Rupani
-
రూపానీ అర్ధాంతర రాజీనామాకు కారణం ఏంటి ?
-
వలసదారులు వెనక్కి!
అహ్మదాబాద్: దాడుల భయం నేపథ్యంలో హిందీ మాట్లాడే వలసదారులు గుజరాత్‌ను వీడుతుండటం కొనసాగుతోంది. మంగళవారం కూడా హిందీ భాషీయులు గుజరాత్ నుంచి బిహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాల్లోని తమ సొంత ప్రాంతాలకు భారీ సంఖ్యలో వెళ్లిపోయారు. ఇప్పటికే గుజరాత్ నుంచి 60 వేల మందికిపైగా హిందీ వాళ్లు తమ సొంత రాష్ట్రాలకు వెళ్లిపోయి ఉంటారని అంచనా. హిందీ వలసదారుల్లో భయం పోగొట్టడానికి పారిశ్రామిక ప్రాంతాల్లో పోలీసులు గస్తీ పెంచారు. వందలాది మంది పోలీసులు వడోదరలో కవాతు నిర్వహించి వలసదారులకు భరోసానిచ్చారు. హిందీ భాషీయులపై దాడులకు పాల్పడిన 533 మందిని అరెస్టు చేసి 61 కేసులు నమోదు చేశామని గుజరాత్ హోం శాఖ మంత్రి జడేజా చెప్పారు. సామాజిక మాధ్యమాల్లో విద్వేషపూరిత పోస్ట్‌లు చేసిన మరో 20 మందిని ఐటీ చట్టం కింద అరెస్టు చేశామన్నారు. అహ్మదాబాద్ రైల్వే స్టేషన్లో ఓ వలసదారుడు మాట్లాడుతూ ‘కొంతమంది నిన్న రాత్రి మా దగ్గరకు వచ్చి మేమంతా మా సొంత రాష్ట్రాలకు వెళ్లిపోవాలనీ, లేకుంటే దాడులు చేస్తామని బెదిరించారు’ అని తెలిపాడు. సబర్‌కాంఠా జిల్లాలో 14 నెలల బాలికపై అత్యాచారం చేశాడనే ఆరోపణలపై బిహార్ నుంచి వచ్చిన ఓ కూలీని పోలీసులు అరెస్టు చేసిన అనంతరం గుజరాత్‌లోని పలు జిల్లాల్లో హిందీ మాట్లాడేవారిపై దాడులు జరుగుతుండటం తెలిసిందే. కాంగ్రెస్సే కారణం: బీజేపీ కాంగ్రెస్ ఎమ్మెల్యే అల్పేశ్ ఠాకూర్, ఆయనకు చెందిన గుజరాత్ క్షత్రియ–ఠాకూర్ సేననే ఈ హింసకు కారణమని బీజేపీ ఆరోపించింది. ‘కాంగ్రెస్సే హింసను రగిలిస్తుంది. ఆ హింసను పార్టీ అధ్యక్షుడు రాహుల్ ఖండిస్తారు’ అంటూ సీఎం రూపానీ ట్వీట్ చేశారు. రాహుల్ అంతకుముందు మాట్లాడుతూ దేశంలో నిరుద్యోగం వల్ల యువతలో పెరుగుతున్న అసహనమే దాడులకు కారణమనీ, జనాభాకు తగ్గట్టుగా ఉద్యోగాలు కల్పించలేకపోవడం ప్రభుత్వ అసమర్థతేనని విమర్శించారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మాట్లాడుతూ ‘ఈ దాడుల ధోరణి ప్రమాదకరం. ఇదో విపత్కర పరిస్థితి. సమస్య చాలా తీవ్రంగా ఉంది. బీజేపీ ప్రభుత్వం ఎందుకు నియంత్రణ చర్యలు చేపట్టడం లేదో నాకు అర్థం కావడం లేదు’ అని పేర్కొన్నారు. పారిశ్రామిక రంగంపై ప్రభావం వేలాది మంది వలస కార్మికులు గుజరాత్‌ను వీడి వెళ్లిపోతుండటంతో మౌలిక సదుపాయాలు, నిర్మాణ, ఔషధ రంగాల్లో మానవ వనరుల కొరత స్పష్టంగా కనిపిస్తోంది. కార్మికులు దొరకక భారీ స్థాయిలో ఉత్పత్తి నష్టం వాటిల్లుతోంది. ఔషధ రంగానికి బాగా ప్రముఖంగా ఉన్న గుజరాత్లో దాదాపుగా 3,300 ఔషధ తయారీ కేంద్రాలు ఉన్నాయి. ఫార్మా ఎగుమతుల్లో 28% వాటా గుజరాత్‌దే. వలస కార్మికులు ఎక్కువగా పనిచేసే ఫాక్టరీలు వారి భద్రత కోసం ఇప్పటికే పలు చర్యలు తీసుకున్నాయి. అంతేకాదు ఇప్పటికే రాష్ట్రం విడిచి వెళ్లిపోయిన వారు వెనక్కి వచ్చేలా చర్యలు కూడా చేపడుతున్నట్టు మానవ వనరుల మంత్రిత్వ శాఖ అధికారులు వెల్లడించారు. -
ఆనందీబెన్ వారసుడెవరు?
-
ఆనందీబెన్ వారసుడెవరు?
తెరపైకి నితిన్ పటేల్, రూపానీ, కేంద్రమంత్రి పురుషోత్తం అహ్మదాబాద్: గుజరాత్ సీఎంగా ఆనందీబెన్ పటేల్ రాజీనామా ప్రకటనతో ఆమె స్థానాన్ని ఎవరితో భర్తీచేస్తారనే విషయంపై స్పష్టత రాలేదు. బుధవారం ఢిల్లీలో జరిగే బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఆనందీబెన్ పటేల్ రాజీనామాను ఆమోదించటంతోపాటు కొత్త సీఎంనూ ప్రకటించే అవకాశాలున్నట్లు తెలిసింది. సీఎం రేసులో పలువురు ముఖ్యనేతల పేర్లు ప్రముఖంగా వినబడుతున్నాయి. గుజరాత్ ఆరోగ్య మంత్రి నితిన్ పటేల్, రాష్ట్ర బీజేపీ చీఫ్ విజయ్ రూపానీ, సౌరభ్ పటేల్, కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాలా, అసెంబ్లీ స్పీకర్ గణపత్ వసావా (గిరిజన నాయకుడు) జాబితాలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి నితిన్‌భాయ్ పటేల్‌కు పార్టీలో మంచి పట్టుంది. దీనికి తోడు మోదీ పీఎం అయ్యాక.. గుజరాత్ సీఎం రేసులో నితిన్ పేరు ప్రముఖంగా వినిపించింది. అయితే.. పటేల్ సామాజిక వర్గానికి చెందినవాడైనా ఆ వర్గం యువత ఈయనపై పూర్తి వ్యతిరేకతతో ఉండటం.. నితిన్‌కు ప్రతికూలంగా మారే అవకాశం ఉంది. జైన్ వర్గానికి చెందిన రాష్ట్ర బీజేపీ చీఫ్ రూపానీకి మోదీ, అమిత్ షాతోపాటు ఆరెస్సెస్ అండదండలు పుష్కలంగా ఉన్నాయి. అన్ని వర్గాలను కలుపుకుపోతారని ఈయనకు పేరుంది. గుజరాత్ ఇంధన మంత్రి సౌరభ్ పటేల్ పేరు కూడా సీఎం రేసులో వినబడుతోంది. ఈయన.. అంబానీ సోదరులకు దగ్గరి బంధువు. కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాలా, స్పీకర్ గణపత్ వసావాలకూ అవకాశాలున్నట్లు తెలుస్తోంది. అయితే.. గుజరాత్ బీజేపీ కార్యకర్తలు మాత్రం అమిత్ షా సీఎం అయితే.. పార్టీకి రాష్ట్రంలో ఎదురవుతున్న చిన్నాచితకా సమస్యలను అధిగమించవచ్చని భావిస్తున్నారు. కాగా, బీజేపీ సీఎంగా ఆనందీబెన్ పటేల్‌ను తొలగించటం.. ఆమెను బలిపశువును చేయటమేనని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శించారు.