Sachin: A Billion Dreams
-
సచిన్ సినిమా ఫస్ట్ డే కలెక్షన్ ఎంతో తెలుసా?
క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ జీవిత ఆధారంగా తెరకెక్కిన సినిమా 'సచిన్: ఎ బిలియన్ డ్రీమ్స్'. ఎలాంటి పబ్లిసిటీ, ప్రమోషన్స్ అవసరం లేకుండానే థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమాకు తొలిరోజే ప్రేక్షకుల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. హిందీ, మరాఠి, తమిళ్, తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో ఈ సినిమా శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఆడియన్స్ రియాక్షన్స్ ను పక్కనబెడితే బాక్సాఫీసు వద్ద ఈ సినిమా తన సత్తా చాటింది. తొలిరోజు కలెక్షన్ గా ఈ సినిమాకు బాక్సాఫీసు వద్ద రూ.8.40 కోట్ల వసూలు అయ్యాయి. సినిమా ఫార్మాట్ లో కాకుండా.. ఓ డాక్యుమెంటరీ తరహాలో సచిన్ జీవితాన్ని జేమ్స్ ఎర్స్ కిన్ తెరకెక్కించారు. కాగ అంతకమునుపే ఎంఎస్ ధోని, అజారుద్దీన్ బయోగ్రఫీలపై సినిమాలు వచ్చినప్పటికీ, వాటిల్లో బాలీవుడ్ నటులు ఆయా పాత్రల్లో నటించారు. కానీ సచిన్ సినిమాల్లో సచినే నటించడం ఇటు క్రికెట్ ఫ్యాన్స్ ను, అటు సినిమా అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. నేడు యూకేలో కూడా ఈ సినిమా విడుదలైంది. సినీ విమర్శకుల మన్ననలను సైతం ఈ సినిమా చూరగొంటోంది. సినిమా చూసిన ప్రేక్షకుల నుంచి వస్తున్న రివ్యూలు సైతం అద్భుతంగా ఉన్నాయి. ప్రఖ్యాత చలన చిత్ర విమర్శకుడు తరణ్ ఆదర్స్ సైతం ఈ మూవీ రివ్యూను తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ప్రజలతో పంచుకున్నాడు. ''మరో అద్భుతమైన ఇన్నింగ్స్ ను డెలివరీ చేశారు.. కాంగ్రాక్ట్స్ సచిన్ అండ్ టీమ్'' అంటూ అనుష్క శర్మ ట్వీట్ చేసింది. రియల్ లైఫ్ హీరో, సచిన్ సినిమా ఎంతో స్ఫూర్తిదాయకంగా, ప్రోత్సహకరంగా ఉందంటూ ప్రముఖుల ట్వీట్లు వెల్లువెత్తుతున్నాయి. -
సచిన్ మూవీకి శిష్యుడు డుమ్మా!
ముంబై: భారత జట్టు చాంపియన్స్ ట్రోఫీకి బయల్దేరే ముందు క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ బయోపిక్ ‘సచిన్: ఎ బిలియన్ డ్రీమ్స్’ను బుధవారం ముంబైలోని వెర్సోవా థియేటర్ లో ఆటగాళ్ల కోసం ప్రత్యేకంగా ప్రదర్శించారు. కానీ ఈ ప్రిమియర్ షోకు ఓ వ్యక్తి గైర్హాజరు కావడంపైనే అందరు చర్చించుకున్నారు. అతడే టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్. తనకు గురువు, దేవుడు అని సచిన్ ను కీర్తించే శిష్యుడు సెహ్వాగ్ బయోపిక్ షో ఎందుకు హాజరుకాలేదో ఓ వీడియో ద్వారా తెలిపాడు. 'వాస్తవానికి నాకు ఆహ్వానం అందింది. కానీ ఆ సమయంలో భార్యతో హాలీడే ట్రిప్ లో ఉన్నాను. దేవుడి(సచిన్) ప్రసాదాన్ని ఆస్వాదించకుండా భార్య ఆర్తీతో సమయం గడపాల్సి వచ్చిందని' తనదైన శైలిలో సెహ్వాగ్ వివరించాడు. 'నాన్ స్ట్రైకర్ గా ఉన్నప్పుడు, డ్రెస్సింగ్ రూములో కూర్చుని కూడా సచిన్ బ్యాటింగ్ ను ఫ్రీగా చూశాను. ఇప్పుడు సచిన్ బ్యాటింగ్ చూసేందుకు డబ్బులు, సమయం ఖర్చు చేస్తాను. కోట్ల మంది సచిన్ బయోపిక్ చూస్తారని ఆశిస్తున్నాను. ఎంతోమందికి ఆయన రోల్ మోడల్ గా నిలిచారు. ఈ మూవీ ద్వారా మరికొంత మందిలో స్ఫూర్తిని రగిలిస్తాడని' సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు. జేమ్స్ ఇర్స్ కిన్ దర్శకత్వం వహించిన ఈ మూవీకి ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని సమకూర్చారు. నేడు (శుక్రవారం) ‘సచిన్: ఎ బిలియన్ డ్రీమ్స్’ విడుదలైన విషయం తెలిసిందే. -
సచిన్ మూవీకి శిష్యుడు డుమ్మా!
-
ఐదు భాషల్లో ‘సచిన్’ సినిమా
న్యూఢిల్లీ: భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ జీవిత చరిత్రపై వస్తున్న ‘సచిన్: ఎ బిలియన్ డ్రీమ్స్’ను ఐదు భాషల్లో విడుదల చేయనున్నారు. సచిన్కున్న ఫ్యాన్ ఫాలోయింగ్ ను దృష్టిలో పెట్టుకుని ఈ సినిమాను సాధ్యమైనన్ని ఎక్కువ భాషల్లో విడుదల చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు ఐదు భాషల్లో సినిమాను విడుదల చేయనున్నట్లు నిర్మాత రవి భాగ్చండ్క తెలిపారు. ఈనెల 26న విడుదలయ్యే ఈ సినిమాను దేశవ్యాప్తంగా ఉన్న అభిమానులందరినీ అలరించేందుకు హిందీ, ఇంగ్లిష్, మరాఠి, తమిళ్, తెలుగు భాషల్లో విడుదల చేయనున్నట్లు తెలిపారు. 'సచిన్ టెండూల్కర్ కీర్తిని ఏ ఒక్క భాషకో పరిమితం చేయలేము. దేశం గర్వించదగ్గ వ్యక్తి కాబట్టి వీలైనన్ని ఎక్కువ భాషల్లో విడుదల చేయాలనుకుంటున్నాం’ అని రవి చెప్పారు. సచిన్ తన 10వ ఏట నుంచే క్రికెట్ గురించి కన్నకలలు దగ్గర్నుంచీ వరల్డ్ కప్ సాధించిన జట్టులో సభ్యుడైన విశేషాలన్నింటిని ఈ చిత్రంలో పొందుపరిచినట్లు పేర్కొన్నారు.