కారణాలు చెప్పట్లేదు.. ఇక విడాకులే!
కారణాలు చెప్పట్లేదు.. ఇక విడాకులే!
Published Mon, Sep 18 2017 2:18 PM | Last Updated on Tue, Sep 19 2017 4:44 PM
సాక్షి, ముంబై: కాపురంలో కలతలకు కారణం చెప్పకుండానే విడిపోయేందుకు సిద్ధం అవుతోంది ఓ సెలబ్రిటీ జంట. కుమ్‌కుమ్ సీరియల్‌తో పాపులర్ అయిన నటి జుహీ పర్మార్. భర్త, నటుడు అయిన సచిన్ ష్రాఫ్ నుంచి విడాకులు తీసుకునేందుకు సన్నాహాలు చేసుకుంటోంది.
చుడియాన్‌తో బుల్లితెరకు ఆరంగ్రేటం ఇచ్చిన జుహీ 2002-09 మధ్య కుమ్‌కుమ్ సీరియల్‌లో నటన ద్వారా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించేసుకుంది. సాత్ ఫెహ్రీ సీరియల్ నటుడు సచిన్‌తో కొంత కాలం ప్రేమ వ్యవహారం నడిపిన జుహీ 2009లో వివాహం చేసుకున్నారు. వీరికి ఇప్పుడు నాలుగేళ్ల కూతురు సమీరా ఉంది. అయితే గత ఏడాది కారణంగా వీరిద్దరు విడివిడిగా ఉంటున్నారు.
ఏ కార్యక్రమానికి కూడా ఈ జంట కలిసి హాజరుకాలేదు. పైగా కూతురు సమీరా తన వద్దే ఉంటోందని సోషల్ మీడియాలో జుహీ అప్ లోడ్ చేసే ఫోటోలను బట్టి సంకేతాలిస్తోంది. మరోవైపు వీరిద్దరిని కలిపేందుకు కుటుంబ సభ్యులు చేసిన ప్రయత్నాలు విజయవంతం కాలేదు. దీంతో త్వరలో ఈ జంట విడాకులకు దరఖాస్తు చేయబోతుందని సమాచారం. అయితే వీరిద్దరి మధ్య గొడవలకు కారణం ఏంటన్నదానిపై మాత్రం ఇప్పటి దాకా స్పష్టత లేకుండా పోయింది. గతంలో మీడియా ఈ వ్యవహారంపై ఆరాతీసేందుకు ప్రయత్నించగా.. ఇద్దరూ స్పందించేందుకు నిరాకరించారు. 36 ఏళ్ల జూహీ పర్మార్ హిందీ బిగ్ బాస్ సీజన్ 5 విజేత కూడా.
Advertisement