ఎంసెట్‌కు ఏర్పాట్లు పూర్తి
మెదక్ మున్సిపాలిటీ, న్యూస్‌లైన్: ఎంసెట్ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయినట్టు మెదక్ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్, ఎంసెట్ రీజి నల్ కోఆర్డినేటర్ సబ్బారాయుడు తెలి పారు. సోమవారం ఆయన విలేకరుల తో మాట్లాడారు. ఈనెల 22న జరిగే పరీక్షకు మెదక్ పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల, ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, వైపీఆర్ ఇంజనీరింగ్ కళాశాల, సిద్దార్థ్ మోడల్ హైస్కూల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు.
ఇంజనీరింగ్ విభాగంలో 1,836, అగ్రికల్చర్, మెడిసిన్ విభాగాల్లో 1,221 మంది పరీక్ష రాయనున్నారని పేర్కొన్నా రు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఇంజనీరింగ్, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 వరకు అగ్రికల్చర్, మెడిసిన్ విభాగాలకు సంబంధించిన పరీక్ష నిర్వహించనున్నట్టు తెలిపారు. విద్యార్థులు అరగంట ముందే కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. బ్లూ, బ్లాక్ పాయింట్ పెన్, హాల్‌టికెట్ మాత్రమే తీసుకురావాలన్నారు. హాల్‌టికెట్ రానివారు గెజిటెడ్ అధికారిచే ధ్రువీకరించిన ఆన్లైన్ అప్లికేషన్, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులైతే కుల ధ్రువీకరణ పత్రం కూడా తీసుకురావాలను. కేంద్రాల్లోకి ఎలక్ట్రానిక్ వస్తువులను తీసుకురాకూడదన్నారు.