rythu garjana
-
'ఇక్కడి నుంచే టీఆర్ఎస్ అంతం'
రైతు గర్జన , కాంగ్రెస్, టీఆర్ఎస్ , రైతులు హెచ్చరించిన కాంగ్రెస్ జాతీయ, రాష్ర్ట నేతలు ఆదిలాబాద్‌లో నిర్వహించిన రైతు గర్జన సక్సెస్ హాజరైన దిగ్విజయ్‌సింగ్, కుంతియా, టీపీసీసీ నేతలు రైతుల పక్షాన గర్జించిన కాంగ్రెస్ నాయకులు ఆదిలాబాద్ : రైతులు పిడికిలి బిగిస్తే కేసీఆర్, టీఆర్ఎస్ సర్కార్ ఖతమవుతుందని, ఇది ఆదిలాబాద్ నుంచే ఆరంభమవుతుందని కాంగ్రెస్ నేతలు హెచ్చరించారు. రైతులను విస్మరిస్తున్న ఈ ప్రభుత్వానికి పుట్టగతులు ఉండవని అన్నారు. ఇచ్చిన వాగ్దానాలను కూడా నెరవేర్చని ప్రభుత్వాన్ని నిలదీసే సమయం ఆసన్నమైందని, మోసపూరిత ప్రభుత్వంపై పోరాటానికి ప్రజల పక్షాన తాము నిలబడుతామని భరోసా ఇచ్చారు. ప్రభుత్వ తీరుపై గర్జించారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని రాంలీల మైదానంలో కాంగ్రెస్ రైతుగర్జన బహిరంగ సభ జరిగింది. అంతకుముందు స్థానిక ఓ ప్రైవేటు హోటల్లో టీపీసీసీ సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఏఐసీసీ అగ్రనేతలు దిగ్విజయ్‌సింగ్, ఆర్.సి.కుంతియా, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తంకుమార్‌రెడ్డి తదితరులు హాజరయ్యారు. బుధవారం సాగు నీటి ప్రాజెక్టులపై నిర్వహించనున్న పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ అంశంపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు. అనంతరం బహిరంగసభకు వచ్చిన అగ్రనేతలు డీసీసీ అధ్యక్షుడు మహేశ్వర్‌రెడ్డి చేపట్టిన రెండు రోజుల దీక్షను విరమింపజేశారు. తర్వాత సభ స్థలానికి చేరుకుని సభకు హాజరైన రైతులు, కార్యకర్తలను ఉద్దేశించి ప్రసగించారు. రుణమాఫీలో విఫలం టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తంకుమార్‌రెడ్డి మాట్లాడుతూ, రుణమాఫీని అమలులో సర్కారు విఫలమైందన్నారు. 37 లక్షల మంది రైతులు పాసు పుస్తకాలు బ్యాంకుల్లో ఉండిపోయాయని, దీంతో అప్పు పుట్టక రైతులు అల్లాడుతున్నారని ఆవేదన చెందారు. నూకలు చెల్లినట్లే.. వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ, ఆదిలాబాద్‌లో రైతు సందోహం చూస్తుంటే ప్రభుత్వానికి ఇక్కడి నుంచే నూకలు చెల్లినట్లు కనిపిస్తోందన్నారు. ఈ గర్జనతోనైనా ప్రభుత్వం రుణమాఫీ చేస్తుందని ఆశిస్తున్నామని పేర్కొన్నారు. రైతులకు కృతజ్ఞతలు మాజీ హోంమంత్రి, జిల్లా ఇన్చార్జి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ, ఆదిలాబాద్‌లో రైతు గర్జనను విజయవంతం చేసిన రైతులకు కృతజ్ఞతలు తెలిపారు. ఇందుకు కృషిచేసిన జిల్లా శ్రేణులు, డీసీసీ అధ్యక్షుడు మహేశ్వర్‌రెడ్డిని అభినందించారు. హామీల అమలు ఏదీ? సీఎల్పీ నేత షబ్బీర్ అలీ మాట్లాడుతూ, సోనియాగాంధీతోనే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని, కేసీఆర్ వాగ్ధానాలను నమ్మి రాష్ట్రంలో ప్రజలు టీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తెచ్చారని, ఆ హామీల అమలులో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని అన్నారు. పాపం పండుతుంది ఎమ్మెల్సీ కోమట్రెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డి మాట్లాడుతూ, కేసీఆర్ పాపం పండే రోజు ముందుందని పేర్కొన్నారు. నల్గొండలో నయూం ముఠా డైరీలో 99 శాతం టీఆర్ఎస్ నాయకుల పేర్లే ఉన్నాయని, భూదందాలు, సెటిల్మెంట్లు వారివేనని ఆరోపించారు. ‘డబుల్’ ఇళ్లు ఏవీ..? గద్వాల్ ఎమ్మెల్యే డీకే అరుణ మాట్లాడుతూ, ఎర్రవెల్లిలో మోడల్ డబుల్ బెడ్రూంలు తప్పితే రాష్ట్రంలో ఎక్కడా ప్రారంభం కాలేదన్నారు. కాంగ్రెస్ మోసపూరిత వాగ్ధానాలు చెప్పలేదు కాబట్టే అధికారంలోకి రాలేకపోయిందని పేర్కొన్నారు. మద్దతు ధర ఇవ్వాలి ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి మాట్లాడుతూ, పత్తికి రూ.5 వేల మద్దతు ధర ఇవ్వాలని డిమాండ్‌చేశారు. ఈ ప్రభుత్వం రూ.2.33 వేల కోట్ల అప్పుతో ఉందని ఇది తలసరిగా రూ.10 వేల భారం పడుతుందని, అప్పుడే పుట్టిన బిడ్డలపైనా భారమేనని అన్నారు. -
రైతుకూలీ గర్జన
సాక్షి నెట్వర్క్: అవిశ్రాంతంగా సాగుతున్న సమైక్యాంధ్ర పరిరక్షణోద్యమం వరుసగా 82వరోజైన ఆదివారం కూడా ఉధృతంగా కొనసాగింది. సమైక్య రాష్ర్ట పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలో 16వ నంబర్ జాతీయ రహదారిపై రైతుకూలీ గర్జన నిర్వహించారు. సుమారు రెండు గంటల పాటు జరిగిన ఈ గర్జనలో కూలీలు సమైక్యనినాదాలు హోరెత్తించారు. ఇప్పటికే పలు సమస్యలు ఎదుర్కొంటున్న రైతులు, కూలీలు.. రాష్ర్టం ముక్కలైతే మరింత దుర్భరస్థితి ఎదుర్కోవాల్సివస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. వ్యవసాయర ంగం సుభిక్షంగా ఉండాలంటే రాష్ర్టం సమైక్యంగానే ఉండాలని నినదించారు. ముమ్మిడివరంలో 216 జాతీయ రహదారిపై విద్యార్థులు బైఠాయించి నిరసన తెలిపారు. అమలాపురంలో అభ్యుదయ కళాకారుల సంఘం ఆధ్వర్యంలో ప్రదర్శించిన సమైక్యాంధ్ర బుర్రకథ వీక్షకులకు ఉత్తేజాన్ని నింపింది. కృష్ణాజిల్లా ముదినేపల్లి మండలం వడాలి చెరువులో విద్యార్థులు, ఉపాధ్యాయులు జలదీక్ష చేశారు. నందివాడ మండలం టెలిఫోన్ నగర్లో ఉపాధ్యాయులు రిలేదీక్షలు చేపట్టారు. మాదిగల సింహగర్జన అనంతపురం జిల్లా కేంద్రంలో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన మాదిగల సింహగర్జన విజయవంతమైంది. సభలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. రాష్ట్ర విభజనతో ప్రధానంగా నష్టపోయేది మాదిగలేనని అన్నారు. ఇండియన్ ముస్లిం మైనార్టీ ఆర్గనైజేషన్(ఐఎంఎం) నాయకులు నగరంలో భారీర్యాలీ నిర్వహించారు. సమైక్యం కోసం ఉద్యోగానికి రాజీనామా చేసిన హిందూపురం మునిసిపల్ మెప్మా అధికారి రాయల్ విజయభాస్కర్ పట్టణంలోనిఅంబేద్కర్ సర్కిల్లో ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు. చిత్తూరు జిల్లా పుంగనూరులో పట్టణ జేఏసీ అధ్యక్షుడు వరదారెడ్డి ఆధ్వర్యంలో ఉద్యోగులు ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. రాయలసీమ చిల్డ్రన్స్ అకాడమీ విద్యార్థులు జాతీయ పతాకాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా నెల్లూరు డీఆర్డీఏ సమావేశ మందిరంలో సీమాంధ్రలోని 13జిల్లాలకు చెందిన ఐకేపీ ఉద్యోగులు సమావేశమై సమైక్యఉద్యమాన్ని ఉధృతం చేయాలని తీర్మానిం చారు. వచ్చే నెల మూడున విజయవాడలో సీమాంధ్ర ఐకేపీ ఉద్యోగుల సభను నిర్వహించాలని నిర్ణయించినట్టు సంఘం నెల్లూరు జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు చెప్పారు. భవిష్యత్ కార్యాచరణపై త్వరలో తిరుపతిలో సమావేశమవుతామన్నారు. గడపగడపకూ సమైక్యనాదం వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపుమేరకు సమైక్యాంధ్రప్రదేశ్ పరిరక్షణ లక్ష్యంగా అలుపెరుగని పోరాటం చేస్తున్న పార్టీ శ్రేణులు విభిన్నరూపాల్లో ఆందోళనలు చేపట్టాయి. పార్టీనేతలు, కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి సమైక్యాంధ్ర ఆవశ్యకతను వివరిస్తున్నారు. రాజమండ్రి రూరల్ నియోజకవర్గం రాయుడుపాకలులో పార్టీ కో ఆర్డినేటర్ ఆకుల వీర్రాజు ఆధ్వర్యంలో ‘గడపగడపకూ వైఎస్సార్సీపీ సమైక్య నాదం’ కార్యక్రమం చేపట్టారు. మలికిపురం మండలం శంకరగుప్తంలో వైఎస్సార్సీపీ రాజోలు నియోజకవర్గ కో ఆర్డినేటర్ జయప్రకాష్ ఆధ్వర్యంలో సమైక్యాంధ్ర కోసం ప్రార్థనలు చేశారు. విశాఖ జిల్లా చోడవరంలో పార్టీ కార్యకర్తలు రాస్తారోకో నిర్వహించారు. మునగపాక మెయిన్‌రోడ్డులో వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త ప్రసాద్ నేతృత్వంలో రాస్తారోకో నిర్వహించి సోనియాగాంధీ దిష్టిబొమ్మను దహనం చేశారు. కృష్ణాజిల్లా నూజివీడు, కైకలూరుల్లో పార్టీ కార్యకర్తలు మానవహారాలు చేపట్టారు. చిత్తూరు జిల్లా పలమనేరులో మాజీ ఎమ్మెల్యే అమరనాథరెడ్డి ఆధ్వర్యంలో సీమాంధ్ర కేంద్ర మంత్రుల మాస్క్‌లను గాడిదలకు తగిలించి ఊరేగించారు. మదనపల్లెలో ఎమ్మెల్సీ దేశాయ్ తిప్పారెడ్డి ఆధ్వర్యంలో అంబేద్కర్ సర్కిల్లో రోడ్డుపై బైఠాయించారు. తిరుపతిలో రిలే నిరాహార దీక్ష చేస్తున్న వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి మద్దతు తెలిపారు. శ్రీకాళహస్తిలోనియోజకవర్గ సమన్వయకర్త మధుసూదన్ రెడ్డి దీక్షా శిబిరం వద్ద అరటి పండ్లు అమ్మి నిరసన తెలిపారు. వైఎస్సార్ జిల్లా పులివెందులలో వైఎస్సార్సీపీ నేత దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి ఆధ్వర్యంలో జీపులు, సుమోలతో ర్యాలీని నిర్వహించారు. రైల్వేకోడూరులో పార్టీ కార్యకర్తలు రోడ్డుపై ధర్నా చేపట్టారు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో రిలేదీక్షా శిబిరాన్ని పార్టీ ఎమ్మెల్యే మేకతోటి సుచరిత ప్రారంభించారు. జేడీశీలంకు సమైక్య సెగ కేంద్ర మంత్రి జేడీశీలంకు గుంటూరు జిల్లాలో సమైక్య సెగ తగిలింది. కాకుమాను మండలం అప్పాపురం గ్రామానికి వస్తున్న ఆయన్ను సమైక్య వాదులు కాకువూను ప్రధాన కూడలిలో అడ్డుకున్నారు. గ్రావు సర్పంచ్ కొసనా వుధుసూధన్ రావు ఆధ్వర్యంలో వుంత్రి వాహనాన్ని చుట్టుముట్టారు. వుంత్రి పదవికి రాజీనావూ చేసి సమైక్యాంధ్ర సాధన కోసం ఉద్యమించాలని డివూండ్ చేశారు. దానికి వుంత్రి సమాధానమిస్తూ రాజీనావూల వల్ల ఒరిగేదేమీలేదని, పదవిలో ఉండి సవుస్యను పరిష్కరించుకోవాలనే ఉద్దేశంతోనే రాజీనామా చేయలేదని తెలిపారు. పోలీసుల జోక్యంతో పరిస్థితి సద్దుమణిగింది. -
సమైక్య రైతు బేరి
సాక్షి నెట్వర్క్ : పండుగల్లేవు.. పబ్బాలేవు.. సెలవుల్లేవు.. విరామం లేదు.. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడమే లక్ష్యంగా ఉద్యమిస్తున్న సీమాంధ్ర ప్రజ వరుసగా 77వ రోజైన మంగళవారం కూడా సమైక్య ఉద్యమాన్ని ఉద్ధృతంగా చేపట్టింది. ఉద్యోగ జేఏసీ నేతలు కోస్తా, రాయలసీమ జిల్లాల్లోని అన్ని మండలాల్లోనూ రైతులకు అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి విభజన జరిగితే వ్యవసాయరంగానికి వచ్చే నష్టాల్ని వివరించారు. హోరెత్తిన రైతుగర్జనలు తూర్పుగోదావరి జిల్లా కోనసీమలోని అమలాపురం, ఉప్పలగుప్తం, అల్లవరం మండల కేంద్రాల్లో రైతులు ర్యాలీలు చేసి విభజన యత్నాలపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్రం ముక్కలైతే సస్యశ్యామలమైన కోనసీమ బీడువారి పోతుందని, నదీజలాల సమస్యలు తలెత్తి గోదావరి డెల్టా ఎండిపోతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. సీతానగరంలో జరిగిన రైతు గర్జనలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి. మాజీ ఎమ్మెల్యే చిట్టూరి రవీంద్ర పాల్గొన్నారు. పెద్దాపురం తహశీల్దార్ కార్యాలయం వద్ద జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు గర్జనకు 500 మంది రైతులు ఎడ్ల బండ్లపై తరలివచ్చారు. జగ్గంపేట, రాజానగరం, తుని తదితర ప్రాంతాల్లో రైతులు, జేఏసీ నేతలు ర్యాలీలు నిర్వహించారు. పశ్చిమగోదావరి జిల్లా భీమడోలు జంక్షన్లో ‘రైతుభేరి’ నిర్వహించారు. పాలకొల్లు, చింతలపూడి, పెరవలి, శింగగూడెంలలో రైతు అవగాహన సదస్సులు నిర్వహించారు. విజయనగరం జిల్లా బొబ్బిలిలో ఎన్జీఓలు కోర్టు జంక్షన్లో రహదారులను దిగ్భందించి మానవహారం నిర్మించారు. పార్వతీపురంలో ఏపీ ఎన్జీవోలు కేంద్ర మంత్రుల మాస్కులు వేసుకున్న వ్యక్తులకు గడ్డి తినిపిస్తూ నిరసన వ్యక్తం చేశారు. అన్నదాతల ధర్నా కృష్ణా జిల్లా పామర్రులో రైతులు నాలుగురోడ్ల కూడలిలో ధర్నా నిర్వహించారు. చల్లపల్లిలో వీఆర్వోలు, వీఆర్ఏలు రాస్తారోకో చేపట్టారు. జేఏసీ పిలుపు మేరకు అవనిగడ్డ నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో రైతు సదస్సులు జరిగాయి. గుంటూరు జిల్లా పొన్నూరులో రైతులు ప్రదర్శన చేపట్టారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో రైతుగర్జన పేరిట బహిరంగసభ నిర్వహించారు. ముందుగా రైతులు భారీ ర్యాలీగా సభాస్థలికి వస్తూ నాలుగురోడ్ల కూడలిలో మానవహారం చేపట్టారు. ప్రకాశం జిల్లా గిద్దలూరులో ఎన్జీవోలు ర్యాలీ నిర్వహించి రాష్ట్రీయ రహదారిపై మానవహారం నిర్వహించారు. ఒంగోలులో సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో ఎన్జీవోలు, రెవెన్యూ, ఇతర ఉద్యోగ సంఘాలన్నీ కలిసి జిల్లా కలెక్టరేట్ ఎదుట మానవహారం నిర్వహించాయి. సీమలో వినూత్న నిరసనలు అనంతపురంలో కార్పొరేషన్ ఉద్యోగులు మెడలో ఉరితాళ్లు వేసుకుని నిరసన తెలిపారు. హిందూపురంలో విశాలాంధ్ర పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో సోనియా గాంధీని రావణాసురుడిలా చిత్రీకరించి.. కేంద్ర మంత్రుల తలలు అటూ ఇటూ పెట్టి ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని దహనం చేశారు. రాయదుర్గంలో రిలే దీక్షలు చేస్తున్న సమైక్యవాదులకు ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి సంఘీభావం తెలిపారు. చిత్తూరు జిల్లా పలమనేరులో ప్రతి ఇంటి ముందూ సమైక్యాంధ్ర అని రాసి ఉంచాలని కోరుతూ సమైక్యవాదులు పాదయాత్ర చేపట్టారు. మదనపల్లె-తిరుపతి ర హదారిపై కొత్తవారిపల్లి వద్ద రైతు గర్జన నిర్వహించారు. తిరుపతి గాంధీపురం శ్మశాన వాటిక లో సమాధి నిర్మించి, సోనియాగాంధీ బొమ్మ తగిలించారు. కర్నూలులో కలియుగ రావణాసురిగా సోనియాగాంధిని చిత్రీకరించి ఆమెకు పదితలలుగా ప్రధాని మన్మోహన్, కేంద్రమంత్రుల చిత్రాలను ఉంచారు. దానిపై టపాసులు పెట్టి కలెక్టరేట్ వద్ద దహనం చేశారు. చాగలమర్రిలో రైతు గర్జన సదస్సును నిర్వహించారు. వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగులో భారీ ర్యాలీ చేపట్టారు. రాజంపేటలో రైతులు ర్యాలీ నిర్వహించారు. పులివెందులలో ఎన్జీఓలు కాగడాల ప్రదర్శనతోపాటు రోడ్డుపైన పడుకొని నిరసన చేపట్టారు. విభజనకు వ్యతిరేకంగా ఓటేస్తాం రాష్ర్ట శాసనసభలో అసెంబ్లీ తీర్మానానికి వ్యతిరేకంగా ఓటేస్తామని పలువురు ఎమ్మెల్యేలు మంగళవారం ఎన్జీవోలకు ప్రమాణం చేసి హామీపత్రాలను సమర్పించారు. విశాఖలో తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే ద్రోణంరాజు శ్రీనివాస్, కృష్ణాజిల్లా జగ్గయ్యపేట శాసనసభ్యుడు శ్రీరాం రాజగోపాల్ హామీ పత్రం ఇచ్చారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో ఎన్జీవోలు ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు నివాసాన్ని ముట్టడించారు. తాను అసెంబ్లీలో విభజనకు వ్యతిరేకంగా ఓటేస్తామంటూ ఆయన ప్రమాణ పత్రాన్ని అందివ్వడంతో వారు శాంతించారు.