ruckus in parliament
-
ఉభయసభల్లోను 'వైదిక్' రచ్చ
యోగా గురువు రాందేవ్ బాబా అనుచరుడు వేద్ ప్రతాప్ వైదిక్ వెళ్లి జమాత్ ఉద్ దవా అధినేత హఫీజ్ సయీద్‌ను కలిసిన విషయం పార్లమెంటు ఉభయ సభలను మంగళవారం కుదిపేసింది. దీంతో రాజ్యసభ రెండుసార్లు వాయిదా పడింది. సభ సమావేశం కాగానే కాంగ్రెస్, వామపక్షాలు, జేడీ(యూ), తృణమూల్ తదితర విపక్షాలకు చెందిన సభ్యులు ఈ అంశంపై ఒక్కసారిగా గందరగోళం సృష్టించారు. దీనిపై ప్రభుత్వం నుంచి వివరణ కావాలని డిమాండ్ చేశారు. ముందు ప్రశ్నోత్తరాల సమయం కానివ్వాలని ఛైర్మన్ హమీద్ అన్సారీ పదే పదే కోరినా ఎవరూ వినిపించుకోకపోవడంతో తొలుత పావుగంట, తర్వాత మధ్యాహ్నం వరకు సభ వాయిదా పడింది. మరోవైపు లోక్‌సభలో కూడా ఇదే సీన్ కనిపించింది. విపక్షాల సభ్యులు ఇక్కడ కూడా ప్రభుత్వం నుంచి వివరణ కావాలంటూ గందరగోళం సృష్టించారు. దీంతో ప్రశ్నోత్తరాల సమయం అస్సలు జరగలేదు. దీంతో స్పీకర్ సుమిత్రా మహాజన్ సభను వాయిదా వేయక తప్పలేదు. మళ్లీ రెండోసారి సమావేశమైనప్పుడు గాజా మీద ఇజ్రాయెల్ దాడుల అంశంపై గందరగోళం చెలరేగడంతో సభ మళ్లీ వాయిదా పడింది. -
బిల్లు ఆమోదం సరికాదని చెప్పాం: సుష్మా
న్యూఢిల్లీ: పార్లమెంట్లో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టే విషయంపై కేంద్ర ప్రభుత్వం తమకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని బీజేపీ నాయకురాలు సుష్మా స్వరాజ్ తెలిపారు. ఈరోజు బిల్లు పెడుతున్నట్టు తమకు కనీస మాత్రంగా కూడా చెప్పలేదన్నారు. తెలంగాణ బిట్లును అనుబంధ ఎజెండా పెట్టినట్టు తమకు ఎలాంటి పత్రాలు ఇవ్వలేదన్నారు. ఇంత గందరగోళం మధ్య తెలంగాణ బిల్లు ఆమోదం సరికాదని ప్రధానికి చెప్పామన్నారు. తమ సూచనను ప్రభుత్వం పెడచెవిన పెట్టిందని విమర్శించారు. ఇక తాము ప్రభుత్వంతో ఏ రూపంలోనూ చర్చలు జరపబోమని స్పష్టం చేశారు. స్పీకర్ తన స్థానంలోకి రావడానికి నిమిషం ముందే ఘర్షణ ప్రారంభమైందని తెలిపారు. కాంగ్రెస్ అధ్యక్షురాలి ముందే ఆ పార్టీ ఎంపీలు ఇలా చేయడమా అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. పార్లమెంట్లో జరిగిందంతా కాంగ్రెస్ కుట్ర అని ఆరోపించారు. సభలో జరిగిన పరిణామాలన్నిటికీ కాంగ్రెస్‌దే బాధ్యతన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిపై చర్యలు తీసుకోవాలని సుష్మా స్వరాజ్ డిమాండ్ చేశారు.