ruling party MLAs
-
అన్నీ ఒకరికేనా?!
సాక్షి ప్రతినిధి, కర్నూలు: నీరు–చెట్టు పనులను అప్పగించడంలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ల వ్యవహార శైలి ఆ పార్టీ నేతలు, కార్యకర్తలకే మింగుడు పడటం లేదు. నియోజకవర్గానికి వచ్చిన పనులన్నీ గంపగుత్తగా ఒకే కాంట్రాక్టర్‌కు అప్పగిస్తున్న తీరుపై మండిపడుతున్నారు. తాజాగా అధికార పార్టీ ముఖ్యనేత సోదరుడి నియోజకవర్గంలో ఏకంగా రూ.48 కోట్ల పనులను ఒకే కాంట్రాక్టర్‌కు అప్పగించారు. 8 శాతం కమీషన్ తీసుకుని ఈ పనులను కట్టబెట్టినట్టు సమాచారం. అంటే రూ.48 కోట్ల పనులకు గాను ఏకంగా రూ.3.84 కోట్ల కమీషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై కార్యకర్తలు, నాయకులు మండిపడుతున్నారు. పార్టీని, నేతను నమ్ముకుని ఉంటే తమకు మాత్రం పనులు ఇవ్వడం లేదని వారు వాపోతున్నారు. అయితే, ఈ నియోజకవర్గంలో నీరు–చెట్టు పథకం కింద చెక్‌డ్యాంల నిర్మాణ పనులే అధికంగా మంజూరయ్యాయి. దీంతో సదరు కాంట్రాక్టర్ ఇంకా పనులు ప్రారంభించలేదని తెలుస్తోంది. చెక్‌డ్యాం పనుల్లో భారీగా ఆదాయం ఉండకపోవడమే ఇందుకు కారణమని సమాచారం. కమీషన్ ఇంతేనా? నీరు–చెట్టు పథకం కింద జిల్లావ్యాప్తంగా భారీగా పనులు మంజూరవుతున్నాయి. ఈ నాలుగేళ్ల కాలంలో రూ.868 కోట్ల పనులు మంజూరయ్యాయి. ఇందులో అధికభాగం నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోనే ఉండడం గమనార్హం. ఈ పనులన్నింటిలోనూ 12 నుంచి 22 శాతం వరకు అధికార పార్టీ నేతలు కమీషన్లు దండుకున్నారు. ఇక్కడ ప్రధానంగా పూడికతీత పనులు కావడంతో భారీగా కమీషన్లు వస్తున్నాయి. అయితే.. ముఖ్యనేత సోదరుడి నియోజకవర్గంలో చెక్‌డ్యాంల నిర్మాణ పనులు మంజూరు కావడంతో అంతగా ఆదాయం ఉండదనేది కాంట్రాక్టర్ల భావన. దీనికితోడు పనులు కచ్చితంగా చేయాల్సి ఉంటుంది. పూడికతీత పనుల్లో ఇందుకు భిన్నం. కొన్నిచోట్ల గతంలో ఉపాధి హామీ కింద చేసిన పనులనే చూపి.. మరికొన్ని చోట్ల నామమాత్రంగా చేపట్టి మొత్తం బిల్లు తీసేసుకుంటున్నారు. దీంతో ఏకంగా 22 శాతం వరకూ కమీషన్లు అక్కడి అధికార పార్టీ నేతలకు ముట్టజెప్పారు. అయితే, తనకు కేవలం 8 శాతం కమీషన్ కావడంపై సదరు నేత మదనపడిపోతున్నారు. ఈ నేపథ్యంలోనే నియోజకవర్గంలో ఎక్కడైనా చిన్న చిన్న చెరువులు ఉన్నాయేమోనని శోధించే పనిలో పడినట్టు తెలుస్తోంది. ఎక్కడైనా చెరువులున్నాయా? నీరు–చెట్టు కింద నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఆళ్లగడ్డ, నంద్యాల, శ్రీశైలం, నందికొట్కూరు, బనగానపల్లె నియోజకవర్గాల్లో ఎక్కువగా పూడికతీత పనులు చేపట్టారు. ఈ పనులన్నీ సులభతరం కావడంతో కాంట్రాక్టర్లకు అధిక ఆదాయం ఉంటోంది. దీంతో అధికారపార్టీ నేతలకు ఇచ్చే కమీషన్ కూడా ఎక్కువగా ఉంటోంది. అదే చెక్‌డ్యాం పనుల్లో తమకు పెద్దగా ఆదాయం ఉండదనేది కాంట్రాక్టర్ల భావన. దీంతో పూడికతీత పనులకే మొగ్గు చూపుతున్నారు. ముఖ్యనేత సోదరుడు ఇన్చార్జ్గా ఉన్న నియోజకవర్గంలో మాత్రం చెక్‌డ్యాంల పనులను తీసుకున్న కాంట్రాక్టర్ ఇప్పటి వరకు వాటిని ప్రారంభించలేదు. మరోవైపు నియోజకవర్గంలో ఎక్కడైనా చిన్న చిన్న చెరువులు ఉన్నాయేమోనంటూ వెతికే పనిలో పడినట్టు తెలుస్తోంది. ఒకవేళ ఏవైనా చెరువులు కనిపిస్తే చెక్‌డ్యాంల నిర్మాణం కాకుండా ఈ పనులను చేసుకోవాలని భావిస్తున్నట్టు సమాచారం. -
దూమారం రేపుతున్న ఉద్యోగుల స్థానచలనం
► పనితీరుకు పాతర ► రెవెన్యూలో కొనసాగుతున్న కసరత్తు ► కీలక మండలాల తహసీల్దార్ పోస్టింగ్‌ల కోసం ప్రజాప్రతినిధుల పట్టు ► వాణిజ్య, రవాణా శాఖ బదిలీల్లో ఎన్జీవో రాష్ట్ర నేత జోక్యం ► కావాల్సిన 10 మందికి కీలక ఏసీటీవో పోస్టింగ్‌లు ► జిల్లా పరిషత్‌లో 163 మంది ఉద్యోగులకు బదిలీలు ► మాట వినని అటవీశాఖ అధికారులకు స్థానచలనం ► చక్రం తిప్పుతున్న అమాత్యులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు సాక్షి, విజయవాడ : గుంటూరు, కృష్ణాజిల్లాలో ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలు రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. మంత్రులు, అధికారపార్టీ ఎమ్మెల్యేలు బదిలీల్లో జోక్యం చేసుకుంటున్నారు. నిబద్ధత, క్రమశిక్షణతో పనిచేసే అధికారులను పక్కన పెట్టి, తమకు కావాల్సిన, తమ సామాజికవర్గం వారు, వచ్చే ఎన్నికల్లో అధికార పార్టీ ఏజెంట్లా పనిచేసే అధికారులకు పెద్దపీట వేస్తున్నారు. బాగా ముట్టజెప్పడాన్ని అదనపు అర్హతగా నిర్ణయించి అధికార పార్టీ ఎమ్మెల్యేలు, అమాత్యులు బదిలీల్లో చక్రం తిప్పుతున్నారు. ప్రధానంగా రెవెన్యూ, పోలీస్, జిల్లా పరిషత్, వాణిజ్యపన్నులు, రవాణా, నీటి పారుదల శాఖల్లో బదిలీలపై పూర్తి దృష్టి కేంద్రీకరించి జేబులు నింపుకునే పనిలో నిమగ్నమయ్యారు. జిల్లాలో అన్ని ప్రభుత్వ విభాగాల్లో సాధారణ బదిలీలు మొదలయ్యాయి. ఈ క్రమంలో అన్ని ప్రభుత్వ శాఖల్లో జూనియర్ అసిస్టెంట్ స్థాయి నుంచి జిల్లా అధికారి వరకు బదిలీలు జరుగుతున్నాయి. వాస్తవానికి ఈనెల 20వ తేదీ నాటికి బదిలీల ప్రక్రియ పూర్తిచేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఒకేచోట ఐదేళ్లు పనిచేసిన వారిని బదిలీ చేయాల్సి ఉంది. మూడేళ్లు పనిచేసిన వారిని రిక్వెస్ట్ బదిలీ చేయొచ్చు. జిల్లాలో దీనికి భిన్నంగా బదిలీల పర్వం సాగుతోంది. కావాల్సి ఉద్యోగి అయితే ఒకేచోట ఏడేళ్లకు పైగా పనిచేస్తున్నా పట్టించుకోవడంలేదు. జిల్లాలో కీలకమైన తహసీల్దార్ల బదిలీల వ్యవహారం కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా కృష్ణాజిల్లాలో 15 మందికిపైగా తహసీల్దార్లకు స్థానచలనం కలిగే అవకాశం ఉంది. కొందరు అధికారపార్టీ ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో తమకు అనుకూలురైన తహసీల్లార్లకు పోస్టింగ్ ఇప్పించే పైరవీల్లో నిమగ్నమయ్యారు. మచిలీపట్నంలో కలెక్టరేట్లో బదిలీల ప్రహసనం సాగుతూనే ఉంది. రాజకీయ ఒత్తిళ్లు, పైరవీలు ఎక్కువగా ఉండటంతో ఉన్నతాధికారులు తేల్చులేకపోతున్నారు. అధికార పార్టీ కనుసన్నల్లోనే.. కైకలూరు నియోజకవర్గంలో మాట వినని అధికారులను మంత్రి కామినేని శ్రీనివాసరావు, అధికార పార్టీ నేతలు పట్టుబట్టి మరీ బదిలీచేయించారు. కైకలూరు, మండవల్లి పరిధిలో కొల్లేరు సరస్సు విస్తరించి ఉంది. ఇక్కడ చేపల సాగు నిషిద్ధం. టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆ పార్టీ నేతలు, మంత్రి కామినేని అనుచరులు అక్రమంగా చేపల సాగు చేపట్టారు. దీనిని అడ్డుకున్న అటవీశాఖ రేంజర్ సునీల్‌కుమార్, తెలంగాణ కేడర్‌కు చెందిన వి.వి.ఎల్.సుభద్రాదేవిని కొద్ది నెలలకే బదిలీ చేశారు. మచిలీపట్నం పురపాలక సంఘంలో ఇటీవల జరిగిన బదిలీల్లో మంత్రి, చైర్పర్సన్ తమకు ఇష్టం లేని ఉద్యోగులను అక్కడి నుంచి సాగనంపారు. జూనియర్ అసిస్టెంట్లు ఏడుగురు, సీనియర్ అసిస్టెంట్ ఒకరు, బిల్ కలెక్టర్లు ఐదుగురు, శానిటరీ ఇన్స్పెక్టర్ ఒకరిని బదిలీ చేయించారు. రాష్ట్ర ఎన్జీవో నేత జోక్యం కృష్ణాజిల్లాలోని వాణిజ్య పన్నులు, రవాణా శాఖల ఉద్యోగుల బదిలీల్లో రాష్ట్ర ఎన్జీవో సంఘ కీలక నేత చక్రం తిప్పారు. విజయవాడ పరిధిలో పనిచేస్తున్న 10 మంది ఏసీటీవోలను బదిలీలు చేయించడం వెనుక ఆ నేత పరపతితో పాటు భారీగా నగదు చేతులు మారిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. తమకు కావాల్సిన వారిని కీలక ప్రాంతాల్లో, అధిక ఆదాయం ఉండే చోట ఏసీటీవోలుగా నియమించారు. మూడేళ్ల సర్వీసు పూర్తికానివారిని కూడా బదిలీ చేయించారు. ఇదే క్రమంలో పరపతి ఉన్న అధికారుల జోలికి వెళ్లలేదు. సదరు ఎన్జీవో నేతతో సన్నిహితంగా ఉంటూ ఇటీవల తన నివాసంలో ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయనే ఫిర్యాదుతో ఏసీబీ సోదాలు ఎదుర్కొన్న అధికారి, మూడేళ్ల పదవీకాలం పూర్తి చేసుకున్న ఇద్దరు జిల్లా స్థాయి అధికారుల బదిలీల్లో చక్రం తిప్పారు. పరపతి లేకపోవడంతో ఏడాది కాలం పూర్తి కాని గుంటూరు, ఏలూరు అధికారులను బదిలీ చేశారు. సదరు నేత రవాణా శాఖ బదిలీల్లో జోక్యం చేసుకుంటున్నారు. తమ యూనియన్ కార్యకలాపాల్లో ఉండే ఒక ఉద్యోగికి తూర్పుగోదావరి జిల్లాకు బదిలీ జరిగింది. ఆ ఉద్యోగి బదిలీని నిలిపివేసే ప్రయత్నాల్లో ఎన్జీవో నేత ఉన్నారని సమాచారం. గుంటూరు జిల్లాలో అడ్డగోలు రాజకీయ బదిలీలు గుంటూరు జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగుల బదిలీల ప్రక్రియ అడ్డగోలుగా సాగుతోంది. జూనియర్ అసిస్టెంట్ స్థాయి ఉద్యోగుల బదిలీ విషయంలో కూడా ప్రజాప్రతినిధులు, అమాత్యులు జోక్యం చేసుకోవడం గందరగోళానికి దారితీస్తోంది.20వ తేదీ కల్లా బదిలీల ప్రకియ పూర్తి కావాల్సి ఉన్నా సిఫార్సులు, నగదు పైరవీలు అధికంగా ఉండడంతో ఇంకా ప్రహసనంగానే కొనసాగుతున్నాయి. ముఖ్యంగా జిల్లా పరిషత్, పంచాయతీ రాజ్, ఇతర ఇంజినీరింగ్ విభాగాల్లో బదిలీలు మాత్రమే ఇప్పటి వరకు పూర్తి అయ్యాయి. జిల్లాలో చక్రం తిప్పే అధికార పార్టీ ఎమ్మెల్యేలు ముగ్గురు అన్ని శాఖల బదిలీల్లో విపరీతంగా జోక్యం చేసుకుంటున్నారు. పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పోలీస్ శాఖ వ్యవహారాలు, బదిలీలు అన్నీ అధికార పార్టీ సీనియర్ ఎమ్మెల్యే చూస్తున్నారు. ఇతర ప్రభుత్వ శాఖల వ్యవహారాలను మరో సీనియర్ ఎమ్మెల్యే పర్యవేక్షిస్తున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం జరిగిన సాధారణ బదిలీల్లో వారిద్దరు పూర్తిస్థాయిలో చక్రం తిప్పారు. ఇక జిల్లాలో కీలకంగా ఉన్న ఓ మంత్రి అన్ని శాఖల బదిలీల్లో తన మాట చెల్లుబాటుకు అధికప్రాధాన్యం దక్కేలా జిల్లా స్థాయి అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. బదిలీకి నిర్ణయించిన కాలపరిమితి, సీనియారిటీతో సంబంధం లేకుండా తమకు కావాల్సిన అధికారులు ఇక్కడే కొన్నేళ్ళ కొనసాగేలా చేశారు. ముఖ్యంగా జిల్లా పరిషత్‌లో సుమారు 152 మంది ఉద్యోగుల బదిలీలు జరిగాయి. వీటిలో 50 శాతం వరకు నిబంధలకు విరుద్ధంగానే చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా ప్రజాప్రతినిధులు, యూనియన్ నేతల జోక్యం అధికంగా ఉంది. అలాగే పంచాయతీరాజ్ విభాగంలో, ఆర్డబ్ల్యూఎస్, ఇతర ఇంజనీరింగ్ విభాగాల్లో డబ్బు ప్రాధాన్యంతో బదిలీలు జరిగాయి. ముఖ్యంగా ఏఈ స్థాయి అధికారి నుంచి ఉన్నతాధికారి వరకు బదిలీల్లో సామాజిక వర్గంతో పాటు డబ్బు, రాజకీయ సిఫార్సులు బాగా నడిచాయి. రెవెన్యూ శాఖలో 20 మంది వరకు తహశీల్దార్లకు స్థాన చలనం ఉంటుందని ప్రచారం సాగుతోంది. అధికార పార్టీ ప్రజాప్రతినిధుల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో రెవెన్యూ బదిలీలు అలస్యం అయినట్లు సమాచారం. -
సిఫార్సులుంటే... గృహయోగం
అధికార పార్టీ ఎమ్మెల్యేల ఇళ్లు జనంతో కళకళలాడుతున్నాయి. ఇళ్లకోసం దరఖాస్తు చేసినవారంతా వారిని ప్రసన్నం చేసుకునేందుకు క్యూకడుతున్నారు. అన్నివిధాలా అనుకూలురైన జాబితా తయారీలో నేతలంతా తలమునకలై ఉన్నారు. ఇప్పటివరకూ కాలరెగరేసిన జన్మభూమి కమిటీలసూచనలను పక్కన పెట్టిన అధికారులు అసలైన జాబితాలకోసం ఎదురుతెన్నులు చూస్తున్నారు. అర్హతల మాటెలా ఉన్నా... తమవారికి అందలం ఎక్కించేందుకు నాయకులంతా ఆచితూచి వ్యవహరిస్తున్నారు. సాక్షి ప్రతినిధి, విజయనగరం : జిల్లాలో ఇళ్లకోసం దరఖాస్తు చేసుకున్నవారికి ఇప్పుడు నేతల ఆశీస్సులు అవసరమవుతున్నాయి. వారి సిఫార్సులుంటేనే ఇళ్లు మంజూరు కానున్నాయి. అధికారులు సైతం వారి ప్రతిపాదనల కోసం ఎదురు చూస్తున్నారు. జన్మభూమి కమిటీల ముసుగులో అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఆ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు పెత్తనం చెలాయిస్తున్నారు. ప్రస్తుతం వారి ఇళ్ల వద్ద ప్రతిపాదిత జాబితాలు తయారవుతున్నాయి. అంతా కొలిక్కి వచ్చాక గృహ నిర్మాణ శాఖ అధికారులకు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో లబ్ధిదారుల ఎంపికపై జాప్యం జరుగుతోంది. ప్రకటనే తప్ప మార్గదర్శకాలు లేవు టీడీపీ అధికారంలోకి వచ్చాక ఒక్క ఇల్లయినా మంజూరు కాలేదు. ఎట్టకేలకు గ్రామీణ జిల్లాకు 10,500, పట్టణాల్లో 11,303ఇళ్లు మంజూరు చేస్తూ ప్రకటన జారీ చేసినా లబ్ధిదారుల ఎంపిక విషయం ఇంకా ఒక కొలిక్కి రాలేదు. పట్టణాల్లో ఇచ్చే ఇళ్లను కేంద్రసాయంతో ఇవ్వనుంది. గ్రామీణ ఇళ్ల యూనిట్ ఖరీదు రూ. 2.75లక్షలు. ఇందులో రూ. లక్షా 25వేలు ప్రభుత్వ సబ్సిడీగా, మిగతా రూ. లక్షా 50వేలు రుణంగా ఇవ్వనుంది. ఇప్పుడా రుణం ప్రభుత్వం ఇస్తుందా? బ్యాంకుల నుంచి తీసుకోమంటుందా? అన్నదానిపై ఇంకా స్పష్టత లేదు. గ్రామీణ జిల్లాకు మంజూరైన 10,500ఇళ్లల్లో విజయనగరం నియోజకవర్గానికి 500, మిగతా నియోజకవర్గాలకు చెరో 1250చొప్పున ఇప్పటికే కేటాయించారు. ఇక, గ్రామీణ ప్రాంతాలకు కేటాయించిన వాటిలో 50శాతం లేఅవుట్‌గా, 50శాతం వ్యక్తిగతంగా మంజూరు చేయనున్నారు. పట్టణ ప్రాంత ఇళ్లకు సంబంధించి నేటికీ స్పష్టత రాలేదు. 11,303 కేటాయించినట్టు ప్రకటన తప్ప వాటికి సంబంధించిన మార్గదర్శకాల్లేవు. ఇంతవరకు యూనిట్ ఖరీదూ నిర్ధారణ కాలేదు. రూ.4.98లక్షలని, రూ. 6లక్షలు అని వార్తలు రావడం తప్ప వాస్తవమేంటో తెలియలేదు. లబ్ధిదారుల ఎంపికపై మల్లగుల్లాలు మూడో విడత జన్మభూమిలో వచ్చిన ధరఖాస్తుల ఆధారంగా లబ్ధిదారులను ఎంపిక చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఇంతవరకు అది కార్యరూపం దాల్చలేదు. జన్మభూమి గ్రామసభల్లో జిల్లా వ్యాప్తంగా ఇళ్ల కోసం సుమారు 32వేల దరఖాస్తులొచ్చాయి. వాటిలో అర్హులైన వారిని ఎంపిక చేయాల్సి ఉంది. ఈ ప్రక్రియ ఇంకా ప్రారంభం కాలేదు. ఇప్పటి వరకూ జిల్లా అధికారులకు జన్మభూమి కమిటీ పేరుతో 1440 ప్రతిపాదిత దరఖాస్తులొచ్చాయి. కానీ తమ సిఫార్సులు లేకుండా ఎటువంటి ఎంపిక చేపట్టొద్దని హౌసింగ్ అధికారులకు టీడీపీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జ్ మౌఖిక ఆదేశాలివ్వడంతో వాటిని పక్కపెట్టారు. జాబితా తయారీలో టీడీపీ నేతలు ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్యేలు లబ్ధిదారుల ఎంపిక పనిలో బిజీగాఉన్నారు. అర్హతలకంటే తమ అనుచరులా? కాదా? అన్నదే ప్రామాణికంగా జాబితాలు తయారు చేస్తున్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు లేనిచోట ఆ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు జాబితాలు రూపొందిస్తున్నారు. ఇప్పుడా పార్టీ నేతల్లో ఇళ్లల్లో సందడి నెలకొంది. ఇళ్లు తక్కువగా రావడంతో ఎవరికివ్వాలన్నదానిపైనా మల్లగుల్లాలు పడుతున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పాలనలో సంతృప్తికర పద్ధతిలో ఇళ్లు మంజూరయ్యాయి. ఇప్పుడు అరకొరగా కేటాయించడం.. దరఖాస్తులు లెక్కకుమిక్కిలిగా రావడంతో టీడీపీ ఎమ్మెల్యేలు ఒక అభిప్రాయానికి రాలేకపోతున్నారు. ఇంకా జాబితాలు రాలేదు జిల్లాలో జన్మభూమి సభల్లో సుమారు 32వేల దరఖాస్తులొచ్చాయి. ఇప్పటి వరకు జన్మభూమి కమిటీల నుంచి 1440 ప్రతిపాదనలు వచ్చాయి. వాటిని పరిశీలన నిమిత్తం ఉంచాం. మిగతా ప్రతిపాదనలన్నీ వచ్చాక లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ చేపడుతాం. ఇళ్లు రుణం విషయమై ఇంకా స్పష్టత రాలేదు. - ఎస్.వి.రమణమూర్తి, హౌసింగ్ ప్రాజెక్టు డెరైక్టర్, విజయనగరం. -
అసెంబ్లీలో సంభాషణల వీడియో లీక్‌పై విచారణ జరపాలి
సాలూరు : అసెంబ్లీ సమావేశాల్లో అధికార పార్టీ ఎమ్మెల్యేలు వ్యవహరిస్తున్న తీరు సరిగ్గా లేదని, వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు మాత్రమే నోరు జారుతున్నట్టు చిత్రీకరించే ప్రయత్నం చేయడం విచారకరమని సాలూరు ఎ మ్మెల్యే, శాసనసభ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పీడిక రాజన్నదొర అన్నా రు. బుధవారం అసెంబ్లీలో జరిగిన సంఘట నలపై తీవ్ర వేదన వెలిబుచ్చారు. ఈ మేరకు ఆయన ఫోన్లో ఇక్కడి విలేకరులతో మాట్లాడా రు. నిండు సభలో టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు బూతుపురాణం అందుకుని, సభ్యసమాజం తలదించుకునేలా దూషణలకు దిగడం, మొన్న సీఎం చంద్రబాబు నీ అం తు చూస్తానని బెదిరించడం వంటి ఘటనలు చూస్తుంటే చట్ట సభలు ఎటు పయనిస్తున్నా యో, రాజ్యాంగం ఏమౌతుందోనన్న ప్రశ్న ఉత్పన్నమవుతుందన్నారు. ఇంత చేసి వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే రోజా దుర్బాషలాడుతున్నట్టు వీడి యో క్లిప్పింగ్‌ను విడుదల చేసి అధికార పార్టీ నే తలు రాద్దాంతం చేస్తున్నారన్నారు. ఆ వీడియో క్లిప్పింగ్ ఎలా బయటకు వచ్చిందో విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో స్పీకర్‌పై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. ఇప్పటివరకు సభలో ఏ సభ్యుడు ఏమి మాట్లాడారో వీడియో క్లిప్పింగ్‌లను క్షుణ్ణం గా పరిశీలించి విచారణ జరపాలన్నారు.