పద్మశ్రీ అందుకున్న డాక్టర్ ఎస్ఎల్.భైరప్ప
డాక్టర్ ఎస్ఎల్.భైరప్పను పద్మశ్రీ అవార్డుతో సత్కరిస్తున్న సుభాష్ చంద్ర
మైసూరు: సరస్వతీ సమ్మాన్ అవార్డు గ్రహీత, ప్రముఖ కన్నడ సాహితీవేత్త డాక్టర్ ఎస్ఎల్.భైరప్పకు శుక్రవారం పద్మశ్రీ అవార్డును అందజేశారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మశ్రీ అవార్డులకు ఎస్.ఎల్.భైరప్పకూడా ఎంపిక చేసారు. ఢిల్లీలో రాష్ట్రపతి భవన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎస్.ఎల్.భైరప్పను పద్మశ్రీ అవార్డుతో సన్మానించాల్సి ఉండగా అనారోగ్య కారణాలతో ఢిల్లీ వెల్లడం కుదరలేదు.
దీంతో కేంద్ర ప్రభుత్వ సూచన మేరకు శుక్రవారం కర్ణాటక అసిస్టెంట్ ఛీఫ్ సెక్రటరీ సుభాష్ చంద్ర మైసూరులోని ఎస్.ఎల్.భైరప్ప నివాసానికి చే రుకొని పద్మశ్రీ అవార్డును ఆయనకు అందచేసి సత్కరించారు. కార్యక్రమంలో జిల్లా ఎస్పీ అభినవ్ ఖరే,అసిస్టెంట్ జిల్లా కలెక్టర్ వెంకటేశ్, నగర డిప్యూటీ పోలీస్కమీషనర్ శేఖర్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు.