉత్తమ మహిళా వ్యాపార వేత్తగా నగరానికి చెందిన నీతిపూడి స్వర్ణలత ఎంపికయ్యారు. ఈ మేరకు కష్ణాపుష్కరాల్లో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఐటీ శాఖ మంత్రి పల్లె రఘునాథ రెడ్డిల నుంచి ఇటీవల పురస్కారం అందుకున్నారు. స్వర్ణలత ఏయూలో న్యాయవిద్యను పూర్తిచేసిన స్వర్ణలత భర్త పోత్సాహంతో గంభీరం గ్రామీణ ప్రాంతంలో పాత టైర్ల నుంచి రబ్బరు పౌడరు తయారుచేసి తారు పరిశ్రమలకు సరఫరా చేసే వ్యాపారం చేస్తున్నారు. వ్యాపారం రంగంలో ప్రతిభ చూపినందున ఉత్తమ దళిత మహిళా వ్యాపార వేత్తగా ప్రభుత్వం గుర్తించిందని ఒక ప్రకటనలో స్వర్ణలత పేర్కొన్నారు. హెచ్పీసీఎల్ సహకార సంస్థ ఇకోల్మ్యానుఫేక్చర్ మిథిమిన్(తారు)లో 20 శాతం రబ్బరు పౌడరును కలిపి తారును తయారు చేస్తున్నట్లు పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా రోడ్డు విస్తరణలో తారుకు మార్కెట్లో మంచి గిరాకీ ఉందని, పాడైన టైర్ల నుంచి పౌడరు ఉత్పత్తిచేసి పునర్వినియోగించడం వల్ల పర్యావరణానికి కొంత మేలు జరుగుతోందని ఆమె తెలిపారు.