Ryan Burl
-
సికిందర్ రజా ఊచకోత.. టీ20 క్రికెట్లో జింబాబ్వే ప్రపంచ రికార్డు
అంతర్జాతీయ టీ20 క్రికెట్లో పెను సంచలనం నమోదైంది. ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్‌కప్ సబ్ రీజినల్ ఆఫ్రికా క్వాలిఫయర్స్‌లో జింబాబ్వే పరుగుల విధ్వంసం సృష్టించింది. నిర్ణీత 20 ఓవర్లలో ఏకంగా 344 రన్స్ స్కోరు చేసింది. తద్వారా ఇంటర్నేషనల్ టీ20లలో అత్యధిక పరుగులు చేసిన జట్టుగా ప్రపంచ రికార్డు సాధించింది.గాంబియా బౌలింగ్ ఊచకోతనైరోబిలోని రౌరాక స్పోర్ట్స్ క్లబ్ గ్రౌండ్లో జింబాబ్వే గాంబియా(Gambia) జట్టుతో తలపడింది. టాస్ గెలిచిన సికందర్ రజా బృందం తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు బ్రియాన్ బెనెట్, తాడివాన్షే మరుమణి(Tadiwanashe Marumani) గాంబియా బౌలింగ్‌ను ఊచకోత కోశారు. బ్రియాన్ 26 బంతుల్లో 7 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 50 పరుగులు రాబట్టగా.. మరుమణి కేవలం 19 బంతుల్లోనే 62 రన్స్ సాధించాడు.సికందర్ రజా ఒక్కడే 133 రన్స్వన్డౌన్ బ్యాటర్ డియాన్ మైర్స్(12) విఫలం కాగా.. కెప్టెన్ సికందర్ రజా పరుగుల సునామీ సృష్టించాడు. కేవలం 43 బంతుల్లోనే 7 ఫోర్లు, 15 సిక్సర్ల సాయంతో 133 రన్స్ చేసి నాటౌట్‌గా నిలిచాడు. మిగతావాళ్లలో రియాన్ బర్ల్ 11 బంతుల్లో 25, క్లైవ్ మడాండే కేవలం 17 బంతుల్లోనే 53(నాటౌట్) పరుగులు సాధించారు. చరిత్ర పుటల్లోకి జింబాబ్వే జట్టుఫలితంగా కేవలం నాలుగు వికెట్లు నష్టపోయిన జింబాబ్వే 20 ఓవర్లలో ఏకంగా 344 పరుగులు స్కోరు చేసింది. తద్వారా నేపాల్ పేరిట ఉన్న టీ20 ప్రపంచ రికార్డును బద్దలు కొట్టింది. ఆసియా క్రీడలు-2023లో భాగంగా నేపాల్ మంగోలియాపై 314 పరుగులు స్కోరు చేసింది. తాజాగా జింబాబ్వే ఆ రికార్డును బ్రేక్ చేసి అత్యధిక పరుగుల జట్టుగా తమ పేరును చరిత్రపుటల్లో లిఖించుకుంది. 290 పరుగుల భారీ తేడాతో విజయంజింబాబ్వే విధించిన కొండంత లక్ష్యాన్ని చూసి బెంబేలెత్తిన గాంబియా.. 54 పరుగులకే ఆలౌట్ అయింది. ఆ జట్టు ఆటగాళ్ల స్కోర్లు వరుస(బ్యాటింగ్ ఆర్డర్)గా 5,0,7,4,7,1,2,2,0,12*,0. దీంతో జింబాబ్వే ఏకంగా 290 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. జింబాబ్వే బౌలర్లలో రిచర్డ్ నగర్వా, బ్రాండన్ మవుతా మూడేసి వికెట్ల తీయగా.. వెస్లీ మధెవెరె రెండు, ర్యాన్ బర్ల్ ఒక వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.చదవండి: Asia Cup 2024: పాకిస్తాన్ భారీ విజయం.. భారత్‌తో పాటు సెమీస్‌లో! -
హతవిధి.. జింబాబ్వే కొంపముంచిన స్కాట్లాండ్
జింబాబ్వే జట్టును దురదృష్టం వెంటాడింది.వరల్డ్‌కప్‌కు అర్హత సాధించాలన్న కల చెదిరింది. సొంతగడ్డపై జరుగుతున్న క్రికెట్ వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్‌లో గ్రూప్ దశలో వరుస విజయాలతో చెలరేగింది. సీన్ విలియమ్స్ వరుస సెంచరీలకు తోడుగా సికందర్ రజా ఆల్‌రౌండ్ ప్రదర్శన చేస్తుండడంతో జింబాబ్వే ఈసారి వన్డే వరల్డ్‌కప్‌కు అర్హత సాధిస్తుందని అంతా భావించారు. అయితే సూపర్ సిక్స్ దశకు వచ్చేసరికి చతికిలపడింది. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో పరాజయంతో జింబాబ్వే అవమాన భారంతో వరల్డ్‌కప్ అర్హత రేసు నుంచి నిష్క్రమించింది. క్రికెట్ వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్ రేసులో భాగంగా మంగళవారం స్కాట్లాండ్తో జరిగిన సూపర్ సిక్స్ ఆరో మ్యాచ్‌లో జింబాబ్వే 31 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. 235 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన జింబాబ్వే 41.1 ఓవర్లలో 203 పరుగులకు ఆలౌట్ అయింది. రియాన్ బర్ల్ 84 బంతుల్లో 83 పరుగులు వీరోచిత పోరాటం వృథాగా మిగిలిపోయింది. మెస్లీ మెద్వెర్ 40, సికందర్ రజా 34 పరుగులు చేశారు. స్కాట్లాండ్ బౌలర్లలో క్రిస్ సోల్ మూడు వికెట్లు తీయగా, బ్రాండన్ మెక్ముల్లన్ రెండు, సఫ్యాన్ షరీఫ్, మార్క్ వాట్, క్రిస్ గ్రీవ్స్ తలా ఒక వికెట్ తీశారు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 234 పరుగులు చేసింది. మైకెల్ లీస్క్ 48, మాథ్యూ క్రాస్ 38, బ్రాండన్ మెక్ముల్లన్ 34, మున్సే 31, మార్క్ వాట్ 21 పరుగులు చేశారు. జింబాబ్వే బౌలర్లలో సీన్ విలియమ్స్ మూడు వికెట్లు తీయగా.. చటారా రెండు, నగరవా ఒక వికెట్ పడగొట్టాడు. సూపర్ సిక్స్‌లో వరుస రెండు ఓటములు జింబాబ్వే కొంపముంచితే.. తొలి మ్యాచ్‌లో ఓడినా వరుసగా రెండు విజయాలతో ప్లస్ రన్‌రేట్‌తో ఉన్న స్కాట్లాండ్ ఖాతాలో ఆరు పాయింట్లు ఉన్నాయి. దీంతో ఆ జట్టుకు వన్డే వరల్డ్‌కప్‌కు అర్హత సాధించే చాన్స్ ఉంది. స్కాట్లాండ్ తమ చివరి మ్యాచ్ నెదర్లాండ్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో స్కాట్లాండ్ గెలిస్తే నేరుగా వరల్డ్‌కప్‌కు అర్హత సాధిస్తుంది. ఒకవేళ ఓడినా స్కాట్లాండ్కు అవకాశం ఉంటుంది. కాకపోతే నెదర్లాండ్స్ చేతిలో భారీ ఓటమి పాలవ్వకుండా జాగ్రత్తపడాలి. స్కాట్లాండ్తో మ్యాచ్‌లో నెదర్లాండ్స్ 30 కంటే ఎక్కువ పరుగులతో గెలవాలి లేదంటే చేజింగ్‌లో ఆరు ఓవర్లు మిగిలి ఉండగానే టార్గెట్‌ను అందుకోవాలి. అప్పుడే నెదర్లాండ్స్ వన్డే వరల్డ్‌కప్‌కు అర్హత సాధిస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం డచ్ జట్టు ఖాతాలో నాలుగు పాయింట్లు మాత్రమే ఉన్నాయి. స్కాట్లాండ్ను ఓడించినా ఆ జట్టు ఆరు పాయింట్లకు చేరుకుంటుంది. అప్పుడు నెట్ రన్‌రేట్ కీలకం కానుంది. Final World Cup 2023 spot qualification scenario: Scotland - win and grab their tickets for India. Netherlands - win by 30+ runs or chase the target with 6 overs to spare. pic.twitter.com/R0HzIljTSl — Mufaddal Vohra (@mufaddal_vohra) July 4, 2023 చదవండి: #AlexCarey: 'బెయిర్ స్టో అమాయక చక్రవర్తి.. బ్రాడ్ కపట సూత్రధారి' -
Zim Vs Ire: ఐర్లాండ్‌కు షాకిచ్చిన జింబాబ్వే.. సిరీస్ కైవసం
Zimbabwe vs Ireland, 3rd T20I: సొంతగడ్డపై జింబాబ్వే సత్తా చాటింది. ఐర్లాండ్‌తో మూడో టీ20లో విజయం సాధించింది. పర్యాటక జట్టుపై 4 వికెట్ల తేడాతో గెలుపొంది సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది. మూడు టీ20, మూడు వన్డేల సిరీస్ ఆడేందుకై ఐర్లాండ్ జింబాబ్వేలో పర్యటిస్తోంది. ఈ క్రమంలో హరారే వేదికగా జరుగుతున్న టీ20 సిరీస్‌లో భాగంగా తొలి టీ20లో జింబాబ్వే 5 వికెట్ల తేడాతో గెలుపొందగా.. రెండో మ్యాచ్‌లో ఐర్లాండ్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ నేపథ్యంలో నిర్ణయాత్మక ఆఖరి టీ20లో జింబాబ్వే ఆఖరి వరకు పోరాడి ఎట్టకేలకు జయకేతనం ఎగురవేసింది. టెక్టర్ ఒక్కడే ఐర్లాండ్‌తో ఆదివారం నాటి మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆతిథ్య జింబాబ్వే తొలుత బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్‌కు దిగిన ఐరిష్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసింది. హ్యారీ టెక్టర్ 47 పరుగులతో ఐర్లాండ్ ఇన్నింగ్స్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. కర్టిస్ కాంఫర్ 27, డాక్రెల్ 23 పరుగులతో రాణించారు. సిరీస్ విజేత జింబాబ్వే (PC: Zimbabwe Cricket) చివరి వరకు పోరాడినా ఇక లక్ష్య ఛేదనకు దిగిన జింబాబ్వే ఆదిలోనే వికెట్లు కోల్పోయినప్పటికీ వన్‌డౌన్‌లో వచ్చిన క్రెయిగ్ ఎర్విన్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. అర్ధ శతకం(54)తో రాణించి క్లిష్ట పరిస్థితుల్లో జట్టును ఆదుకున్నాడు. అయితే, ఐర్లాండ్ మాత్రం పట్టు సడలించలేదు. ఈ దశలో ఆల్‌రౌండర్ ర్యాన్ బర్ల్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. 11 బంతుల్లో 30 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చాడు. గత రెండు మ్యాచ్‌లలోనూ రాణించిన అతడు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్, ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు అందుకున్నాడు. జింబాబ్వే వర్సెస్ ఐర్లాండ్ మూడో టీ20 స్కోర్లు ఐర్లాండ్- 141/9 (20) జింబాబ్వే- 144/6 (19) చదవండి: IND vs SL: తీవ్రంగా గాయపడిన శ్రీలంక ఆటగాళ్లు.. స్ట్రెచర్‌పై మైదానం బయటకు! IND vs SL: గ్రౌండ్లోకి దూసుకొచ్చి కోహ్లి కాళ్లు మొక్కిన ఫ్యాన్.. విరాట్ ఏం చేశాడంటే?