Sachin Shroff
-
50 ఏళ్ల వయసులో రెండో పెళ్లి చేసుకున్న నటుడు, ఫోటోలు వైరల్
ప్రముఖ హిందీ సీరియల్ 'తారక్ మెహతాకా ఉల్టా చష్మా' నటుడు సచిన్ ష్రాప్ 50 ఏళ్ల వయసులో రెండో పెళ్లి చేసుకున్నాడు. ఫిబ్రవరి 25న ఇంటీరియర్ డిజైనర్ చాందినిని వివాహం చేసుకున్నాడు. ఇరుకుటుంబాలు, అతి దగ్గరి బంధుమిత్రులు సహా అత్యంత సన్నిహితులు మాత్రమే ఈ వేడుకకు హాజరయ్యారు. పెళ్లి ఆహ్వానాలు అందుకున్న బుల్లితెర సెలబ్రిటీలు సైతం మండపంలో తెగ సందడి చేశారు. నూతన వధువు చాందిని బ్లూ కలర్ లెహంగాలో మెరిసిపోయింది. ఈ లెహంగాకు ఎల్లో కలర్ దుపట్టాను జత చేయడంతో మరింత అందంగా కనిపించింది. ఎక్కువ నగలు వేసుకుని తక్కువ మేకప్ వేయడంతో స్పెషల్‌గా కనిపించింది. కాగా సచిన్ 2009 ఫిబ్రవరి 15న జుహి పార్మర్ను పెళ్లాడాడు. 2013లో వీరికి పాప సమీరా జన్మించింది. 2018లో భేదాభిప్రాయాలు తలెత్తడంతో ఇద్దరూ విడాకులు తీసుకున్నారు. ఆ పాప తల్లితోపాటే ఉంటోంది. చదవండి: గుర్తుపట్టలేనంతగా మారిపోయిన ప్రేమించుకుందాం రా హీరోయిన్ -
‘జూహి నన్నెప్పుడూ ప్రేమించలేదు’
సాక్షి, ముంబై : గత నెలలో విడాకులు తీసుకున్న బాలీవుడ్ సెలబ్రిటీ కపుల్ సచిన్ ష్రాఫ్, జూహి పర్మార్ ప్రస్తుతం పరస్పరం విమర్శల దాడికి దిగుతున్నారు. ‘మా బ్యాగ్రౌండ్, ఆలోచనా విధానం, అభిరుచులు... ఇలా వేటిలో కూడా పొంతన కుదరలేదు. ఈ బంధం ఎక్కువ కాలం నిలవదని వివాహం జరిగిన మొదటి రోజే నాకు అర్థమైంది. సర్దుకుపోవడానికి చాలా ప్రయత్నించాను. కానీ కుదరలేదు. నిజాయితీగా వ్యవహరించే వాళ్లకి చేదు అనుభవాలే మిగులుతాయని అర్ధమైందంటూ’ జూహి ఓ ఇంటర్వ్యూలో తన మాజీ భర్తపై ఆరోపణలు చేసింది. తాజాగా బాంబే టైమ్స్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సచిన్ ష్రాఫ్ తన మాజీ భార్యపై విమర్శలు గుప్పించాడు. ‘ఒక బంధం నిలవాలంటే ప్రేమ అనేది రెండు వైపులా ఉండాలి. కానీ జూహి నన్నెప్పుడూ ప్రేమించలేదు. నేనేం చేసినా ఆమెకు నచ్చేది కాదు. ప్రేమ లేని పెళ్లికి అసలు అర్థమే ఉండదు కదా. అందుకే విడాకులకు ఒప్పుకున్నాను. నా కూతురి కోసం నా ఆస్తిలో సగం వాటా కూడా రాసిచ్చాను’ అంటూ సచిన్ పేర్కొన్నాడు. 2009లో పెళ్లి చేసుకున్న ఈ జంట గత డిసెంబర్లో విడాకుల కోసం కోర్టును ఆశ్రయించగా.. ఈ ఏడాది విడాకులు మంజూరయ్యాయి. వీరికి సమైరా అనే కూతురు ఉంది. కోర్టు ఆదేశాల ప్రకారం విడాకులు మంజూరైన అనంతరం పాప తల్లి వద్దే ఉంటోంది. అయితే ఆమె పోషణా భారాన్ని తండ్రి భరించాల్సి ఉంటుందన్న ఆదేశాల మేరకు సచిన్ తన ఆస్తిలో సగ భాగాన్ని కూతురి పేరిట రాశాడు. -
కారణాలు చెప్పట్లేదు.. ఇక విడాకులే!
సాక్షి, ముంబై: కాపురంలో కలతలకు కారణం చెప్పకుండానే విడిపోయేందుకు సిద్ధం అవుతోంది ఓ సెలబ్రిటీ జంట. కుమ్కుమ్ సీరియల్‌తో పాపులర్ అయిన నటి జుహీ పర్మార్. భర్త, నటుడు అయిన సచిన్ ష్రాఫ్ నుంచి విడాకులు తీసుకునేందుకు సన్నాహాలు చేసుకుంటోంది. చుడియాన్తో బుల్లితెరకు ఆరంగ్రేటం ఇచ్చిన జుహీ 2002-09 మధ్య కుమ్కుమ్ సీరియల్లో నటన ద్వారా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించేసుకుంది. సాత్ ఫెహ్రీ సీరియల్ నటుడు సచిన్‌తో కొంత కాలం ప్రేమ వ్యవహారం నడిపిన జుహీ 2009లో వివాహం చేసుకున్నారు. వీరికి ఇప్పుడు నాలుగేళ్ల కూతురు సమీరా ఉంది. అయితే గత ఏడాది కారణంగా వీరిద్దరు విడివిడిగా ఉంటున్నారు. ఏ కార్యక్రమానికి కూడా ఈ జంట కలిసి హాజరుకాలేదు. పైగా కూతురు సమీరా తన వద్దే ఉంటోందని సోషల్ మీడియాలో జుహీ అప్ లోడ్ చేసే ఫోటోలను బట్టి సంకేతాలిస్తోంది. మరోవైపు వీరిద్దరిని కలిపేందుకు కుటుంబ సభ్యులు చేసిన ప్రయత్నాలు విజయవంతం కాలేదు. దీంతో త్వరలో ఈ జంట విడాకులకు దరఖాస్తు చేయబోతుందని సమాచారం. అయితే వీరిద్దరి మధ్య గొడవలకు కారణం ఏంటన్నదానిపై మాత్రం ఇప్పటి దాకా స్పష్టత లేకుండా పోయింది. గతంలో మీడియా ఈ వ్యవహారంపై ఆరాతీసేందుకు ప్రయత్నించగా.. ఇద్దరూ స్పందించేందుకు నిరాకరించారు. 36 ఏళ్ల జూహీ పర్మార్ హిందీ బిగ్ బాస్ సీజన్ 5 విజేత కూడా.