Juhi Parmar
-
‘నా కూతురి కోసం నన్ను బతకనివ్వు’
చావు అంచుల దాకా వెళ్లాను.. నా కూతురి కోసం నన్ను బతికించమని దేవున్ని కోరుకున్నాను. ఆ తర్వాత 5 నిమిషాల్లోనే నా ఆరోగ్య పరిస్థితి మామూలుగా అయ్యింది. ఎవరు నమ్మినా నమ్మకపోయినా నిజంగానే నేను మరణం అంచుల దాకా వెళ్లి వచ్చాను అంటున్నారు హిందీ సిరీయల్ యాక్టర్, బిగ్‌బాస్ 5 కంటెస్టెంట్ జుహీ పర్మార్. తనకు ఎదురైన వింత అనుభవం గురించి ఇన్స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు జుహీ. ‘మొన్న హోలీ పండుగ నాడు నా బెస్ట్ ఫ్రెండ్ ఆష్కా గోరడియా వాళ్ల ఇంట్లో ఉన్నాను. రాత్రి 10.30 - 11 గంటల సమయంలో సడెన్‌గా నా ఆరోగ్యం చెడిపోయింది. వాంటింగ్ వస్తున్నట్లు అనిపించింది. ముక్కు మూసుకుపోయి ఉపిరాడకుండా ఉక్కిరిబిక్కిరి అయ్యింది. శరీరంలోంచి ఏదో బయటకు వెళ్లి పోయినట్లు అనిపించింది. ఓ ఐదు నిమిషాల పాటు ఏం జరుగుతుందో నాకు అర్థం కాలేదు. ఇక నేను చనిపోతానని అర్థమయ్యింది. నోట్లో నుంచి మాట రావడం లేదు. ఆ సమయంలో ఒక్కసారిగా నా జీవితం అంతా నా కళ్ల ముందు నిలిచింది. అప్పుడు నేను విడాకులు తీసుకున్నానని, సింగిల్ పేరెంట్నని కానీ.. నేను ఎదుర్కోన్న కష్టాలు కానీ ఇవేవి నాకు గుర్తుకు రాలేదు. నా కూతురు నవ్వు మొహం మాత్రమే నాకు కనిపించింది. నేను చనిపోతే తన పరిస్థితేంటనే ఆందోళన ఎక్కువయింది’. ‘పక్కనే ఉన్న నా స్నేహితురాలు ఆష్కా గోరడియాను సైగల ద్వారా పిలిచాను. ఇక నుంచి నా కూతురి బాధ్యత తనదేనని సైగల ద్వారానే చెప్పాను. నా ఆత్మ నా శరీరం నుంచి వేరుపడటానికి సిద్ధంగా ఉంది. నేను నా కూతరికి ఏం చేయలేకపోయాను. ఆ విషయం నాకు గుర్తుకురాగానే నా గుండెను చిక్కబట్టుకున్నాను. ఆ సమయంలో నేను దైవంతో మాట్లాడటం ప్రారంభించాను. ఇదంతా జరుగుతున్నప్పుడు డాక్టర్లు, నర్సులు, నా స్నేహితురాలు అందరు నాకు కొద్ది దూరంలోనే ఉన్నారు. కానీ జరుగుతున్న విషయం గురించి వారికి తెలియడం లేదు. నేను దైవంతో సంభాషించడం మొదలుపెట్టాను. జీవితాన్ని ఆషామాషీగా తీసుకున్నందుకు.. ఫలితం లేకుండా జీవించినందుకు.. ఆశీర్వాదాలు వదిలి.. ఆశ వెంట పరుగులు తీసినందుకు నన్ను క్షమించమని వేడుకున్నాను. కానీ నా కూతురు కోసం నన్ను బతకనికవ్వు అంటూ ప్రాధేయపడ్డాను. ఆ తరువాత మరో ఐదు నిమిషాల్లోనే నా బీపీ, ఈసీజీ, మెడికల్ రిపోర్ట్స్ అన్ని నార్మల్‌గా మారాయి’ అని సుదీర్ఘ పోస్ట్ పెట్టారు జుహీ. అంతేకాక ‘ఇది రాసే సమయానికి నేను నా పాత శరీరంలోనే ఉన్నాను. కానీ నా ఆత్మ మారిపోయింది. నా విషయంలో జరిగిన ప్రతిదానికి నేను సంతోషంగా ఉన్నాను.. కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నేను కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నాను. దాంతో ఈ విషయాన్ని మీతో పంచుకోవాలని భావించాను. మన జీవితంలో జరిగే ప్రతి దానికి కృతజ్ఞతలు తెలపడం చాలా మంచిది. ఎందుకంటే నేనైనా, మీరైనా మనందరం మనుషులమే’ అంటూ పోస్ట్ చేశారు. View this post on Instagram Dear Life, I Am Here To Live!!!! A post shared by Juhi Parmar (@juhiparmar14) on Mar 28, 2019 at 8:17am PDT -
‘జూహి నన్నెప్పుడూ ప్రేమించలేదు’
సాక్షి, ముంబై : గత నెలలో విడాకులు తీసుకున్న బాలీవుడ్ సెలబ్రిటీ కపుల్ సచిన్ ష్రాఫ్, జూహి పర్మార్ ప్రస్తుతం పరస్పరం విమర్శల దాడికి దిగుతున్నారు. ‘మా బ్యాగ్రౌండ్, ఆలోచనా విధానం, అభిరుచులు... ఇలా వేటిలో కూడా పొంతన కుదరలేదు. ఈ బంధం ఎక్కువ కాలం నిలవదని వివాహం జరిగిన మొదటి రోజే నాకు అర్థమైంది. సర్దుకుపోవడానికి చాలా ప్రయత్నించాను. కానీ కుదరలేదు. నిజాయితీగా వ్యవహరించే వాళ్లకి చేదు అనుభవాలే మిగులుతాయని అర్ధమైందంటూ’ జూహి ఓ ఇంటర్వ్యూలో తన మాజీ భర్తపై ఆరోపణలు చేసింది. తాజాగా బాంబే టైమ్స్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సచిన్ ష్రాఫ్ తన మాజీ భార్యపై విమర్శలు గుప్పించాడు. ‘ఒక బంధం నిలవాలంటే ప్రేమ అనేది రెండు వైపులా ఉండాలి. కానీ జూహి నన్నెప్పుడూ ప్రేమించలేదు. నేనేం చేసినా ఆమెకు నచ్చేది కాదు. ప్రేమ లేని పెళ్లికి అసలు అర్థమే ఉండదు కదా. అందుకే విడాకులకు ఒప్పుకున్నాను. నా కూతురి కోసం నా ఆస్తిలో సగం వాటా కూడా రాసిచ్చాను’ అంటూ సచిన్ పేర్కొన్నాడు. 2009లో పెళ్లి చేసుకున్న ఈ జంట గత డిసెంబర్లో విడాకుల కోసం కోర్టును ఆశ్రయించగా.. ఈ ఏడాది విడాకులు మంజూరయ్యాయి. వీరికి సమైరా అనే కూతురు ఉంది. కోర్టు ఆదేశాల ప్రకారం విడాకులు మంజూరైన అనంతరం పాప తల్లి వద్దే ఉంటోంది. అయితే ఆమె పోషణా భారాన్ని తండ్రి భరించాల్సి ఉంటుందన్న ఆదేశాల మేరకు సచిన్ తన ఆస్తిలో సగ భాగాన్ని కూతురి పేరిట రాశాడు. -
కారణాలు చెప్పట్లేదు.. ఇక విడాకులే!
సాక్షి, ముంబై: కాపురంలో కలతలకు కారణం చెప్పకుండానే విడిపోయేందుకు సిద్ధం అవుతోంది ఓ సెలబ్రిటీ జంట. కుమ్కుమ్ సీరియల్‌తో పాపులర్ అయిన నటి జుహీ పర్మార్. భర్త, నటుడు అయిన సచిన్ ష్రాఫ్ నుంచి విడాకులు తీసుకునేందుకు సన్నాహాలు చేసుకుంటోంది. చుడియాన్తో బుల్లితెరకు ఆరంగ్రేటం ఇచ్చిన జుహీ 2002-09 మధ్య కుమ్కుమ్ సీరియల్లో నటన ద్వారా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించేసుకుంది. సాత్ ఫెహ్రీ సీరియల్ నటుడు సచిన్‌తో కొంత కాలం ప్రేమ వ్యవహారం నడిపిన జుహీ 2009లో వివాహం చేసుకున్నారు. వీరికి ఇప్పుడు నాలుగేళ్ల కూతురు సమీరా ఉంది. అయితే గత ఏడాది కారణంగా వీరిద్దరు విడివిడిగా ఉంటున్నారు. ఏ కార్యక్రమానికి కూడా ఈ జంట కలిసి హాజరుకాలేదు. పైగా కూతురు సమీరా తన వద్దే ఉంటోందని సోషల్ మీడియాలో జుహీ అప్ లోడ్ చేసే ఫోటోలను బట్టి సంకేతాలిస్తోంది. మరోవైపు వీరిద్దరిని కలిపేందుకు కుటుంబ సభ్యులు చేసిన ప్రయత్నాలు విజయవంతం కాలేదు. దీంతో త్వరలో ఈ జంట విడాకులకు దరఖాస్తు చేయబోతుందని సమాచారం. అయితే వీరిద్దరి మధ్య గొడవలకు కారణం ఏంటన్నదానిపై మాత్రం ఇప్పటి దాకా స్పష్టత లేకుండా పోయింది. గతంలో మీడియా ఈ వ్యవహారంపై ఆరాతీసేందుకు ప్రయత్నించగా.. ఇద్దరూ స్పందించేందుకు నిరాకరించారు. 36 ఏళ్ల జూహీ పర్మార్ హిందీ బిగ్ బాస్ సీజన్ 5 విజేత కూడా.