
ప్రముఖ హిందీ సీరియల్ 'తారక్ మెహతాకా ఉల్టా చష్మా' నటుడు సచిన్ ష్రాప్ 50 ఏళ్ల వయసులో రెండో పెళ్లి చేసుకున్నాడు. ఫిబ్రవరి 25న ఇంటీరియర్ డిజైనర్ చాందినిని వివాహం చేసుకున్నాడు. ఇరుకుటుంబాలు, అతి దగ్గరి బంధుమిత్రులు సహా అత్యంత సన్నిహితులు మాత్రమే ఈ వేడుకకు హాజరయ్యారు. పెళ్లి ఆహ్వానాలు అందుకున్న బుల్లితెర సెలబ్రిటీలు సైతం మండపంలో తెగ సందడి చేశారు.
నూతన వధువు చాందిని బ్లూ కలర్ లెహంగాలో మెరిసిపోయింది. ఈ లెహంగాకు ఎల్లో కలర్ దుపట్టాను జత చేయడంతో మరింత అందంగా కనిపించింది. ఎక్కువ నగలు వేసుకుని తక్కువ మేకప్ వేయడంతో స్పెషల్‌గా కనిపించింది. కాగా సచిన్ 2009 ఫిబ్రవరి 15న జుహి పార్మర్‌ను పెళ్లాడాడు. 2013లో వీరికి పాప సమీరా జన్మించింది. 2018లో భేదాభిప్రాయాలు తలెత్తడంతో ఇద్దరూ విడాకులు తీసుకున్నారు. ఆ పాప తల్లితోపాటే ఉంటోంది.
చదవండి: గుర్తుపట్టలేనంతగా మారిపోయిన ప్రేమించుకుందాం రా హీరోయిన్
Comments
Please login to add a commentAdd a comment