దుర్గాప్రసాదరాజుకు జగన్ పరామర్శ
సాక్షి, హైదరాబాద్: రోడ్డు ప్రమాదంలో గాయపడి విశ్రాంతి తీసుకుంటున్న వైఎస్సార్సీపీ నేత సాగి దుర్గాప్రసాదరాజును పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం ఉదయం పరామర్శించారు. ప్రశాసన్‌నగర్‌లోని రాజు నివాసానికి జగన్ వెళ్లి ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. రాజంపేట ఎంపీ పి.వి.మిథున్‌రెడ్డి, పార్టీ నేతలు జి.ఆదిశేషగిరిరావు, గుడివాడ అమర్నాథ్, పి.సర్రాజు, రాజీవ్‌కృష్ణ కూడా రాజును పరామర్శించిన వారిలో ఉన్నారు.