safe journey
-
‘నా ఆటో సేఫ్’ అనే భావన కలిగించాలి
రసూల్‌పురా: నగర ప్రజలకు ఆటోలో ప్రయాణించడం ద్వారా భద్రత ఉంటుందనే భావన కల్పించేందుకు ప్రతి ఆటో డ్రైవర్ కృషి చేయాలని నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ అన్నారు. నార్త్‌జోన్ ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో మంగళవారం కంటోన్మెంట్ టివోలీ గార్డెన్లో ఏర్పాటు చేసిన ‘మై ఆటో ఈజ్ సేఫ్’ కార్యక్రమానికి సీపీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ ‘మై ఆటో ఈజ్ సేఫ్’ ద్వారా ప్రయాణికులను సురక్షితంగా ఇంటికి చేర్చే బాధ్యత ఆటో డ్రైవర్లపై ఉందన్నారు. ఆటో డ్రైవర్లు మోసాలు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే క్యూకోడ్ ద్వారా తక్షణపై పట్టుకునే అవకాశం ఉంటుందన్నారు. నగరంలో 90 వేల ఆటోలు ‘మై ఆటో ఈజ్ సేఫ్’ రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు తెలిపారు. ఈ ఆటోలలో ప్రయాణికులు ఎలాంటి భయం లేకుండా ప్రయాణం చేయవచ్చునన్నారు. క్యూఆర్ కోడ్ విధానాన్ని నగరంలోని ప్రతి ఆటోకు విస్తరించేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలిపారు. పోలీసుల సహాయం అవసరమైతే 100 నంబర్‌కు డయల్ చేయాలని సూచించారు. 100 వంద మంది కానిస్టేబుళ్లు నిరంతరం ప్రజలకు సేవ చేస్తున్నారని, ప్రతి రోజూ 4వందల సమస్యలను పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. అదనపు కమిషనర్ షికా గోయల్ మాట్లాడుతూ నగరంలో కొందరు ఆటో డ్రైవర్ల వేషభాషల్లో మార్పు రావాల్సిన అవసరం ఉందన్నారు. ఆటోల్లో ప్రయాణించాలంటే మహిళలు అభద్రతకు లోనవుతున్నారని, వాటిని పోగోట్టే బాధ్యత ఆటో డ్రై వర్లదే అన్నారు. సురక్షిత నగరమే కాకుండా సురక్షితంగా ప్రయాణించగలమనే నమ్మకాన్ని కలిగించాలని సూచించారు. లా అండ్ ఆర్డర్ అదనపు కమిషనర్ చౌహాన్, ట్రాఫిక్ అదనపు కమిషనర్ అనిల్‌కుమార్ మాట్లాడుతూ ‘మైఆటో ఈజ్ సేఫ్’ కార్యక్రమంలో భాగంగా ప్రతిరోజు వెయ్యి మంది డ్రై వర్లు రిజిస్టేషన్ చేయించుకునేందుకు ముందుకు వస్తున్నారని తెలిపారు. ఆటోకు వెనుక, ముందు స్టిక్కర్, డ్రై వర్ సీటు వెనుక భాగంలో యూవీ ప్రింటెడ్ మెటల్ బోర్డు ఏర్పాటు చేస్తున్నామన్నారు. దీని వల్ల ఆటో ఓనర్ పూర్తి వివరాలు తెలుస్తాయన్నారు. -
సిటీ బస్సుల్లో ‘సేఫ్’ జర్నీ!
సాక్షి, సిటీబ్యూరో : బస్సుల రాకపోకలపై ప్రయాణికులకు ఇక నుంచి ప్రత్యక్ష సమాచారం లభించనుంది. నగరంలోని ఎంఎంటీఎస్ రైళ్ల రాకపోక లపై ‘హైలైట్స్’ మొబైల్ అప్లికేషన్ ద్వారా ప్రయాణికులకు ప్రత్యక్ష సమాచారం అందజేస్తున్న తరహాలోనే బస్సుల రాకపోకలపైన ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెలియజేసేందుకు ‘సేఫ్’ (సొసైటీ ఫర్ యాక్సిడెంట్ ఫ్రీ ఎన్విరాన్మెంట్) అనే సంస్థతో ఆర్టీసీ తాజాగా ఒప్పందం చేసుకుంది. ఈ సంస్థ రోడ్లపై నడిచే బస్సుల కదలికలను ఎప్పటికప్పుడు నమోదు (వెహికల్ ట్రాకింగ్) చేయడంతో పాటు, బస్సుల రాకపోకలపైన ప్రయాణికులకు ప్రత్యక్ష సమాచారాన్ని అందజేస్తుంది. ఇందుకోసం అన్ని చోట్ల ఎల్ఈడీ బోర్డులను ఏర్పాటు చేస్తారు. మొదట ఏసీ బస్షెల్టర్లతో ప్రారంభించి ఆ తరువాత క్రమంగా నగరంలోని అన్ని బస్టాపులకు ఈ ప్రత్యక్ష సమాచార బోర్డులను విస్తరిస్తారు. అలాగే ప్రయాణికులు తమ మొబైల్ ఫోన్లలో సేఫ్ యాప్ ద్వారా కూడా బస్సుల రాకపోకలపై ప్రత్యక్ష సమాచారాన్ని తెలుసుకోవచ్చు. దీంతో ఇంటి నుంచి బయలుదేరే సమయంలోనే తాను ఎక్కాల్సిన బస్సు ఇంకా ఎంత దూరంలో ఉన్నది, ఏ సమయానికి తాను ఉన్న చోటుకు వస్తుందనే వివరాలు ప్రయాణికుడికి తెలిసిపోతాయి. అలాగే సేఫ్ సాంకేతిక పరిజ్ఞానం ద్వారా లభించే డేటాను ‘టీ–సవారీ’లో అప్డేట్ చేస్తారు. దీంతో ప్రయాణికులకు ఈ యాప్ ద్వారా ఓలా, ఊబర్ తదితర వాహనాలతో పాటు బస్సుల వివరాలు కూడా లభిస్తా యి. మెట్రో రైల్వేస్టేషన్లకు అందుబాటులో ఉన్న బస్సుల వివరాలను ప్రత్యక్షంగా తెలుసుకోవచ్చు. ఇప్పటికే గ్రేటర్ ఆర్టీసీలో 1200 బస్సులకు వీటీపీఐఎస్ (వెహికల్ ట్రాకింగ్ అండ్ ప్యాసింజర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్) టెక్నాలజీనీ అమలు చేస్తున్నారు. కానీ ఇది మొక్కుబడిగానే అమలవుతోంది. ప్ర యాణికులకు ఆశించిన స్థాయిలో ప్రయోజనాలు లభించడం లేదు. దీన్ని దృష్టిలో ఉంచుకొని అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వెహికల్ ట్రాకింగ్, ప్యాసింజర్ ఇన్ఫర్మేషన్ వ్యవస్థను అమలు చేసేందుకు సేఫ్ సంస్థతో ఆర్టీసీ ఒప్పందం చేసుకుంది. మొదట నగరంలోని అన్ని ఏసీ, మెట్రో లగ్జరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్, ఆర్డినరీ బస్సులకు సేఫ్ వెహికల్ ట్రాకింగ్ వ్యవస్థను అమలు చేసి ఆ వివరాలను ప్రయాణికుల మొబైల్ ఫోన్‌కు, బస్టాపుల్లోని ఎల్ఈడీ బోర్డులకు అనుసంధానం చేస్తారు. గ్రేటర్ హైదరాబాద్‌లోని 3650 బస్సులకు ఈ టెక్నాలజీని అమలు చేసిన అనంతరం తెలంగాణలోని 10,093 బస్సులకు దీనిని విస్తరిస్తారు. హైలైట్స్ తరహాలో సమాచారం.. గ్రేటర్లో బస్షెల్టర్ల ఆధునీకరణకు అనుగుణంగా బస్సుల సమాచారం అందుబాటులో లేకపోవడం పెద్ద లోపంగా ఉంది. నగరంలోని 26 ఎంఎంటీఎస్ రైల్వేస్టేషన్లు, సికింద్రాబాద్; నాంపల్లి, కాచిగూడ, మల్కాజిగిరి తదితర ప్రధాన స్టేషన్ల ద్వారా ప్రతి రోజు ఉదయం 4 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు రాకపోకలు సాగించే 121 ఎంఎంటీఎస్ సర్వీసుల ప్రత్యక్ష సమాచారాన్ని తెలియజేసేందుకు ‘హైలైట్స్’ దోహదం చేస్తుంది. ఈ యాప్ ద్వారా ప్రయాణికులు తాము ఎదురు చూస్తున్న రైల్వేస్టేషన్‌కు ఎంఎంటీఎస్ ఎంత దూరంలో ఉన్నదీ ప్రత్యక్షంగా తెలిసిపోతుంది. సరిగ్గా ఇలాంటి పరిజ్ఞానం ద్వారానే బస్సుల రాకపోకలను ప్రయాణికులకు అప్డేట్ చేస్తారు. బస్టాపులను జియో ఫెన్సింగ్ చేస్తారు. ప్రధాన కార్యాలయంలోని సర్వర్ రూమ్ నుంచి ఈ మొత్తం వ్యవస్థను నియంత్రిస్తారు. మొదట నగరంలో అమలు చేసిన తరువాత హైదరాబాద్–బెంగళూరు, హైదరాబాద్–విజయవాడ, మెట్టుపల్లి–కరీంనగర్, హైదరాబాద్–వరంగల్ వంటి ప్రధాన రూట్లకు విస్తరిస్తారు. టి–సవారీతో అనుసంధానం... మరోవైపు ఈ సమాచారాన్ని టి–సవారీతో అనుసంధానం చేయడం వల్ల ప్రయాణికుడికి ఒకే సమ యంలో అన్ని రకాల ప్రజారవాణా వాహనాల సమాచారం అందుబాటులోకి వస్తుంది. తద్వారా వాటిలో ఏదో ఒక దానిని ఎంపిక చేసుకొని బయలుదేరవచ్చు. ఉదాహరణకు మియాపూర్ నుంచి అమీర్‌పేట్ వరకు మెట్రో రైల్లో వచ్చిన వ్యక్తికి తాను ట్రైన్ దిగే సమయానికి అమీర్‌పేట్‌లో బస్సు, ఓలా, ఊబెర్, ఎలక్ట్రిక్ వెహికల్స్, బైక్స్ వంటి వాటిలో ఏది అందుబాటులో ఉంటే అందులో బయలుదేరవచ్చు. సేఫ్ సంస్థ నుంచి ఆర్టీసీకి లభించే ఈ సాంకేతిక పరిజ్ఞానం పూర్తిగా ఉచితం. ఇందుకు ప్రతిగా వ్యాపార ప్రకటనలపైన ఆ సంస్థ ఆదాయాన్ని ఆర్జించనుంది. ఒకటి, రెండు నెలల్లో ఈ సరికొత్త సాంకేతిక వ్యవస్థ ఆచరణలోకి రావచ్చునని ఆర్టీసీ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. -
మెట్రో రాకతో సగం తీరిన ట్రాఫిక్ కష్టాలు
-
ఆర్టీసీలో సురక్షిత ప్రయాణం
33 మంది ప్రమాద రహిత డ్రైవర్లకు సన్మానం నెల్లూరు (టౌన్): సురిక్షిత ప్రయాణానికి ఆర్టీసీ చిరునామని ఏఎస్పీ శరత్‌బాబు తెలిపారు. బుధవారం స్థానిక ఆర్టీసీ డిపో–1 గ్యారేజిలో ప్రమాద రహిత వారోత్సవాలు ముగింపు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న శరత్‌బాబు మట్లాడుతూ గతంతో పోల్చుకుంటే ప్రస్తుతం వాహనాల సంఖ్య పెరిగిందన్నారు. రోడ్డు నిబంధనలపై ప్రజల్లో అవగాహన లేక ప్రమాదాల బారిన పడుతున్నారన్నారు. వాహనాలను కండిషన్లో ఉంచడంతో పాటు డ్రైవర్లు అంకిత భావంతో పనిచేయాలని సూచించారు. ప్రాంతీయ రవాణాశాఖాధికారి పూర్ణచంద్రరావు మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా ఏడాదికి రోడ్డు ప్రమాదాల్లో 15వేల మందికి పైగా మృతి చెందుతున్నారన్నారు. ఇది తుపాన్, సునామిలాంటి వాటికన్నా ఎక్కువుగా ఉందన్నారు. ట్రాఫిక్ రూల్స్ పట్ల ప్రజల్లో చైతన్యం వస్తే తప్ప ప్రమాదాలు తగ్గే అవకాశం లేదన్నారు. ఆర్టీసీఈడీ రవీంద్రబాబు మాట్లాడుతూ 2015–16కు సంబంధించి నెల్లూరు రీజియన్‌లో ప్రమాదాల్లో మృతిచెందిన కుటుంబాలకు రూ.2 కోట్ల పరిహారం చెల్లించినట్లు తెలిపారు. ఒక్క ప్రమాదం కూడా చేయని 33 మంది డ్రైవర్లను ఘనంగా సన్మానించి, ప్రశంసా పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో ఆర్ఎం రవివర్మ, డిపో–1, డిపో–2 మేనేజర్లు శీనయ్య, సీఐలు పాల్గొన్నారు. -
ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం సురక్షితం
జవహర్ నగర్: ప్రైవేటు వాహనాల్లో ప్రయాణం ప్రమాదకరమని, ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణమే సురక్షితమని, అంతుకే మారుమూల ప్రాంతాలకు ఆర్డీసి సేవసలను విస్తరించనున్నట్లు ఎంపీపీల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు బొల్లెబోయిన చంద్రశేఖర్‌యాదవ్ అన్నారు. ఆదివారం గబ్బిలాలపేట నుండి సికింద్రాబాద్‌కు 24బిజి నెంబర్ బస్సును ప్రాంరంభించిన ఆయన.. వివిధ జిల్లాల నుండి వలసవచ్చి గబ్బిలాలపేట పరిసర ప్రాంతాలలో నివసిస్తున్నవారు దాదాపు 20వేల పైచిలుకు ఉంటారని, నగరాకి వెళ్లి పనిచేసుకునే వీరు ఇన్నాళ్లు ప్రైవేటు వాహనాల్లో ప్రయాణించేవారని, ఇప్పుడు ఆర్టీసీ బస్సు సర్వీసు రావడం ఆనందంగా ఉన్నదన్నారు. గ్రామజ్యోతి పధకం ద్వారా మారుమూల ప్రాంతాల్లో మౌలికసదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వ అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు.