Sadavarthi choultry lands
-
'సదావర్తి వేలం రద్దు చేయలేం'
హైదరాబాద్: అత్యంత విలువైన సదావర్తి భూముల వేలాన్ని రద్దు చేయాలని దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు మంగళవారం కొట్టివేసింది. వేలాన్ని ఆపాలంటూ తమ ముందుకు వచ్చిన పిటిషన్‌పై న్యాయస్థానం విచారణ జరిపింది. సదావర్తి వేలం నిలిపివేతకు తగిన కారణాలు లేవని అభిప్రాయపడింది. పిటిషన్ దాఖలు చేసిన బ్రాహ్మణ సమాఖ్య.. వేలం నిలిపివేత దిశగా నిర్ణయం తీసుకునేలా సహేతుక కారణాలు చూపటంలో విఫలమైందని న్యాయమూర్తి పేర్కొన్నారు. ప్రస్తుతం వేలాన్ని రద్దు చేయలేమని, అక్రమాలు జరిగినట్లు ఆధారాలతో వస్తే.. మరోమారు పరిశీలించి విచారణ జరిపేందుకు అభ్యంతరం లేదని కోర్టు పేర్కొంది. -
'సదావర్తి భూములు అప్పనంగా కట్టబెట్టింది'
చెన్నై : సదావర్తి సత్రం భూములను టీడీపీ ప్రభుత్వం తమ అనుచరులకు అప్పనంగా కట్టబెట్టిందని సీపీఐ నాయకుడు నారాయణ ఆరోపించారు. బుధవారం చెన్నైలోని సదావర్తి భూములను ఆయన పరిశీలించారు. అలాగే తమిళనాడులోని తిరుచ్చేరి, తాళంబూర్లోని సదావర్తి భూముల వివరాలను కూడా సేకరించినట్లు నారాయణ పేర్కొన్నారు. కాగా చెన్నై మహానగరంలోని సదావర్తి సత్రానికి చెందిన దాదాపు 22 ఎకరాల భూమిని ఆంధ్రప్రదేశ్‌కు చెందిన టీడీపీ నాయకుడు కారు చౌకగా కొనుగోలు చేశారు. ఈ నేపథ్యంలో దీనిపై ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ... ధర్మాన ప్రసాదరావు అధ్యక్షతన నిజనిర్ధారణ బృందాన్ని ఏర్పాటు చేసింది. ఇటీవలే ఈ బృందం ఈ భూములను పరిశీలించి... నివేదికను ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డికి అందజేసిన సంగతి తెలిసిందే.