sahakara elections
-
సహకార సమరానికి బ్రేక్
సాక్షి, వరంగల్ రూరల్: ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఎన్నికలు ముచ్చటగా మూడో సారి వాయిదా పడ్డాయి. గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో సహకార సమరానికి బ్రేక్ పడింది. ఇందుకు అనుగుణంగా కమిషనర్ నుంచి ఉన్నతాధికాలకు ఉత్తర్వులు జారీ చేశారు. రైతుల సంక్షేమం, ఆర్థికాభివృద్ధికి సమష్టి నిర్ణయాలు తీసుకోవాలనే ఉద్దేశంతోనే సహకార వ్యవస్థను ప్రారంభించారు. రైతులు సంఘాలుగా ఏర్పడి తమ సమస్యల పరిష్కారం, అభివృద్ధికి బాటలు వేసుకున్నారు. అయితే సంఘాలు మరింత పటిష్టంగా ఉండాలనే లక్ష్యంతో ప్రతి ఐదేళ్లకు ఒకసారి ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఎన్నికల నిర్వహణలో పలు ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని పలు మార్పులు తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. తొలిసారిగా ఫొటో ఓటరు జాబితాను ప్రవేశపెట్టారు. గత ఏడాది డిసెంబర్ 28న సహకార సంఘాల ఓటరు జాబితాను ప్రకటించారు. 32 సంఘాలు.. జిల్లాలో 32 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు ఉన్నాయి. పరకాల నియోజకవర్గంలో 13, నర్సంపేట నియోజకవర్గంలో 13, వర్ధన్నపేట నియోజకవర్గంలోని వర్ధన్నపేట, పర్వతగిరి మండలాల్లో 3, పాలకుర్తి నియోజకవర్గంలోని రాయపర్తిలో 2, భూపాలపల్లి నియోజకవర్గం శాయంపేట మండలంలో ఒక సంఘం ఉంది. కాగా కొన్ని సహకార సంఘాల పాలకవర్గం గడువు 2018 జనవరి 30, మరి కొన్ని ఫిబ్రవరి 4వ తేదీ ముగిసింది. అయితే ఎన్నికల ప్రక్రియ నిర్వహించేందుకు అవసరమైన సమయం లేకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం గడువు ముగిసిన పాలక వర్గాలకే పర్సన్‌ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించింది. తొలుత ఫిబ్రవరి, ఆగస్టు మాసాల్లో వాయిదా పడ్డాయి. ప్రస్తుతం ముచ్చటగా మూడోసారి సహకార సంఘాల ఎన్నికలు వాయిదా పడ్డాయి. కాగా సంగెం పాలక వర్గం మాత్రం 2020 ఆగస్టు వరకు కొనసాగనుంది. పార్లమెంట్ తర్వాతేనా.. రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ ఎన్నికల కంటే ముందే సహకార ఎన్నికలు నిర్వహించాలని కసరత్తు చేసింది. హైకోర్టు ఆదేశాలతో పంచాయతీ ఎన్నికల నిర్వహణ అనివార్యమైంది. జీపీ ఎన్నికలు ముగిసిన తర్వాతనైన సహకార ఎన్నికలు జరుగుతాయని సంఘాల సభ్యులు, ఓటర్లు భావించగా మరోసారి వాయిదా పడింది. ఫిబ్రవరిలో నిర్వహించకుంటే మార్చిలో పార్లమెంట్ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత వెనువెంటనే మునిసిపల్ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల అవుతుంది. ఈ నేపథ్యంలో పార్లమెంట్ లేదా మునిసిపల్ ఎన్నికలు పూర్తయ్యే వరకు సహకార సంఘాల ఎన్నికలు నిర్వహించే అవకాశాలు కనిపించడం లేదు. గత డిసెంబర్ 28న సహకార సంఘాల సభ్యుల ఓటరు లిస్టులను ప్రకటించారు. దాదాపు ఎన్నికలకు కావల్సిన అన్ని ఏర్పాట్లను సహకార శాఖ ఏర్పాట్లను చేసింది. కొత్త జిల్లాల ప్రకారం ఎన్నికలు నిర్వహించాలని రాజకీయ నాయకుల నుంచి ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది. వాయిదా పడ్డాయి.. సహకార సంఘాల ఎన్నికలు వాయి దా పడ్డాయి. గత ఏడాది జనవరి, ఫిబ్రవరిలోనే సహకార సంఘాల పాలకవర్గం గడువు ముగిసింది. డిసెంబర్ 28న ఓటరు జాబితను ప్రకటించాం. ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు రాగానే ఎన్నికలు నిర్వహిస్తాం. 31 సంఘాలకు ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశాం. – పద్మ, జిల్లా సహకార అధికారి -
‘సహకారం’ వాయిదా?
మంచిర్యాలఅగ్రికల్చర్: పంచాయతీ ఎన్నికల అనంతరం ఫిబ్రవరిలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసిన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఎన్నికలు మరోసారి వాయిదా పడ్డట్లు సమాచారం. నిన్నటి వరకు ఎన్నికల సిబ్బందికి శిక్షణ, ఏర్పాట్లులో బిజీగా ఉన్న సహకార శాఖ అధికారులు పార్లమెంట్ ఎన్నికల అనంతరం నిర్వహించేలా మంగళవారం సూచనలు రావడంతో అంతా నిశబ్దం అయ్యారు. ఈనెలలో పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. వచ్చే ఫిబ్రవరి 15వ తేదీలోగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధం చేయాలని గతనెల 12న ఆదేశాలు అందాయి. రాష్ట్ర సహకార సంఘాల కమిషనర్, రిజిస్టర్ ఆదేశాలతో ఉమ్మడి జిల్లాలోని సహకారశాఖ అధికారులకు ఓటరు జాబితా, ఎన్నికల అధికారులకు శిక్షణ, రిటర్నింగ్ అధికారుల నియామకం తదితర ఏర్పాట్లు చేశారు. బ్యాలెట్ పేపర్ల ముద్రణ ఒకటి మాత్రమే మిగిలి ఉంది. ఈ సమయంలో లోక్‌సభ ఎన్నికల అనంతరం సహకార ఎన్నికలు నిర్వహించేలా సూత్రప్రాయంగా ఆదేశాలు రావడంతో మంగళవారం నుంచి ఎన్నికల నిర్వహణ పనులు నిలిపివేశారు. ఇప్పటికే ప్రాథమిక సహకార సంఘాల కార్యాలయాల్లో, గ్రామపంచాయతీ, మండల కార్యాలయంలో ఓటరు జాబితాను అంటించారు. వీటిపై అభ్యంతరాలను స్వీకరించి తుది జాబితా సిద్ధం చేశారు. వచ్చే నెలలో ఎన్నికలు నిర్వహించడమే తరువాయి అనుకున్న సమయంలో తాజాగా ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాలు ఎన్నికల ఏర్పాట్లకోసం నిధులను ఖర్చు చేయరాదని తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఎలాంటి ఎన్నికల ఖర్చు చేపట్టరాదని తెలపడంతో అధికారులు అయోమయంలో పడ్డారు. సహకార ఎన్నికలు కొన్ని అభ్యంతరాలతో పాటు, పూర్తిస్థాయిలో ఎన్నికలకు సన్నద్ధం కాకపోవడంతో పాటు లోక్‌సభ ఎన్నికల అనంతరం జూన్, జూలైలో నిర్వహించాలనే ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తుంది. పదవీకాలం ముగిసిన సహకార సంఘాలకు ప్రభుత్వం ప్రత్యేక ఆర్డినెన్స్ ద్వారా గత జనవరిలోనే పాలక వర్గాల గడువును తొలి విడుతలో ఆరు నెలలకు పెంచింది. ఇప్పటికే రెండుమార్లు పెంచి మరోమారు పెంచేందుకు సిద్ధమయినట్లు తెలుస్తోంది. మూడుసార్లు వాయిదా.. ఇప్పటికే ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల పాలకవర్గాల పవవీకాలం రెండు సార్లు పొడిగించింది. ముచ్చటగా మూడోసారి కూడా గడువు పొడగించక తప్పేలా లేదు. ఈ మేరకు సంకేతాలందినట్లు అధికారులు చెబుతున్నారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు ప్రస్తుతం కొనసాగుతున్న పర్సన్ ఇన్చార్జీలను మరో ఆరునెలలుపాటు పొడిగించాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తుంది. ఉమ్మడి జిల్లాలో 77 సహకార సంఘాలు ఉన్నాయి. వీటిలో గత ఎన్నికల్లో 1.20 లక్షల మంది రైతులకు సభ్యత్వం ఉంది. గత పాలకవర్గాల గత ఫిబ్రవరి 3వ తేదీతో సహకార సంఘాల పాలకవర్గాల పదవీకాలం ముగిసింది. ఫిబ్రవరి 4 నుంచి 6 నెలలపాటు పాలకవర్గాల పదవీకాలన్ని పెంచారు. సహకార సంఘాల్లో అవినీతి, అక్రమాల ఆరోపణలు ఎదుర్కొన్న వారి స్థానంలో ప్రత్యేక అధికారులు నియమించారు. వీరు సహకార కమిషన్ కార్యాలయానికి వెళ్లి పదవీకాలన్నీ పొడిగించారు. ఆగస్టుతో ముగిసింది. తిరిగి మళ్లీ ఆరు నెలల కాలం పదవీకాలన్నీ పొడిగించారు. సహకార సంఘాలకు ఉమ్మడి రాష్ట్రంలో 2013లో అప్పటి ప్రభుత్వం సొసైటీలకు ఎన్నికలు నిర్వహించింది. 2017 ఫిబ్రవరితో గడువు ముగిసింది. పాలవర్గం పదవీకాలం రెండు మార్లు పెంచారు. ఈ గడువు వచ్చే ఫిబ్రవరి 3న గడువు ముగియనుండడంతో ఫిబ్రవరి 5 నుంచి 15లోగా ఎన్నికలు నిర్వహించేలా ఏర్పాటు చేశారు. కాని తాజా ఆదేశాలలో మళ్లీ ఇనాచార్జీల పాలన కొనసాగనుంది. తదుపరి ఆదేశాలు వచ్చాకే ఎన్నికలు ఎన్నికల నిర్వహణకు ఇప్పటి వరకు 12 జీవోలు విడుదల చేసింది. కాని ఎన్నికల నిర్వహణ నిధులు ఖర్చు చేయకూడదని సూత్రప్రాయంగా ఆదేశాలు అందాయి. ఇప్పటికే ఎన్నికల జరిపేందుకు సహకార కమిషనర్, రిజిస్ట్రార్ కార్యాలయం నుంచి ఓటరు జాబితా సిద్ధం చేశాం. ఎన్నికల అధికారుల నియామకం, శిక్షణ, బ్యాలెట్ పేపర్ల నిర్వహణ ఒక్కటే మిగిలి ఉంది. ఇప్పటే వరకు ఎన్నికను నిలిపివేయాలని అధికారికగా ఆదేశాలు అందలేదు. – బి.సంజీవ్‌రెడ్డి, మంచిర్యాల జిల్లాల సహకార శాఖ అధికారి -
సహకార ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ జయకేతనం
అనంతపురం జిల్లాలో సొసైటీల ఎన్నికల్లో రైతుల తీర్పు ఏడింటిలో ఆరు పీఏసీఎస్‌లు కైవసం జేసీ బ్రదర్స్, మంత్రి శైలజానాథ్ ఎత్తుల చిత్తు కాంగ్రెస్-టీడీపీల దోస్తీకి చెంపపెట్టు సాక్షి ప్రతినిధి, అనంతపురం: అనంతపురం జిల్లా సహకార ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ మద్దతుదారులు ఘన విజయం సాధించారు. కాంగ్రెస్, టీడీపీల కుయుక్తులకు చెంపపెట్టులా రైతులు తీర్పునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏడాది క్రితం సహకార ఎన్నికలు జరిగిన విషయం విదితమే. అనంతపురం జిల్లాలో 116 ప్రాథమిక సహకార పరపతి సంఘాల(పీఏసీఎస్)కు గానూ 109 సొసైటీలకు మాత్రమే నాడు ఎన్నికలు జరిగాయి. శాంతిభద్రతల సాకుచూపి తాడిపత్రి నియోజకవర్గంలోని పెద్దవడుగూరు, వేములపాడు, శింగనమల నియోజకవర్గంలోని పుట్లూరు, రాప్తాడు నియోజకవర్గంలోని పి.యాలేరు, రామగిరి, కదిరి నియోజకవర్గంలోని తలుపుల, పెనుకొండ నియోజకవర్గంలోని బూదిలి పీఏసీఎస్‌ల ఎన్నికలను నాడు వాయిదా వేశారు. వాటికి శుక్రవారం ఎన్నికలు నిర్వహించగా.. ఏడింటికి ఆరు పీఏసీఎస్‌లను వైఎస్సార్సీపీ మద్దతుదారులు భారీ మెజారిటీతో చేజిక్కించుకున్నారు. జేసీ బ్రదర్స్ టీడీపీలో చేరేందుకు ముహూర్తాన్ని ఖరారు చేసుకున్నారన్న వార్తల నేపథ్యంలో తమ నియోజకవర్గంలోని వేములపాడు, పెద్దవడుగూరు పీఏసీఎస్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. శింగనమల నియోజకవర్గంలోని పుట్లూరు సొసైటీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ మద్దతుదారుల విజయాన్ని అడ్డుకునే బాధ్యతను జేసీ ప్రభాకర్‌రెడ్డికి మంత్రి శైలజానాథ్ అప్పగించారు. ముందే కుదుర్చుకున్న ఒప్పందం మేరకు ఆ మూడు స్థానాల్లోనూ కాంగ్రెస్-టీడీపీలు సంయుక్తంగా మద్దతుదారులను బరిలోకి దించాయి. డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు చేశారు. కాంగ్రెస్, టీడీపీ నేతలు గ్రామాల్లో భయోత్పాతాన్ని సృష్టించారు. అయినప్పటికీ పుట్లూరు, పెద్దవడుగూరు సొసైటీలను వైఎస్సార్ సీపీ మద్దతుదారులు భారీ మెజారిటీతో గెలుచుకున్నారు. పెద్దవడుగూరులో 13 డెరైక్టర్ల స్థానాలుం డగా ఒక అభ్యర్థి చనిపోవడంతో ఆ స్థానానికి ఎన్నికలు జరగలేదు. వేములపాడు సొసైటీని సీపీఐ మద్దతుతో వైఎస్సార్ సీపీ చేజిక్కించుకోనుంది. జేసీ సోదరుల కోటలో ఈ గెలుపు అనంతరం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సమన్వయకర్త వి.ఆర్.రామిరెడ్డిని అభినందిస్తూ భారీ ఎత్తున ఊరేగింపు జరిపారు. టీడీపీ నేతల దౌర్జన్యం..: టీడీపీ ఎమ్యెల్యే పరిటాల సునీత ప్రాతినిధ్యం వహిస్తున్న రాప్తాడు నియోజకవర్గంలో రామగిరి, పి. యాలేరు సొసైటీలకు జరిగిన ఎన్నికల్లో పోలీసుల సాయంతో సునీత సోదరుడు బాలాజీ భయోత్పాతం సృష్టించారు. వైఎస్సార్ సీపీ నేతలు ముకుందనాయుడు, అమర్నాథ్రెడ్డిలు ప్రయాణిస్తోన్న వాహనంపై రాళ్ల వర్షం కురిపించారు. అయినప్పటికీ పోలీసులు.. వైఎస్సార్ సీపీ నేతలనే అరెస్టు చేశారు. భయోత్పాతాని సృష్టించడం ద్వారా రామగిరి సొసైటీని టీడీపీ మద్దతుదారులు చేజిక్కించుకున్నారు. హిందూపురం ఎంపీ నిమ్మల కిష్టప్ప (టీడీపీ) సొంత మండలం గోరంట్ల పరిధిలోని బూదిలి పీఏసీఎస్‌ను వైఎస్సార్ సీపీ మద్దతుదారులు గెలుచుకున్నారు.