ఐదు భాషల్లో ‘సచిన్‌’ సినిమా | Tendulkar film 'Sachin: A Billion Dreams' to release in five languages | Sakshi
Sakshi News home page

ఐదు భాషల్లో ‘సచిన్‌’ సినిమా

Published Fri, May 5 2017 9:29 PM | Last Updated on Tue, Sep 5 2017 10:28 AM

ఐదు భాషల్లో ‘సచిన్‌’ సినిమా

ఐదు భాషల్లో ‘సచిన్‌’ సినిమా

న్యూఢిల్లీ: భారత క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ జీవిత చరిత్రపై వస్తున్న ‘సచిన్‌: ఎ బిలియన్‌ డ్రీమ్స్‌’ను ఐదు భాషల్లో విడుదల చేయనున్నారు. సచిన్కున్న ఫ్యాన్ ఫాలోయింగ్ ను  దృష్టిలో పెట్టుకుని ఈ సినిమాను సాధ్యమైనన్ని ఎక్కువ భాషల్లో విడుదల చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు ఐదు భాషల్లో సినిమాను విడుదల చేయనున్నట్లు నిర్మాత రవి భాగ్‌చండ్క తెలిపారు.

ఈనెల 26న విడుదలయ్యే ఈ సినిమాను దేశవ్యాప్తంగా ఉన్న అభిమానులందరినీ అలరించేందుకు హిందీ, ఇంగ్లిష్, మరాఠి, తమిళ్, తెలుగు భాషల్లో విడుదల చేయనున్నట్లు తెలిపారు. 'సచిన్‌ టెండూల్కర్‌ కీర్తిని ఏ ఒక్క భాషకో పరిమితం చేయలేము. దేశం గర్వించదగ్గ వ్యక్తి కాబట్టి వీలైనన్ని ఎక్కువ భాషల్లో విడుదల చేయాలనుకుంటున్నాం’ అని రవి చెప్పారు. సచిన్ తన 10వ ఏట నుంచే క్రికెట్ గురించి కన్నకలలు దగ్గర్నుంచీ వరల్డ్ కప్ సాధించిన జట్టులో సభ్యుడైన విశేషాలన్నింటిని ఈ చిత్రంలో పొందుపరిచినట్లు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement