Sahara Housing
-
రూ. 1,000 కోట్లు జమ చేయండి
న్యూఢిల్లీ: గ్రూప్ సంస్థల రూ.25,000 కోట్ల అక్రమ డిపాజిట్ సమీకరణకు సంబంధించి సెబీ కేసులో 15 రోజుల్లోగా రూ. 1,000 కోట్లను ప్రత్యేక ఎస్క్రో ఖాతాలో జమ చేయాలని సహారా గ్రూప్ కంపెనీలను సుప్రీంకోర్టు గురువారం ఆదేశించింది. దీనితోపాటు రూ.10,000 కోట్ల సమీకరణకుగాను ముంబైలోని వెర్సోవాలో తన భూమిని అభివృద్ధి చేయడానికి, ఈ విషయంలో జాయింట్ వెంచర్ ఒప్పందంలోకి ప్రవేశించడానికి సైతం సుప్రీం అనుమతించింది. అత్యున్నత న్యాయస్థానం 2012 ఆదేశాలకు అనుగుణంగా ఇన్వెస్టర్ల సొమ్మును తిరిగి ఇవ్వడానికి రూ. 10,000 కోట్ల మొత్తాన్ని సెబీ–సహారా రిఫండ్ ఖాతాలో జమ చేయాల్సి ఉంటుంది. లేదంటే.. భూమి విక్రయానికి స్వయంగా చర్యలు జాయింట్ వెంచర్/డెవలప్మెంట్ ఒప్పందాన్ని 15 రోజుల్లోగా కోర్టులో దాఖలు చేయాల్సి చేయాలి. అనంతరం ఈ ఒప్పందానికి అత్యున్నత న్యాయస్థానం ఆమోదముద్ర తప్పనిసరి. లేని పక్షంలో వెర్సోవాలోని 12.15 మిలియన్ చదరపు అడుగుల భూమిని విక్రయించడానికి సుప్రీం తగిన చర్యలు తీసుకుంటుందని న్యాయమూర్తులు సంజీవ్ ఖన్నా, ఎంఎం సుందరే‹Ù, బేల ఎం త్రివేదిలతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. ‘‘సహార సంస్థలు– ఎస్ఐఆర్ఈసీఎల్, ఎస్హెచ్ఐసీఎల్ (రెండూ సహారా గ్రూప్ కంపెనీలు)కు మేము 15 రోజుల సమయం మంజూరు చేస్తున్నాము. జాయింట్ వెంచర్/డెవలప్మెంట్ ఒప్పందాన్ని 15 రోజులలోపు దాఖలు చేయకపోతే, వెర్సోవా భూమిని విక్రయానికి కోర్టు చర్యలు చేపడుతుంది’’ అని బెంచ్ పేర్కొంది. ‘‘ఈ పక్రియ కోసం థర్డ్పారీ రూ. 1,000 కోట్లు జమచేస్తే, దీనిని సెబీ ఎస్క్రో ఖాతాలో ఉంచడం జరుగుతుంది. ఒకవేళ ఈ కోర్టు ఆమోదం/అనుమతి (జాయింట్ వెంచర్ అగ్రిమెంట్కు) మంజూరు చేయకపోతే, ఆ మొత్తాన్ని (జమ చేసిన మొత్తాన్ని) తిరిగి థర్డ్పారీ్టకి చెల్లించడం జరుగుతుంది’’అని కూడా ధర్మాసనం వివరించింది.చెల్లింపులకు 10 యేళ్ల సుదీర్ఘ వెసులుబాటు రూ.25,000 కోట్ల తిరిగి డిపాజిట్ చేయడానికి సహారాకు సుప్రీం దాదాపు 10 సంవత్సరాల సుదీర్ఘ సమయం ఇచ్చి ఎంతో వెసులుబాటు కలి్పస్తున్న విషయాన్ని కూడా ధర్మాసనం ఈ సందర్భంగా సంస్థ తరఫున వాదనలు వినిపిస్తున్న కపిల్ సిబల్కు గుర్తు చేసింది. ఇదే కేసులో సహారా గ్రూప్ చీఫ్ సుబ్రతోరాయ్ సుదీర్ఘకాలం తీహార్ జైలులో ఉండాల్సిన పరిస్థితి ఉత్పన్నం కావడం గమనార్హం. తల్లి మరణం అనంతరం అంతిమ సంస్కారాల కోసం జైలు నుంచి బెయిల్పై బయటకు వచి్చన ఆయన, కొద్ది నెలల క్రితం తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. -
రూ. 62,603 కోట్లు కట్టాల్సిందే..
న్యూఢిల్లీ: అత్యున్నత న్యాయస్థానం గత ఆదేశాలకు అనుగుణంగా రెండు సహారా సంస్థలు... ఎస్ఐఆర్ఈసీఎల్ (సహారా ఇండియా రియల్ ఎస్టేట్ కార్పొరేషన్ లిమిటెడ్), ఎస్హెచ్ఐసీఎల్ (సహారా హౌసింగ్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్లు రూ.62,602.90 కోట్లు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని మార్కెట్ రెగ్యులేటర్ సెబీ తాజాగా సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సెప్టెంబర్ 30 నాటికి జరపాల్సిన ఈ మొత్తాలను సెబీ–సహారా రిఫండ్ అకౌంట్లో జమచేయడంలో విఫలమైతే, సహారా గ్రూప్ సుబ్రతారాయ్ని తిరిగి కస్టడీలోకి తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని కోరింది. ఈ నెల 18న సెబీ దాఖలు చేసిన పిటిషిన్లో ముఖ్యాంశాలు, కేసు పూర్వాపరాలను చూస్తే... ► సహారా గ్రూప్ సంస్థలు రెండు ఎస్ఐఆర్ఈసీఎల్ , ఎస్హెచ్ఐసీఎల్ నిబంధనలకు విరుద్దంగా ఇన్వెస్టర్ల నుంచి భారీ నిధులు సమీకరించాయన్నది ప్రధాన ఆరోపణ. ► 2012, జూన్ 14న సహారా దాఖలు చేసిన స్టేట్మెంట్ల ప్రకారం, 2012 ఏప్రిల్ 30వ తేదీ నాటికి ఎస్ఐఆర్ఈసీఎల్ చెల్లించాల్సిన అసలు రూ.16,997 కోట్లు. ఎస్హెచ్ఐసీఎల్ విషయంలో ఈ మొత్తం రూ. 6,352 కోట్లు. అసలుతోపాటు అప్పటికి చెల్లించాల్సిన వడ్డీసహా ఈ మొత్తాలను రూ.25,781.32 కోట్లుగా లెక్కతేల్చారు. ► సెబీ దాఖలు ఒక పిటిషన్పై అత్యున్నత న్యాయస్థానం 2012 ఆగస్టు 31న ఒక రూలింగ్ ఇస్తూ, వ్యక్తిగత ఇన్వెస్టర్ల నుంచి డబ్బు తీసుకున్న నాటి నుంచీ 15 శాతం చొప్పున వడ్డీతోసహా మూడు నెలల్లోపు చెల్లింపులు జరపాలని ఆదేశించింది. చెల్లింపులు జరిపిన విషయాన్ని డాక్యుమెంట్లుసహా సెబీకి సమర్పించాలని కూడా సహారాకు న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చింది. ► అయితే డబ్బు చెల్లింపు ప్రక్రియలో ఇన్వెస్టర్ల చిరునామాలు, బ్యాంక్ అకౌంట్ల విషయంలో నెలకొన్న వివాదాలు, సందేహాల నేపథ్యంలో జమ మొత్తాలను ప్రత్యేక సెబీ–సహారా రిఫండ్ అకౌంట్లో జమచేయాలని ఉన్నత న్యాయస్థానం సూచించింది. ► అయితే 2012 ఉత్తర్వుల తర్వాత సహారా సంస్థలు ఇప్పటి వరకూ రూ.15,455.70 కోట్ల్ల మొత్తాలనే డిపాజిట్ చేశాయని సెక్యూరిటీస్ అండ్ ఎక్సే్చంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా– సెబీ తా జాగా పేర్కొంది. వివిధ జాతీయ బ్యాంకుల్లో ఈ మొత్తాలను ఫిక్స్డ్ డిపాజిట్ చేసినట్లు వెల్లడించింది. 2020, సెప్టెంబర్ 30వ తేదీ నాటికి వడ్డీ తోసహా సెబీ–సహారా రిఫండ్ అకౌంట్ ఆర్జన రూ.22,589.01 కోట్లకు చేరినట్లు పేర్కొంది. ► చెల్లించాల్సింది రూ.రూ.25,781.32 కోట్లయితే, చెల్లించింది రూ.15,455.70 కోట్లు. వెరసి చెల్లించాల్సిన అసలు రూ.10,325.62 కోట్లని సెబీ పేర్కొంది. 2012 ఆగస్టు 31వ తేదీన అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాల ప్రకారం 15% వడ్డీని కూడా పరిగణనలోకి తీసుకుంటే, 2020 సెప్టెబర్ 30వ తేదీ నాటికి సహారా చెల్లించాల్సిన మొత్తాలు రూ.62,602.90 కోట్లకు చేరినట్లు సెబీ తాజాగా సుప్రీంకోర్టుకు విన్నవించింది. ► బకాయిల చెల్లింపులకు సుప్రీం ఎన్ని అవకాశాలు కల్పించినా వాటిని వినియోగించుకోకుండా, సహారా గ్రూప్ సంస్థలు, ఆ సంస్థల చీఫ్ కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని విమర్శించింది. ► ఈ కేసులో 2014 మార్చి 4వ తేదీ నుంచీ 2016 మే 6వ తేదీ వరకూ (డైరెక్టర్లు రవి శంకర్ దుబే, అశోక్రాయ్ చౌదరిసహా) తీహార్ జైలులో ఉన్న సుబ్రతా రాయ్ తల్లి మరణం నేపథ్యంలో అంతిమ సంస్కారాల కోసం విడుదలయ్యారు. సహారా ఆస్తులు అమ్మి అయినా, చెల్లింపులు జరుపుతామని హామీ ఇచ్చిన రాయ్, ఈ దిశలో ఎలాంటి చర్యలు తీసుకోకుండా, కోర్టు ఇచ్చిన అవకాశాలను దుర్వినియోగం చేస్తున్నట్లు తాజాగా సెబీ ఆరోపించింది. -
సహారా లెక్కల్లో అవకతవకలు: సెబీ
న్యూఢిల్లీ: ఇన్వెస్టర్లకు నిధుల రిఫండ్ కేసుకి సంబంధించి సహారా గ్రూప్ ట్రక్కులకొద్దీ సమర్పించిన పత్రాల్లో భారీగా అవకతవకలు ఉన్నట్లు సెబీ వర్గాలు తెలిపాయి. పెద్ద ఎత్తున బోగస్ ఇన్వెస్టర్ల పేర్లను ఈ పత్రాల్లో చేర్చి ఉంటారన్న సందేహాలు ఉన్నట్లు వివరించాయి. దీంతో, అసలైన ఇన్వెస్టర్లను గుర్తించేందుకు ప్రాంతీయ భాషా పత్రికలతో పాటు ఇతర మాధ్యమాల్లో కూడా బహిరంగ ప్రకటనలు ఇవ్వాలని సెబీ యోచిస్తున్నట్లు ఆ వర్గాలు పేర్కొన్నాయి. పేర్లు మొదలుకుని చిరునామాలు, దరఖాస్తు తేదీలు వంటివి చాలా మటుకు ఒకదానితో మరొకటి పొంతన లేకుండా ఉన్నట్లు తెలిపాయి. దీన్ని బట్టి చూస్తే మనీలాండరింగ్ జరిగి ఉంటుందన్న అనుమానాలు రేకెత్తుతున్నట్లు పేర్కొన్నాయి. వందలకొద్దీ స్కానర్లు, కంప్యూటర్లు, సిబ్బం ది సహాయంతో పలు నెలల పాటు సహారా పత్రాలను సెబీ పరిశీలించింది. చివరికి సహారా నుంచి అప్షనల్లీ ఫుల్లీ కన్వర్టబుల్ డిబెంచర్లను తీసుకున్నట్లుగా భావిస్తున్న 3 కోట్ల ఇన్వెస్టర్ల దరఖాస్తుల పరిశీలన పూర్తి చేసింది. సంబంధిత వర్గాల ప్రకారం.. ఒకే పేరుతో వందల కొద్దీ అకౌంట్లు, వివిధ చిరునామాలు ఉన్నాయి. కొన్ని దరఖాస్తుల్లో జాతీయ రహదారులు, ఊళ్లు, పట్టణాలు, రోడ్ల పేర్లను చిరునామాలుగా పేర్కొన్నారు. మరికొన్నింటిలో వోచర్ తేదీ కన్నా ముందే రిఫండ్ తేదీలు ఉన్నాయి.