Safely Home
-
పైలట్ సురక్షితంగా తిరిగి రావాలి: అసద్
సాక్షి, హైదరాబాద్: పాకిస్తాన్ భూభాగంలో కూలిపోయిన మిగ్ 21 విమా న పైలట్ సురక్షితంగా తిరిగి రావాలని ఎంఐ ఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఆకాంక్షించారు. బుధవారం ఆయన ఈ మేరకు ‘వీర పైలట్ కోసం ప్రార్థన చేస్తున్నాం. అతని కుటుంబం ధైర్యంగా ఉండాలి’అని ట్వీట్ చేశారు. జెనీవా ఒప్పందంలోని ఆర్టికల్ 3 ప్రకారం.. బందీలైన ఇతర దేశ సైనికుల పట్ల మానవత్వంతో వ్యవహరించాలన్నారు. పైలట్ బాగోగులు చూసుకోవాల్సిన బాధ్యత పాకిస్తాన్‌దేనని స్పష్టం చేశారు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను పక్కన పెట్టి ఐఏఎఫ్ పైలట్ విషయంలో పాకిస్తాన్ మానవత్వంతో మెలిగి, అతన్ని వదిలేయాలన్నారు. -
మొబైల్ వాడుతూ డ్రైవింగ్ చేస్తున్నారా..?
మొబైల్లో తలపెడితే ప్రపంచంతో సంబంధం లేదన్నట్లు ప్రవర్తిస్తున్నారా..? రోడ్డుపై నడిచేటప్పుడు.. డ్రైవింగ్ చేసేటప్పుడు.. మొబైల్లో లీనం అవుతున్నారా..? అయితే ఈ వీడియో చూడండి తప్పకుండా రియలైజ్ అవుతారు.. డ్రైవింగ్ చేస్తూ మొబైల్ వాడటం.. రోడ్డుపై నడుస్తూ చాట్ చేయడంతో ఎలాంటి ప్రమాదాలు జరుగుతాయో కళ్లకు కట్టేలా దక్షిణాఫ్రికా పశ్చిమ కేప్ ప్రభుత్వం 40 సెకన్ల యాడ్‌ను రూపొందించింది. రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా ‘సేఫ్లీ హోమ్’ కార్యాక్రమంతో ఈ వీడియోను యూట్యూబ్‌లో విడుదల చేసింది. మిలియన్ల వ్యూస్ అందుకున్నఈ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. మొబైల్లో లీనమై నడుస్తూ ప్రమాదానికి గురైన సంఘటనలు, డ్రైవింగ్ చేస్తూ టెక్ట్స్ మెసెజ్‌లు పంపుతూ రోడ్డు ప్రమాదానికి గురైన దృశ్యాలను వీడియోలో పొందుపరిచింది. ఇంకెందుకు ఆలస్యం మీరు వీడియో చూడండి జాగ్రత్తగా ఉండండి.