చెన్నై : సదావర్తి సత్రం భూములను టీడీపీ ప్రభుత్వం తమ అనుచరులకు అప్పనంగా కట్టబెట్టిందని సీపీఐ నాయకుడు నారాయణ ఆరోపించారు. బుధవారం చెన్నైలోని సదావర్తి భూములను ఆయన పరిశీలించారు. అలాగే తమిళనాడులోని తిరుచ్చేరి, తాళంబూర్లోని సదావర్తి భూముల వివరాలను కూడా సేకరించినట్లు నారాయణ పేర్కొన్నారు.
కాగా చెన్నై మహానగరంలోని సదావర్తి సత్రానికి చెందిన దాదాపు 22 ఎకరాల భూమిని ఆంధ్రప్రదేశ్కు చెందిన టీడీపీ నాయకుడు కారు చౌకగా కొనుగోలు చేశారు. ఈ నేపథ్యంలో దీనిపై ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ... ధర్మాన ప్రసాదరావు అధ్యక్షతన నిజనిర్ధారణ బృందాన్ని ఏర్పాటు చేసింది. ఇటీవలే ఈ బృందం ఈ భూములను పరిశీలించి... నివేదికను ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్రెడ్డికి అందజేసిన సంగతి తెలిసిందే.