విభిన్నంగా ‘డెరైక్టర్’
సగారెడ్డి హీరోగా నటిస్తూ... స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం ‘డెరైక్టర్’. నిధి నాత్యాల్ కథానాయిక. హర్ష్ వ్యాస్ స్వరాలందించిన ఈ చిత్రం పాటలను, ప్రచార చిత్రాలను హైదరాబాద్‌లో విడుదల చేశారు.
తమ్మారెడ్డి భరద్వాజ్, అశోక్‌కుమార్, వీరశంకర్, వీఎన్ ఆదిత్య, రామ్‌ప్రసాద్, దేవి ప్రసాద్ ఈ కార్యక్రమానికి అతిథులుగా హాజరై పాటలతో పాటు, సినిమా కూడా విజయం సాధించాలని ఆకాంక్షించారు. విభిన్నంగా సినిమా ఉంటుందని, ఈ నెల 21న చిత్రాన్ని విడుదల చేస్తామని సగారెడ్డి తెలిపారు.
సంగీత దర్శకునిగా తనకు అవకాశం ఇచ్చిన సగారెడ్డికి హర్ష్వ్యాస్ కృతజ్ఞతలు తెలిపారు. ఇంకా యూనిట్ సభ్యులు మాట్లాడారు.