
సాక్షి, హైదరాబాద్: పాకిస్తాన్ భూభాగంలో కూలిపోయిన మిగ్ 21 విమా న పైలట్ సురక్షితంగా తిరిగి రావాలని ఎంఐ ఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఆకాంక్షించారు. బుధవారం ఆయన ఈ మేరకు ‘వీర పైలట్ కోసం ప్రార్థన చేస్తున్నాం. అతని కుటుంబం ధైర్యంగా ఉండాలి’అని ట్వీట్ చేశారు. జెనీవా ఒప్పందంలోని ఆర్టికల్ 3 ప్రకారం.. బందీలైన ఇతర దేశ సైనికుల పట్ల మానవత్వంతో వ్యవహరించాలన్నారు. పైలట్ బాగోగులు చూసుకోవాల్సిన బాధ్యత పాకిస్తాన్‌దేనని స్పష్టం చేశారు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను పక్కన పెట్టి ఐఏఎఫ్ పైలట్ విషయంలో పాకిస్తాన్ మానవత్వంతో మెలిగి, అతన్ని వదిలేయాలన్నారు.