sagayam
-
తమిళనాడు ఎన్నికల్లో ‘రంగం’ సినిమా రిపీట్
‘రంగం’ సినిమాలో మాదిరి కొందరు యువకులు కలిసి ఏర్పాటుచేసిన పార్టీ ఎన్నికల్లో ఎలా పోటీ చేస్తుందో అదే విధంగా తమిళనాడులో ప్రస్తుతం అదే పరిస్థితి ఏర్పడింది. తమిళనాడు ఎన్నికల్లో 36 మంది యువకులు తలపండిన రాజకీయ నాయకులను ఢీకొననున్నారు. ఆ యువశక్తి వెంట ఓ శక్తి ఉంది. ఆయనే యు.సగాయం. ఆయన మాజీ ఐఏఎస్ అధికారి. ఆయన ఇంజనీర్లు, డాక్టర్లు, న్యాయవాదులు, ఎంబీఏ గ్రాడ్యుయేట్లను ఎన్నికల రాజకీయాల్లోకి దింపనున్నారు. అవినీతికి వ్యతిరేకంగా సగాయం పోరాటం చేస్తున్నాడు. అందులో భాగంగా ఆయన తమిళనాడు ఇలయంగ్ కట్చీ (టీఎన్‌ఐకే) అనే ఒక పార్టీ స్థాపించాడు. అందులో అంతా యువకులే పని చేస్తున్నారు. దశాబ్ద కాలం పాటు అవినీతికి వ్యతిరేకంగా సాగిస్తున్న ఉద్యమంలో భాగంగా ఈ ఎన్నికలను వాడుకోనున్నారు. ఈ క్రమంలోనే మొత్తం 20 స్థానాల్లో తమ పార్టీ తరఫున యువకులు పోటీ చేస్తున్నట్లు ఆ మాజీ ఐఏఎస్ అధికారి సగాయం ప్రకటించారు. ఈ మేరకు వారిలో కొంత మంది సోమవారం నామినేషన్లు దాఖలు చేశారు. 15 మంది అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేయనున్నట్లు తెలిపారు. కొలాత్‌పూర్, రోయాపూర్, అన్నానగర్, అవడీ, అలాందుర్, మధురవోయల్, చెంగల్పట్టు తదితర ప్రాంతాల్లో ఆయన శిష్యులు పోటీ చేస్తున్నారు. అన్ని స్థానాల్లో పోటీ చేసే శక్తి తమకు లేదని.. అందుకే విద్యావంతులు అధికంగా ఉన్న పట్టణ ప్రాంతాల్లో పోటీ చేస్తున్నట్లు సగాయం మీడియాకు చెప్పారు. ఇది మొదటి అడుగు.. అని ప్రజల్లోకి ఉద్యమం తీసుకెళ్లేందుకు ఎన్నికలు దోహదం చేస్తాయని తెలిపారు. భవిష్యత్‌లో మొత్తం రాష్ట్రంలోని అన్ని స్థానాల్లో తాము పోటీ చేసేందుకు సిద్ధమని సగాయం ప్రకటించారు. అయితే ముఖ్యమంతత్రి పళనిస్వామి నియోజకవర్గం ఎడప్పాడిలో పోటీ చేయడం లేదని చెప్పడం గమనార్హం. సగాయం గతంలో మధురైలో అక్రమ గనుల తవ్వకాలను అడ్డుకున్నారు. యూత్‌లో మంచి ఫాలోయింగ్ ఉన్న వ్యక్తి. ఐఏఎస్‌గా ఉన్న సమయంలో తన పనితీరుతో అందరికీ కంట్లో నలుసుగా ఉన్నారు. అందుకే ఆ బాధ్యతల్లో ఉన్న 27 ఏళ్లల్లో అనేకసార్లు బదిలీలు జరిగాయి. అవినీతికి వ్యతిరేకంగా సాగిస్తున్న పోరాటంలో ఎన్నికలు ఒక భాగం మాత్రమే అని సగాయం ప్రకటిస్తున్నారు. -
గ్రానైట్ క్వారీలో నరబలులపై విచారణ
మధురై: తమిళనాడులోని మధురై జిల్లాలో జరిగిన గ్రానైట్ అవినీతిపై మద్రాసు హైకోర్టు ఆదేశాల మేరకు ఐఏఎస్ అధికారి సహాయం విచారణ జరిపి నివేదిక దాఖలు చేశారు. గతంలో గ్రానైట్ అవినీతిపై సహాయం విచారణ జరిపినప్పుడు కీళవలవు సమీపంలోని కంబర్ మలై పట్టికి చెందిన సేవర్కుడియోన్ అనే వ్యక్తి పీఆర్పీ సంస్థాపకుడు కొంతమంది సిబ్బందిని నరబలి ఇచ్చినట్లు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు విచారణ అధికారి అయిన సహాయం, పోలీసులు, ఆదాయశాఖ సమక్షంలో గత 2015 సెప్టెంబర్ నెల మణిముత్తారు శ్మశానంలో ఎముకలు వెలికి తీశారు. ఎముకలను వేలిముద్ర నిపుణులు ద్వారా మృతి చెందినవి స్త్రీల, పురుషులా? మృతి చెందిన వారి వయసు, వారిని ఖననం చేసి ఎన్ని సంవత్సరాలు పూర్తి అయ్యాయి? వంటి విషయాలపై ఇప్పటికే నివేదిక దాఖలు చేశారు. ఈ క్రమంలో మృతి చెందిన వారి బంధువులు 11 మందిని గుర్తించి వారివద్ద డీఎన్ఏ పరీక్షలు చేయడానికి ప్రభుత్వ ఆసుపత్రికి వారందరినీ పోలీసులు పిలుచుకుని వెళ్లి పరీక్షలు జరిపారు. వైద్య ఫలితాల నివేదిక వచ్చిన అనంతరం నిజానిజాలు తెలుస్తాయని పోలీసులు తెలిపారు. -
23 ఏళ్లలో.. 24 బదిలీలు!!
ఆయనో సీనియర్ ఐఏఎస్ అధికారి. పనిచేసేది తమిళనాడులో. 23 ఏళ్ల సర్వీసులో ఆయనకు 24 బదిలీలు వచ్చాయి. అంతేకాదు.. కేవలం 48 గంటల వ్యవధిలో కూడా రెండుసార్లు బదిలీ అయిన చరిత్ర ఆయనకుంది. అలాంటి అధికారిని తమిళనాడులో అక్రమ గ్రాఫైట్ తవ్వకాలపై దర్యాప్తు చేయాల్సిందిగా కోర్టు సూచించింది. ఆయన పేరు యు.సహాయం (52). గత వారంలోనే ఆయనకు రెండుసార్లు ఏమాత్రం ప్రాధాన్యం లేని పోస్టులు ఇచ్చారు. చివరకు ఇంత సమర్ధుడిగా కోర్టు గుర్తించిన వ్యక్తిని కో-ఆప్టెక్స్ అధినేతగా కూడా రెండేళ్ల పాటు నియమించారు. తాజాగా.. తమిళనాట సాగుతున్న గ్రాఫైట్ తవ్వకాలపై మద్రాసు హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. మదురై కలెక్టర్‌గా ఉన్న సమయంలో ఈ స్కామును బయటపెట్టిన ఐఏఎస్ అధికారి సహాయంను ఎందుకు తరచు బదిలీ చేస్తున్నారని కోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. గడిచిన 23 సంవత్సరాల్లో ఆయనకు 24 బదిలీలు బహుమతిగా వచ్చాయి. గత బుధవారం ఆయన్ను భారతీయ వైద్యం, హోమియోపతి కమిషనర్‌గా నియమించారు. రెండు రోజులు కూడా గడవకముందే అక్కడినుంచి సైన్స్ సిటీ వైస్ చైర్మన్‌గా మార్చారు. రాష్ట్ర చేనేతశాఖ మంత్రి ఎస్.గోకుల్ ఇందిరతో గొడవల వల్లే ఆయన్ను అంతలా బదిలీ చేశారని అంటున్నారు. ఇప్పుడు మళ్లీ కోర్టు జోక్యంతో ఆయనకు సరైన పోస్టింగ్ రావచ్చని చెబుతున్నారు.