ట్రాక్టర్‌తో రైతును ఢీకొట్టి హత్య
చిత్తూరు: ఇసుక మాఫియా ఆగడాలు మితిమీరుతున్నాయి. తమకు అడ్డొచ్చిన వారిని అంతం చేసేందుకు కూడా వెనుకాడడం లేదు. చిత్తూరు జిల్లాలో ఇసుక మాఫియా ఓ రైతు ప్రాణాలను బలితీసుకుంది. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకునేందుకు ప్రయత్నించిన రైతును ట్రాక్టర్‌తో ఢీకొట్టి హత్య చేశారు. వరదాయపాలెం మండలం సాకంబేడు వద్ద ఈ దారుణం చోటుచేసుకుంది.
దుండగులను పట్టుకునేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. రాష్ట్ర వాప్తంగా ఇసుక మాఫియా ఆగడాలు నానాటికీ పెరిగిపోతున్నాయి. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకుంటున్న అధికారులను సైతం చంపేందుకు వెనుకాడడం లేదు. బరితెగిస్తున్న ఇసుక మాఫియాకు ఇకనైనా అడ్డుకట్ట వేయాలని ప్రజానీకం కోరుకుంటున్నారు.