నవ్వింత: నాన్నకు డబ్బులు వేస్ట్!
మా పాపకు ఎనిమిదేళ్లు. మేం చెన్నైలో ఉన్నప్పుడు తను ఫస్ట్ క్లాస్ చదువుతున్నది. ఒకరోజు నేను డిన్నర్ ప్రిపేర్ చేస్తున్నప్పుడు, తను నన్ను ఒక డౌట్ అడిగింది- ‘అమ్మా నీకు నాన ఎలా వచ్చాడు’ అని. అప్పుడు నేను, ‘మీ నానని కొనుక్కున్నానమ్మా’ అని చెప్పా.
‘అరె నాన బ్యాడ్ నాన కదా. డబ్బులు వేస్ట్ చేసి ఎందుకు కొనుక్కున్నావ్’ అంది. ‘నా సెలక్షన్ కాదుమా, అమ్మమ్మవాళ్లు తెచ్చిచ్చారు’ అన్నా. ఇంతలో స్నానం చేసి, అప్పుడే మావారు హాల్లోకి వచ్చారు. జరిగింది చెప్పా. వాళ్ల నాన్న కోపంగా చూశారు తన వైపు. వెంటనే తను, ‘నాన నువ్వు వెరీ వెరీ గుడ్ నాన. జోక్‌గా చెప్పాను.
నువ్వు మంచి నానవు’ అంటూ వాళ్ల నాన్నని పట్టుకుంది. అది తనలో ఒకవైపే. సెకెండ్ క్లాస్‌లో ఉన్నప్పుడు తనకు బాగా ఫీవర్ వచ్చింది. చిల్డ్రన్ హాస్పిటల్‌కి తీసుకెళ్లాను. ఫుల్ రష్‌గా ఉంది. టోకెన్ తీసుకొని తనని కూర్చోబెట్టేందుకు వెయిటింగ్ రూమ్‌కి తీసుకెళ్లా. అక్కడ ఒక సీట్ మాత్రమే ఉంది. కూర్చోమ్మా అన్నా. కానీ తను కూర్చోలేదు. ‘ఫరవాలేదుమా, నేను నిలబడే ఉంటా. నువ్వు కూర్చో’ అంది. తను వినలేదు, నన్నే కూర్చోమంది. అంత ఫీవర్‌లో కూడా నేను కూర్చొని, తనని నాపై కూర్చోబెట్టుకున్నా. ఆ టైమ్‌లో కూడా తనకి టెంపరేచర్ ఉన్నా, తనన్న మాటకు ఆనందంతో నా కళ్లు చెమ్మగిల్లాయి.
- శైలజ మనోహర్
తిరుపతి
ముఖచిత్ర లేఖనం: వాసు